సబ్ ఫీచర్

కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఏటా డెబ్భైలక్షల మంది మరణాలకు కారణమవుతోంది. కేవలం ఇలాంటి కాలుష్య గాలిని పీల్చుకోవడం వల్ల ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాధుల ముప్పును ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంట నగరాల్లోని కాలుష్యం సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాయుకాలుష్యంలోని అతి సూక్ష్మ కారకాలు అంతటా ఉంటాయి. అవి మనకి కీడు చేస్తాయి. యూ ఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పరిశోధన ప్రకారం.. కాలుష్య ప్రభావం బయటి ప్రదేశాల్లో కన్నా, ఇంటి లోపలే రెండు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉందట. ‘ఇంటి లోపలి గాలిలో.. బయటి ప్రదేశాల్లో ఉన్నంత కాలుష్యం ఉంది. దీనికి తోడు వంట చేయడం, మాసిన బట్టలు ఉతికినప్పుడు, ఇంటిని, బాత్‌రూములను శుభ్రం చేసే ఉత్పత్తుల నుంచి వెలువడే వాయువులు, నిర్మాణ వస్తువుల నుంచి వచ్చే కాలుష్యాలు కూడా తోడవుతాయి’ అని ఎయిర్‌ల్యాబ్స్ సంస్థలో చీఫ్ సైన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మాథ్యూ ఎస్ జాన్సన్ తెలిపారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఫిల్టరింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తుంటుంది.
ఇవన్నీ సరే.. ఇంట్లోని గాలిని శుభ్రపరచుకోవడానికి, గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? అనే కదా అడుగుతున్నారు.. వాటి గురించే చెప్పబోతున్నానండీ.. మరెందుకాలస్యం.. చదవండి మరి!
* ఇంటి గాలిలో నాణ్యత మెరుగుపడాలంటే ముందుగా ఇంట్లో వెంటిలేషన్‌ను పెంచాలి. ఇంట్లోకి గాలి రాకపోకలు సరిగా లేకపోవడం వల్ల కాలుష్యాలు ఇంటిగాలిలోనే ఉండిపోతాయి. వెంటిలేషన్ వల్ల తాజా గాలి లోపలికి రావడానికి వీలవుతుంది.
* వంట చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు... కాలుష్యకాలను తొలగించడానికి, గాలిలోని తేమను తగ్గించడానికి ఎక్సాస్టర్‌ను ఆన్ చేయడం మంచిది.
* ఖరీదైన ఎయిర్ ఫిల్టర్‌లు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. వాటికి బదులుగా.. ఇంట్లో కొన్ని రకాల మొక్కలను ఉంచడం వల్ల గాలిలోని విష పదార్థాలను తొలగించవచ్చు. ఇంట్లో కాలుష్యనివారణకు చక్కటి పరిష్కారం ఇదే..
* ఇంట్లో పెంచుకోగల తేలికైన మొక్క అరికా పామ్. నాసా నిర్వహించిన ‘క్లీన్ ఎయిర్’ అధ్యయనంలో గాలిని ప్రక్షాళన చేయగల గుణాలు దీనిలో అధికంగా ఉన్నాయని దీనికి అత్యధిక రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను ఇది అధికంగా పీల్చుకుంటుంది.
* డెవిల్ ఐవీ అనే తీగను ఇంట్లో పెంచుకోవడం చాలా తేలిక. ఇది చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సింథటిక్ పెయింట్లు, కార్పెట్ల నుండి విడుదలయ్యే ఆర్గానిక్ కాంపౌండ్లను తొలగించడానికి తోడ్పడుతుంది.
* తూర్పు ఆఫ్రికాలో పుట్టిన డ్రాగన్ ట్రీ అనే మొక్కను అలంకరణకు ఉపయోగిస్తారు. దీన్ని ఇంట్లోనూ, ఆఫీసులోనూ పెడుతుంటారు. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టొల్యూన్, క్జైలీన్ వంటి విషతుల్యాలను పీల్చేసుకుని వాతావరణంలోని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.
* అందమైన పూలు పూచే మొక్క స్నేక్‌ప్లాంట్. ఈ మొక్కకు నీటి అవసరం అంతగా అవసరం లేదు. కాబట్టి దీన్ని ఎక్కడైనా పెంచవచ్చు. ఈ మొక్క రాత్రి సమయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటుంది. ఫార్మాల్డిహైడ్, నైట్రొజన్ డై ఆక్సైడ్‌లను తొలగించడానికి సాయపడుతుంది. * ఇంట్లోని మొక్కలు సహజసిద్ధ వాయు శుద్ధి పరికరాలుగా పనిచేయాలంటే.. ముందు ఆ మొక్కలను ఆరోగ్యంగా ఉంచడం అవసరం.. లేదంటే.. అవి గాలిలోకి బయొలాజికల్ కాలుష్యాలను విడుదల చేస్తాయని చెబుతున్నారు ఎయిర్‌ల్యాబ్స్ చీఫ్ సైన్స్ ఆఫీసర్.
* ఇంటిని శుభ్రం చేయడానికి, బొద్దింకలు వంటి క్రిములను నశింపచేయడానికి వాడే రసాయన మిశ్రమాలు గాలిలో కలిసినప్పుడు ఫార్మాల్డిహైడ్లను విడుదల చేస్తాయి. కాబట్టి ఇంట్లో సువాసన రహిత ఉత్పత్తులను ఉపయోగించాలి. డియోడ్రెంట్లు, కార్పెట్ క్లీనర్లు, ఎయిర్ ఫ్రెష్‌నర్లు వంటి ఏరోసోల్ స్ప్రేలను వాడకూడదు. వంటగదిలో కూడా ఇలాంటి స్ప్రేల బదులు నిమ్మకాయ బద్దలు, బేకింగ్‌సోడా వంటివి ఉత్తమమైనవి.
* పుప్పొడి రేణువులు, ధూళి కణాలు అనారోగ్య ముప్పును పెంచుతాయి. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీ వంటివి ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ. గాలిలో అధిక తేమ వల్ల గాలిలో బూజు బీజాలు పెరుగుతాయి. వాటివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అలాంటప్పుడు పడకగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
* గాలిలో తేమను తగ్గించే పరికరాలను ఉపయోగించాలి.
* కార్పెట్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం తక్కువగా కాలుష్యాన్ని విడుదలచేసే వ్యాకూమ్‌లను ఎంచుకోవాలి.
* ఉతికిన దుస్తులను తెరచిన కిటికీ సమీపంలో ఆరేయాలి.
*