సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుగ్రహం అడ్రసేది?
మనిషి జన్మిస్తూనే గొప్ప ఆకలీ, తృష్ణా కలిగి జన్మిస్తాడు. అయితే ఆ ఆకలీ, దప్పికా అన్నం, నీళ్లకోసం కాదు దైవానుగ్రహం కోసం. దైవానుగ్రహం తనకు లభిస్తుందని అతనికి తెలసుక కానీ అదెక్కడ లభిస్తుందో తెలియదు. ఆనంద సామ్రాజ్యానికి తాను వారసుడని అతనికి లీలగా గుర్తుంది. కానీ ఆ హక్కు నెలా స్థాపించుకోవాలో అతినకి తెలవటల్లేదు. బాధలూ, ద్వేషం, మరణం అతడినీ ఆవేశిస్తే అతడు తీవ్రంగా తిరగబడుతాడు. తాను అమృతపుత్రుడనీ ప్రేమ సంతానమనీ వదుని సుతుడనీ అతనికి తెలుసు. అయితే అతడు వాటిని గుర్తుంచుకోవట్లేదు. వజ్రాలను ఇచ్చి గులకరాళ్లను పుచ్చుకునే వాడిలా అతడు ప్రాపంచిక సౌఖ్యాల నాశించి దివ్యతత్వాన్ని తోసి రాజంటున్నాడు.
ముక్తి మార్గం
మనసుకు అంటే వాంఛలుమనిషి అంతఃకరణను మలినం చేస్తుంటాయి. ఇంద్రియాలను నిగ్రహించు. అవి అదేపనిగా రేకెత్తించే ప్రలోభాలకు లొంగిపోకు.
శవాన్ని చితిపై ఉంచి అంటిస్తే అటు చితీ, ఇటు శవం రెండూ బూడిదవుతున్నాయి. అలాగే ఇంద్రియాలను కాదంటే, మనస్సు పెత్తనం సన్నగిల్లుతుంది. మనసు పెత్తనం పోగానే మాయ అంతవౌతుంది. ముక్తి లభిస్తుంది.
ఇంద్రియ లోలత్వం
విషయ వాంఛల నుంచి నానారకాల ప్రలోభాల నుండీ నీ మనసును విముక్త చేయి. అపుడే మోక్షం సిద్ధిస్తుంది. కానీ మనసు చుట్టూ ఇంద్రియ లోలత్వం అనే దట్టమైన కవచం ఉందే ఎలా విముక్తి చేస్తావు. మనసును భగవంతుని కర్పించు. ఇంద్రియ లోలత్వం అనే కవచాన్ని బ్రద్ధలు కొట్టు. మరుక్షణమే నీకు స్వేచ్ఛ లభిస్తుంది.
ఇంద్రియ చాపల్యం
మనిషి తన మానవత్వాన్ని కోలుపోయి, పశువులు కూడా సిగ్గుపడేంత నీచానికి దిగజారగలదు. తనలోని దైవత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయకపోతే పోనీ, కానీ పశుత్వం కన్న హీనస్థాయికి దిగజారటం దారుణం. కనీసం మానవత్వాన్ని నిలబెట్టుకో కలిగినా చాలు. మనిషి లోనయ్యే దుర్గుణాల జాబితా పొడుగయినదే కానీ అందులో ఆశ అన్నది మరీ చెడ్డది. ఆశ అంటే అడ్డూ అదుపూ లేని కోరికలే. ఇంకా కావాలి. ఇంకా కావాలి అంటూ అర్రులు చాచే ఆబ గుణం. అందుకు విషయ వ్యామోహాన్ని పెంచే ఇంద్రియాలే కారణం.
బ్రేకులుండాలి
ఇంద్రియ నిగ్రహం నిన్ననేక ఆపదల నుండి కాపాడుతుంది. నాకు ఇంద్రియాలున్నాయి. హాయిగా నడిచిపోతుంది. నాకే ఇబ్బందీ రాదు అనుకోవద్దు. కారు కొన్నావు. నీ పేర రిజిష్టరు చేయించుకున్నావు. హాయిగా డ్రైవ్ చేస్తున్నావు. కానీ బ్రేకులు పడకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అవుతాయి. నీ దేహం కూడా ఆ కారులాంటిదే. నీ కండ్లే లైట్లు, పొట్ట పెట్రోలు టాంకు. నోరే హారన్, మనసే స్టీరింగ్ దర్మ అర్థ కామ మోక్షాలు నాలుగూ నాలుగుచక్రాలూ. టైర్లల్లో నింపినగాలి విశ్వాసం. బుద్ధి కారు ఇంజనును స్టార్ట్ చేసే స్విచ్.
అమూల్య సంపద
కొందరికి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లూ ఉంటాయి. కావలసినన్ని ఆస్తిపాస్తులుంటాయి. కానీ ఏం లాభం? మనసులు నీరసంగా ఉంటాయి. బతుకులు భారంగా గడుపుతుంటారు. ఎందుకో తెలుసా?కావలసిన నిజమైన సంపద ఏదో దానిని వారు చక్కబెట్టుకోలేదు. ఇంద్రియ నిగ్రహం. తృప్తి, ద్వేష రాహిత్యం. లోభం లేకపోవడం, ఇవే నిజమైన సంపదలు పొలాలకన్నా, బంగళాల కన్నా బంగారం కన్నా ఇవి ఎక్కువ విలువైనవి. నలుగురితో కలిసి జీవించకపోవడం. నాకు ఆస్తిపాస్తులున్నాయ కనుక నాకు ఎవరితో పనిలేదని అనుకొని గర్వంగా ఉండడం ఇవన్నీ మనిషిని ఒంటరిని చేస్తాయ. ఏదైనా అవసరం వచ్చినపుడు ఆ మనిషికి ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. అందుకే ప్రతిమనిషిలోను మానవత్వం ఉండాలి. స్వార్థం ఉండకూడదు. సాయం చేసేగుణం ఉండితీరాలి, అహంకారం ఉండకూడదు. అపుడే మనిషి సంతోషంగా అమూల్యమైన జీవితాన్ని జీవించగలుగుతాడు.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.