సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలోల యోగం
ముఖ్యం ఈ మూడు
అవతారస్వరూపుని అనుగ్రహం లభించాలంటే ముఖ్యంగా మూడు గుణాలను అలవర్చుకోవాలి. ఒకటి. ఏ పని స్వార్థ బుద్ధితో చేయకు. నలుగురికీ ఉపయోగపడాలనే తత్వాన్ని పెంచుకో. రెండు సాధన. అంతా ఆత్మదర్శనా పేక్షతో చేయి. చిత్త శుద్ధి అన్నింటికన్నా ముఖ్యం.
రెండు సాధన చేయి. ఆత్మదర్శనాపేక్షో చేయి. మూడుచిత్తశుద్ధి అన్నిటికన్నా ముఖ్యం.
నిగ్రహం - అనుగ్రహం
నిగ్రహాన్ని సాధించినవాడే అనుగ్రహాన్ని కూడా సాధించగ ల్గుతాడు. కుండను బోర్లించి పెడితే కుంభవృష్టి కురుస్తున్నప్పటికీ ఒక్క చుక్కైనా అందులో పడదు. అలాగే ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ హృదయం భగవంతునిపై పెట్టకపోతే అనుగ్రహం లభించదు. చిత్తం శివుని పైన భక్తిచెప్పులపైన ఉంటే ఎలా లభిస్తుంది అనుగ్రహం.?
ముగ్గురు రాక్షసులు
‘అహంకారము అసూయ, ఆడంబరము’ ఈ ముగ్గురు రాక్షసుల చేతిలో ఈనాడు మానవుడు చిక్కుబడి ఉంటున్నాడు. ఈ ముగ్గురు రాయసుల నుండి ఏనాడు తప్పించకొనునో ఆనాడే వాడు నిజమైన మానవుడు అవుతాడు.
ఔషధం ఒక్కటే.
ఏ కష్టాలైనా నడత దారి తప్పడం వల్లనే కలుగుతాయి. నడత ఎందుకు దారితప్పుతుంది? నీ నిజ స్వభావమేదో నీ వెరగక పోవడం వల్లనే. నీ అజ్ఞానం ఎంత గాఢమైందంటే నీ ఆలోచనలూ, మాటలూ, చేతలూ అన్నిటినీ అది ఆవరించి ఉంది. దానికి చక్కటి మందున్నది. ఆ మందును అనేక రకాలుగా ఇవ్వవచ్చు. జ్ఞానం అను, కర్మ అను, ఉపాసన అను, భక్తి అను - అన్నీ అదే! అన్నిటిలోనూ ఔషధతత్వం ఒకటే. నయం చేయగల శక్తి ఒకటే. పొటెన్సీ కూడా ఒకటే. తేడా అల్లా ఇది ఔషధాన్ని తీసుకొనే తీరులోనే మార్పుంటుంది. ఔషధంలో కాదు. మందు మిక్స్చర్ కావచ్చు. మాత్ర కావచ్చు. పొడి కావచ్చు. ఇంజక్షన్ కావచ్చు. ఏదయితేనేం. కావలసింది జబ్బు నయం కావడం !
ఆత్మ బలం
మనిషి అన్నగత ప్రాణి మాత్రమే కాదు. ఆత్మగత ప్రాణి కూడా. ఆత్మ శక్తితో అతడు జీవించే వాడుగా ఉన్నాడు. నీకున్న దేహబలం, బుద్ధిబలం, చదువూ, సంపద తెలివిగా ఉపయోగించుకో. నిగ్రహాన్ని పెంపొందించుకో. సాధన చేయి. ఆత్మ శక్తి ని అనుభూతిలోకి తెచ్చుకో. ఆత్మబలం లేని దేహబలం వల్ల ప్రయోజనం ఏముంది? భగవం తుడు కాళ్లు చేతులు, కళ్లు ముక్కు ఇలాంటి వన్నీ ఇచ్చింది కేవలం తినడానికి సుఖం ఆస్వాదించడానికి కాదు. ప్రహ్లాదుడు చెప్పి నట్టు ఉన్న చేతులు కేవలం తనకోసం కాక భగవంతుని పూజ చేయాలి. అంటే ఇక్కడ కేవలం భగవంతుని పూజ చేయడం అంటే ఇతర ప్రాణుల్లో ఉండే భగవంతుని అంశకు సేవ చేయడమే. అంటే ఇతరులకు ఉపయోగపడటమే కావాలి. అదే ఆత్మబలం గా రూపొందుతుంది.
త్రికరణ శుద్ధి
మానవ స్వభావం సత్యం. మనిషికి త్రికరణ శుద్ధి ముఖ్యం. చెప్పేదొకటి చేసేదొకటి అయితే అతడు రూపంలోనే మనిషి కానీ వస్తుతః పశువుకన్నా హీనం. ఆలోచించే పనీ, మాట్లాడే పనీ రెండూ లేవు గదా పశువులకు.
సత్యానే్వషణ
ఉన్న కొద్ది ఆయుస్సును భగవచ్చింతనలో గడుపు. పనికిరాని వాళ్ల సేవలో వ్యర్థం చేయక. బ్రతుకు మీకందరికీ భగవంతుడిచ్చిన అవకాశం. ఎందుకు? వృథా కాలక్షేపానికా! కాదు ఉత్తమ ఆదర్శాన్ని సాధించటానికి మనస్సును నిగ్రహించి సత్యానే్వషణ చేయడానికి.
మాయ ఏం చేస్తుంది?
నీ శరీరం ఏం చేస్తున్నదో చూడు. నీ వంట్లో వేడి నంతటినీ క్రమబద్ధం చేసి ఉష్ణోగ్రతను నార్మల్ స్థాయిలో ఉంచేస్తున్నది. నీవు కూడా శబ్ద స్పర్శ, రూప, రస, గంధాదులు తెచ్చి పెట్టే అవేశావేశాలను క్రమబద్ధం చేసి సమస్థితిలో పెట్టు.
నీవే మాయలో పడుతున్నావు. దానికి బానిసగా మారుతున్నావు. నీ మీద పెత్తనం చేసే అవకాశాన్ని దానికి ఇవ్వకు. అప్పుడది నినే్నం చేయలేదు.

ఇంకా ఉంది