సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయుజ్యమా? సౌకర్యాలా?
నీవు ప్రశాంతి నిలయంలో యిరవై ఏళ్లో, పాతికేళ్లో వుంటావు. ఉండి ఏం చేస్తున్నావు? జపంకన్నా, ధ్యానం కన్నా నీ సౌకర్యాల సంగతి ఎక్కువగా చూసుకుంటుంటావు. భజన అయింతర్వాత కర్పూర హారతి వెలిగిస్తారు. ఎందుకో తెలుసా! నీ విషయ వాసనలను నిశే్శషంగా దహించి వేయి అని నిన్ను హెచ్చరించటానికే. సాయుజ్యం కావాలంటే సొంతంగా నిన్ను నీవు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఎవరికి? సౌకర్యాలకా? కాదు, స్వామికి!
డబ్బు, డబ్బు, డబ్బు!
డబ్బుకు మనిషి దాసోహం అతడి బ్రతుకంతా పైనపటారం, లోన లొటారం, ఇది నిజంగా దయనీయం. తన అవసరాలకు సరిపడేంత డబ్బు సంపాదించుకొంటే మనిషికి చాలు. మనిషికి కావాల్సిన డబ్బెంత? దానిని మన చెప్పులతో పోల్చవచ్చు. చెప్పులు చిన్నవైతే ఒక బాధ. పెద్దవైతే యింకో బాధ. సంపదాఅంతే! ఎక్కువైతే గర్వమెక్కుతుంది. ఇతరులంటే లోకువనిపిస్తుంది. డబ్బే ముఖ్యం కావటంతో మనిషి జంతు ప్రాయుడవుతాడు.
డబ్బు ఒక విధంగా చూస్తే పేడ లాటిది. ఒకచోట కుప్పేస్తే కంపు కొడుతుంది. పొలాలపై చల్లితే. ఇంతకింత పంటనిస్తుంది. నలుగురికోసం డబ్బును ఖర్చుచేయి. సుఖసంతోషాలను పెంచుతుంది. సంతృప్తి కలిగిస్తుంది.
దుష్టులకు శాస్తి
పువ్వు పూయకుండా పిందె వేస్తుందా? పిందె కాయ అయి, పక్వం కానిదే పండు రాదు. అలాగే తీవ్రమైన సాధన లేకుండా జ్ఞానం వస్తుందా?
సోమక దానవుడు బల గర్వంతో వేదాలను దొంగిలించి దాచాడు. ఏం సుఖపడ్డాడు?
దశకంఠ రావణుడు కామాంధుడై ఇంకొకరి భార్యను దొంగిలించాడు. ఏం బాగు పడ్డాడు?
తన సోదరులకు సూది మొన మోపినంత నేలయినా యివ్వనని మత్సరంకొద్దీ మొండికేశాడు దుర్యోధనుడు. ఏం బావుకున్నాడు చివరకు?
క్రూరుడైన కంసుడు చావు తప్పించుకోడానికి చంటి పిల్లలనందరినీ వెతికి, వెతికి నిర్ధాక్షిణ్యంగా చంపించాడు. కాని తన చావును తప్పించుకోగలిగాడా?
దుర్మార్గుల ఖర్మ ఆనాడే కాదు, ఈనాడూ, ఏనాడూ యింతే!
సాయి వాక్కు ఎప్పటికి సత్య వాక్కు.
నిజమైన వైద్యుడు
అవయవాలన్నీ బాగుండాలని కోరుకోండి, కాని కృత్రిమ అవయవం కావాలని కోరుకోకూడదు. నేనిచ్చే ఔషధం సేవించిన తరువాత ఇక నుంచి నీకు ఏ జబ్బూ వుండదు అని చెప్పే వైద్యునికోసం వెతుక్కోండి. కాని ‘ప్రస్తుతం రుూ బాధను తగ్గిస్తాను. తరువాత చూద్దాం ’-అని జరుపుళ్లు పెట్టే డాక్టరెందుకు?
పులులొస్తున్నాయి, జాగ్రత్త
కొట్టంలోకి ఒక పులి జొరబడితే, ఆవుల గతేమిటి? పులి దెబ్బకు అవి బతికి బయటపడతాయా? కామ, క్రోధ, లోభాదులే పెద్ద పులులు. సత్యం, న్యాయం, ప్రేమ, శాంతి-యివే గోమాతలు. దురదృష్టం ఏమిటంటే, ఈ పులులు మనుషుల గుండెల్లోకి జొరబడ్డాయి. అందుకే వారి మనసులు- ముఖ్యంగా చదువుకున్న పెద్దమనుషుల మనసులు వెర్రితలలు వేస్తున్నాయి. చెడ్డ అలవాట్లకు దాసోహం అంటున్నాయి.
సాత్వికాహారం
నీవు తీసుకొనే ఆహారం గురించి నీవు శ్రద్ధవహించాలి. జఠరాగ్ని, కామాగ్ని- ఈ రెండూ చాల ప్రమాదకరమైనవి. ఇవి మానవునితో ఏ పనైనా చేయించగలవు. ఎంతటి పతనానికైనా దారితీయగలవు. జిహ్వచాపల్యాన్ని అదుపుచేసుకోవాలి. రుచికి దాసుడివి కాకు. సాత్వికాహారానే్న సేవించు సాత్వికుల సాంగత్యంలోనే ఆహారం ఆరగించు. హితంగా, మితంగా ఆహారాన్ని తీసుకో. ఇదంతా ఇంద్రియాలను అదుపులో వుంచుకోడానికి దోహదం చేస్తుంది.
ఏకాగ్రత
మనిషికి చంద్రమండలానికో బుధగ్రహానికో వెళ్లివచ్చే దానికన్న మనసును నిలకడగా వుంచటమే ఎక్కువ కష్టం. చంద్ర మండల యాత్ర ఎక్కువ సంచలనం సృష్టించవచ్చు. కాని, ఏకాగ్రత సాధించటం అంతకన్న ఎక్కువ మేలు చేస్తుంది.
మంచి పనుల చేయని వాని జీవితం చుక్కలూ, చంద్రుడూ లేని రాత్రి వంటిది. చువ్వలూ, ఇరుసూ లేని చక్రం లాంటిది.
బండ మీదెక్కినవాడు దానె్నలా నెట్టగలడు? నిన్ను తొందరపెట్టే వాటినన్నిటినీ పెంచుకొని ఆదుర్దా పడకుండా ఎలా వుంటావు?
ఇంద్రియాలకు నాథుడివికా. నిన్ను పీల్చి పిప్పిజేసే వాంఛలకు బానిసవు కాకు.

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.