సబ్ ఫీచర్

ప్రభుత్వానికి రాజ్యాంగమే ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాలు నడుచుకునేందుకు విధివిధానాలు, ఆదే శిక సూత్రాలను తెలియజేస్తూ దిశానిర్దేశం చేసేది ‘రాజ్యాంగం’. ‘ప్రభుత్వం శరీరం అయితే, దానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది’. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అలాగే భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి? పరిపాలన ఎలా జరగాలి? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల ఏర్పాటు ఎలా ఉండాలి? వాటిమధ్య సమన్వయం ఎలా ఉండాలి? అనే విషయాలను నిర్దేశించే మహత్తర గ్రంథమే భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి రాజ్యాంగం ప్రజలకు ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిదని చెప్పవచ్చు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు, పౌరుల ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలను, బలమైన సమాఖ్య వ్యవస్థకు నిర్దిష్టమైన సూచనలు అందించింది భారత రాజ్యాంగం. భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే రాజ్యాంగం రూపకల్పనకు కృషి చేశారు. అందుకుగాను ముందుగా ‘రాజ్యాంగ పరిషత్’ను ఏర్పాటుచేశారు. ఈ రాజ్యాంగ పరిషత్ (కమిటీ)కు సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా నియమించారు. ఇందులో రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నిక కాబడిన సభ్యులు 292 మంది, భారత సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌ల ప్రతినిధుల నుండి 24 మంది.. ఇలా 389 మంది సభ్యులతో కూర్పు జరిగింది. అదే సమయంలో 1947 జూన్ నాటికి వౌంట్ బాటెన్ ఆధ్వర్యంలో దేశవిభజన ప్రణాళిక ప్రారంభం కారణంగా రాజ్యాంగ పరిషత్ (రాజ్యాంగ సభ) సభ్యుల సంఖ్యను 299 మందికి కుదించారు. అంతకుముందు భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో 211 మంది సభ్యులతో జరిగింది. డా.సచ్చిదానంద సిన్హాను అధ్యక్షునిగా ఎన్నుకున్న ఈ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ, వౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్రప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైనవారు సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.
జనవరి 2018 నాటికి భారత రాజ్యాంగంలో 123 సవరణ ప్రతిపాదనలు చేయబడ్డాయి. అలాగే 101 సవరణ చట్టాలు జరిగాయి. మారుతున్న పరిస్థితుల ప్రకారం రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్‌లోని ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. రాజ్యసభ చారిత్రక 250వ సమావేశాల సందర్భంగా భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిధ్యతల సమాహారం అని, దేశాన్ని ముందుకు నడిపే చోదకశక్తి రాజ్యాంగం అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఆమోదించబడి 70 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆదేశానుసారం రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వరకు పాఠశాలల్లో నవంబర్ 26, 2019 నుండి సభలు, సమావేశాలు, విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, డిబేట్, నాటికలు, రాజ్యాంగ ప్రవేశిక, ప్రతిజ్ఞ తదితర అంశాలపై, రాజ్యాంగం నిర్మాణంపై అవగాహన కల్పించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
నేటి తరానికి రాజ్యాంగం, దానికి సంబంధించిన చరిత్ర గూర్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన దేశం భిన్నత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాజ్యాంగం అనేది దేశ పరిపాలన వ్యవస్థకు అద్దం లాంటిది, ఒక దిక్సూచి లాంటిది. దేశంలో ఎవరైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలే తప్ప, దాని పరిధి దాటి పోకూడదు. నేడు చిత్తశుద్ధి లేని పాలకులు ప్రాతినిధ్య సభలలో (పార్లమెంట్, అసెంబ్లీ) అడుగుబెడుతున్నారు. ప్రజాస్వామ్యం విలువలు సమాజంలో గొప్పగా అమలుకావాలంటే ముందుగా, మన గ్రంథమైన రాజ్యాంగం విలువలు, ఆదర్శాలు, నిర్మాణం, చట్టసభలకు ఇచ్చిన సూచనలు అనేక అంశాలపై పాలకులు అవగాహన కల్పించినపుడే డా.బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన ఆదర్శాలు తప్పక అమలవుతాయని భావించాలి. 250వ రాజ్యసభ చారిత్రక సమావేశాలలో రాజ్యసభ ప్రతిష్టను పెంచేలా సభ్యులు ఏవిధంగా నడుచుకోవాలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు 10 సూత్రాలను సభ్యులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాణం, దాని విలువలపై అన్ని స్థాయిల్లో చట్టసభల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించినపుడే ‘సుపరిపాలన’ ప్రజలకు చేరువవుతుంది.

-సామంతుల సదానందం, పరకాల