సబ్ ఫీచర్

టైగర్ రాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా సరదాగా పిల్లిని పెంచుకుంటారు. కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అంతేకానీ పులులను పెంచుకోవడానికి కానీ, వాటిని సంరక్షించడానికి ఎవరైనా సాహసం చేస్తారా? చేయరు కదా.. కానీ లతికా నాథ్ మాత్రం పులుల సంరక్షణకు నడుం కట్టింది. సాధారణంగా అమ్మాయిలు బల్లులను చూసినా, బొద్దింకలను చూసినా అంత ఎత్తున ఎగురుతారు. కానీ లతిక మాత్రం పులులనే దగ్గరకు తీస్తోంది. అవంటే ఆమెకు ఎనలేని మమకారం. వివరాల్లోకి వెళితే..
ఆమె పేరు లతికా నాథ్. ఆమెకు మూగ జీవులంటే ప్రాణం. అందుకే మూగ జీవులకు స్నేహితురాలిగా మారింది. అందుకే దానే్న ఆమె తన కెరీర్‌గా మలచుకుంది. లతికా నాథ్‌కు వన్య ప్రాణులంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచే ఆమె మూగ జీవాలకు సేవ చేయడం మొదలెట్టింది. లతికా నాథ్ పెద్దయ్యాక ఢిల్లీలోని మైత్రేయి యూనివర్శిటీలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ చదివింది. తరువాత మూగ జీవుల సంరక్షణ కోసం ప్రత్యేక అధ్యయనాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా దేశంలో తగ్గుతున్న పులుల సంఖ్య గురించి ఆమెకు బెంగ ఎక్కువైంది. పులుల సంరక్షణ కోసం లతిక ఎంతగానో కృషి చేస్తుంది. అందుకే ఆమెను అందరూ ‘ఇండియన్ టైగర్ ప్రినె్సస్, వైల్డ్ లైఫ్ ఫ్రెండ్’గా పిలుస్తుంటారు. వన్యప్రాణులను కాపేడేందుకు లతిక అలుపెరుగని పోరాటం చేస్తోంది. భారతదేశంలో పులుల సంఖ్య తగ్గడానికి కారణమేంటి? పులులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇకముందు పులులను ఏవిధంగా కాపాడుకోవాలి? అనే సందేహాలకు లతిక దగ్గర పరిష్కార మార్గాలున్నాయి. ఎందుకంటే ఆమె తన జీవితమంతా వాటి సంరక్షణ కోసమే బతికింది కాబట్టి. కన్జర్వేషన్ బయాలజీలో డాక్టరేట్ పొందిన లతికకు వన్యజీవులపై అధ్యయనం చేసే అవకాశం లభించింది.
మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌ఘర్ ప్రాంతంలో పనిచేసిన ఆమె పులులపై విస్తృత అధ్యయనం చేయాలనుకుని ఆ దిశగా అడుగులు వేసింది. అక్కడే ఫెలోషిప్ తీసుకుని పులులపై సుదీర్ఘ అధ్యయనం చేసింది. ఏళ్ల తరబడి పులులు, ఇతర వన్య ప్రాణుల జీవన విధానంపై అధ్యయనం చేయడానికి లతిక ఒంటరిగానే వెళ్లేది. ఆమె ధైర్యానికి, సాహసానికి, వన్య ప్రాణి సంరక్షణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి మెచ్చిన నేషనల్ జియోగ్రఫిక్ వాళ్లు లతికను ఇండియన్ టైగర్ ప్రినె్సస్‌గా అభివర్ణించారు. ఏదిఏమైనా ఎంతో ఇష్టంగా క్రూర మృగాల సంరక్షణ చేపట్టిన లతిక చూసి జయహో అనాల్సిందే..
*