సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవా తరంగం
అహంకారాన్ని తగ్గించుకోటానికి మనసుకు సుఖశాంతులతో నింపుకోటానికి సేవను మించిన సాధన ఏమున్నది? సేవ చేయటం చిన్నతనంగా భావించటం చాలా తప్పు. అందువల్ల జరిగేదేమిటి సేవ వల్ల కలిగే సత్ఫలితాలను పోగొట్టకోటమే అందువల్ల ఒరిగేది. అందర్నీ కలుపుకొని పోతూ దేశమంతటా సేవా తరంగం పెల్లుబికితే ఈ ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు , ఆశాలోభాల దిబ్బలన్నీ ఆ తరంగం కింద తుడిచిపెట్టుకుని పోతాయి. సాటివారి కష్టం చూసి స్పందించే విధంగా నీ హృదయాన్ని తీర్చిదిద్దుకో. ప్రపంచాన్ని ప్రేమతో నింపు. నీవు చేయరాదనుకున్న పనిని చేయమని నీవు ఇంకొకరికి చెప్పకుండా ప్రేమ నిన్ను నిరోధిస్తుంది. నీ అంతరాత్మ నీవు దారి తప్పితే వెంటనే హెచ్చరించింది.
సేవలో విచక్షణ
ఒకతను సముద్రపు ఒడ్డున నడిచి పోతుంటే అక్కడ ఇసుకపై ఒక చేప గిల గిల కొట్టుకోవడం కనిపించింది. దానిపై అమిత దయతో అతడు దానినితీసి తన చేతి గుట్టలో చుట్టుకొని ఇంటికి వచ్చి మృదువైన తన పరుపుపై పడుకోబెట్టాడు. ఆ చేప పాపం ఇంకాబాధతో గిలగిలలాడింది. దాని కష్టం చూసి అతని మనస్సు కరిగింది. వెంటనే వేడి వేడి కాఫి చేయించి దాని నోట్లో పోసేవాడు. అది ప్రాణం విడిచింది.
చేపను తాను మొదట చూసినపుడే నీటిలో వదిలి వేస్తే సరిపోయేది. ఆ పని చేయక, తెలివి తక్కువగా ఏమేమో చేసి దానిప్రాణం తీశాడు, కనుక,, సేవాకార్య క్రమంలో విచక్షణ, వివేకం అత్యవసరం.
అర్పిస్తున్నదేమిటి?
‘నేను పలువిధాలుగా పూజలు, సేవలు సల్పినా భగవంతుడు నాకే సహాయమూ చేయలేదే’ అని కొందరనుచున్నారు. నిజముగా ఆలోచిస్తే భగవంతుని సేవ చేస్తున్న వారెవ్వరూ లేరు. సర్వవిధములా భగవంతుడే భక్తుని సేవ చేయుచున్నాడు. గంగలో నిలబడి ఆ జనమునే తీసికొని ‘గంగామాతా! నీకిది అర్పణము’ అని నదిలోనే పోసినట్టుంది. భక్తులు చేసే పూజ, భక్తులు చేసే సేవ. కాబట్టి భగవంతునికి నే సేవిస్తున్నాను ఆయన నాకేమీ ఇచ్చుట లేదు అనేభావమే సరికాదు.
నిత్య నైవేద్యం
ఎప్పుడో ఏడాదికొక పర్యాయం బీదల కన్నదానం చేస్తే సరిపోతుందా? మీరు సంవత్సరమున కొక పర్యాయం మాతమే భోజనం చేస్తున్నారా? కనుక, ప్రతిరోజు ఇళ్లల్లో వంటకని బియ్యం తీసే సమయంలో స్వామి నైవేద్యముకని ఒక పిడికెడు బియ్యం తీసి ఒక ప్రత్యేకమైన పాత్రలో ఉంచండి. వారమునకొక పర్యాయం ఆ బియ్యమును వండి ఇద్దరికో,ముగ్గురికో సంతర్పణ చేయండి. అంతేకాదు మీ పిల్లల పాత బట్టలను భద్రపర్చి శుభ్రం చేసి గుడిసెలలో నివసించే బీదపిల్లలకు దానం చేయండి. ఇదీ గృహలక్ష్మి అనుసరించవలసిన కార్యక్రమం.
దేహో దేవాలయః ప్రోక్తః
దేహము కదిలే దేవాలయం. అది ఆత్మ నివాసం. రాళ్లతో, మట్టితో, సున్నతో కట్టిన దేవాలయాల్లో ప్రవేశించే బదులు సజీవమైన దేహానికి మనం ఎంతో సేవ చేయవచ్చు. ఈ కాళ్లకు మ్రొక్కేకంటే సజీవమైన జీవుణ్ణి పోషించడానికి సేవ చేయడానికి తగిన కృషి చేయాలి. కష్టంలో ఉన్నవారికి సేవచేయడమే దేహాన్ని రక్షించడమన్న మాట. దేహాన్ని కాపాడుకోవాలి కానీ దేహమే పరమావధిగా ఆలోచించకూడదు. ఆరోగ్యం కావాలి అని ఎప్పుడూ ఆరోగ్యమే చూడకూడదు. సేవ ఇతరులకు కూడా చేయాలి.
ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.