సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు సాయిబాబా జయంతి
*
జై శ్రీ సాయిరాం
*
అంతరార్థ రామాయణం
రామాయణం కేవలం కథ కాదు. దానికి ఎంతో అంతరార్థం ఉంది. దశేంద్రియాలతో కూడిన దేహమే దశరథుడు.సత్వరజస్తమోగుణాలు మూడు ఆయన భార్యలు. చతుర్విధ పురుషార్థాలే ఆయన కొడుకులు. రాముడు (్ధర్మం) లక్ష్మణుడు(అర్థం) భరతుడు(కామం) శత్రుఘు్నడు (మోక్షం) మోక్షసాధనను దృష్టిలో ఉంచుకునే పురుషార్థాలను సాధించాలి.
సీత సత్యం. హనుమంతుడు మనస్సు. మనసునుసరిగా అదుపు చేసుకొంటే అదే ధైర్యానికి స్థావరం అవుతుంది. హనుమంతుని రాజు సుగ్రీవుడు (విచక్షణ) వీరందరి సాయంతోనే రాముడు సత్యానే్వషణలో సఫలుడైనాడు. రామాయణం అందరికీ బోధించే పాఠం ఇదే.
మలుపుతిప్పే మకిల
రామాయణ గాథ మొత్తం ఇద్దరు స్ర్తిలపై ఆధారపడి ఉంది. ఒకరు మందర. అది మత్సరానికి ప్రతీక. రెండవది శూర్పణఖ -అది కామానికి ప్రతీక. మందర కుట్ర వల్ల రాముడు వనవాసం పోయాడు. శూర్పణఖ కారణంగా సీత అపహరించబడింది. నిజానికి ఈ పాత్రలు రెండూ చెప్పుకోదగ్గవికావు. కానీ అవి నిర్వహించిన పాత్ర మాత్రం విశేషమైందే. మత్సరం , క్రోధం అణు బాంబులకన్నా శక్తివంతమైనవి. కానీ హృదయంలో రాముణ్ణి ప్రతిష్టించుకో. అవి నిర్వీర్యమవుతాయి.
అనసూయవి కా!
ఇతరుల కష్టసుఖాలను పంచుకొనే అలవాటు చేసుకోగానీ ఇంకొకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక పోవటం నేర్చుకోవద్దు. ఇతరులకు ఏవయినా ప్రైజులు, అవార్టులు వస్తే సంతోషించు. వాటిని వారెలా కష్టపడి సాధించారో, చూసి నేర్చుకో. వారిలాగా నీకూ తెలివి తేటలూ శ్రమపడే శక్తి మంచి జ్ఞాపకశక్తి ప్రసాదించమని దేవుణిణ ప్రార్థించు. కాని వారిని చూసి అసూయ పడకు. అసూయ మహావిషం . అది నీ నడవడికి మచ్చ తెస్తుంది. ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. శాంతి లేకుండా చేస్తుంది. అందుకే ‘అనసూయవు’కా.త్రిమూరుతలను పసిపాపల్లా ఆడించగల్గుతావు. పెరిగే పైరులను నాశనం చేసే చీడ పురుగుల్లా అసూయ నీకు తెలియకుండానే నీ మనసులో జొరబడుతుంది. క్షణాలపై అల్లుకుపోతుంది. కనుక చిన్న చిన్న విషయాలలో కూడా అసూయ బారిన పడకుండా జాగ్రత్త పడు.
బండరాయి.
ఈ మనస్కొక బండరాయి వంటిది. బుద్ధిశిల్పి వంటిది. ఇంద్రియాలు చెప్పినట్లు శిల్పి వింటే అదొక రాక్షసి బొమ్మగా మారుతుంది. ఆత్మను బట్టి అంతఃకరణ నడుచుకొంటే అదే మనోహరమైన దేవతా విగ్రహంగా రూపొందుతుంది. ఆరాధానార్హత ను సంపాందించుకుంటుంది. ఆధ్యాత్మిక సాధనలో మనస్సు ఎప్పటికప్పుడు నీతో సహకరించేలా చూసుకో. ఎక్కడిక్కడ అడ్డుతగిలేలా కాదు. ముక్తి నీ గమ్యం. నీ యాత్ర చక్కగా సాగేందుకు నీ మనసు సహకరించాలి. ధర్మ వ్యతిరేకమైన ఏ భావననూ మనసులో చోటు చేసుకోనివ్వరాద. ఆధ్యాత్మిక సాధనకు అడ్డుతగిలే ఏ పనినీ చేపట్టకూడదు.
పరవౌషధం
రామాయణం పరవౌషధం. మనసులో లోతుగా నాటుకొని పోయిన జాడ్యాన్నీ, ఇంద్రియ వాంఛలనూ అది తొలగిస్తుంది. నీ దృష్టిని సునిశితం చేస్తుంది. భగవంతుని చేరుకొనే మార్గంలో పయనించేటపుడు నీకు బలధైర్యాలను ప్రసాదిస్తుంది.
నరజన్మ దుర్లభం
రారుూ , మట్టీ లాగా రత్నాలూ, బంగారం కూడా భౌతిక పదార్థాలే. మనిషే వాటికి విలువ కల్పించాడు. నిజానికి ప్రపంచంలో అన్నిటికన్నా విలువయినదేది? రత్నాలూ, బంగారమూ కాదు. మనిషే. కనుకనే జంతూనాం నరజన్మ దుర్లభం - అన్నారు పెద్దలు. ఇంత తెలసిన మనిషి కూడా విషయ వ్యామోహంలో పడి పతితతుడవుతున్నాడు.
అందుకే ప్రహ్లాదుడు ‘మహా విద్వాంసుడున్ కామినీ హేలా కృష్ణకురంగ శాబకమగున్ హీనస్థితిన్ వింటిరే’ అన్నారు. అట్లాంటివాటి జోలికి పోకుండా కేవలం ధర్మం మార్గంలో నడిస్తే కామినీకాంచన పిశాచాలు ఎప్పటికీ దరిచేరవు. అవి కనుక దగ్గర లేకపోతే చాలు మనిషి ఎపుడూ సత్యమే పలుకుతాడు. అబద్ధాల జోలికి పోడు. కల్లలెన్నిఆడినా చివరకు అవి పేకమేడల్లా కూలిపోతాయ. కానీ ఎనాటికీ స్థిరత్వాన్ని కలిగిఉండవు. ఇది తెలుసుకున్న వారెవరైనాసరే సత్యమనే వృక్షానే్న నమ్ముకుంటారు. వారికి ధర్మబద్ధమైన పండ్లు దక్కుతాయి.

ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.