సబ్ ఫీచర్

శ్రీసాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజవేన మాండవ్యం...
ఓ చెరువులోకి రాయి విసిరితే? నీళ్లు చెదిరి, అలలు బయలదేరతాయి. మనసుకు సంబంధించిన సంకల్ప వికల్పాలు కూడా ఆ అలల వంటివే!
సత్సంకల్పం వల్ల మనసు నిర్మలం అవుతుంది. మనోబలం పెరుగుతుంది అన్నారు పెద్దలు. మనోబలమే ఆరోగ్య భాగ్యం. మనోబలం వల్లనే దేవుని కరుణ ప్రాప్తవౌతుంది. ఆత్మదర్శనం కలుగుతుంది. నిన్ను నీవు అక్షరునిగా తెలుసుకుంటావు.
మందులూ, ఆస్పత్రులూ, యివన్నీ ఎవరికి? ఆ డాక్టరు గట్టివాడా? ఈ డాక్టరు గట్టివాడా? ఈ మందు మంచిదా? ఆ మందు మంచిదా? ఇలా సంశయం, సంకోచంతో సతమతమయ్యేవారికి. భగవంతునిపై భారం వేసేవారికో? ఆయనే పెద్ద డాక్టరు. ఆయన పవిత్ర నామమే పరవౌషధం!
గృహప్రవేశం
‘్ధనం’ పునాదిగా జీవితాలను నిర్మించుకొంటున్నవారు ఇసుకలో యిల్లు కట్టినట్లే. ‘్ధర్మ’ పునాదిగా కట్టుకొనేవారు రాతిపై యిల్లు కట్టుకుంటున్నట్లు!
మీరంతా యిళ్లు కట్టుకోవాలి. అందులో ఆత్మరాముని ప్రతిష్ఠించుకోవాలి. ఇదే నా కోరిక. ఐతే నేననుకునే యిళ్లు యిటుక, సున్నం, సిమెంటుతో కట్టేవి కావు. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు, మంచి సాంగత్యం వీటితో నిర్మించుకొనే గృహాలు. అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంటుంది. అలాటి యిళ్లు మీరు కట్టండి! అందులో గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించండి! నేను తప్పక వస్తా. నిజానికి ఆ యిల్లు నాదే! అక్కడకు రావటానికి నాకు ఆహ్వానం కూడా ఎందుకు? మీరనుకొనే యిళ్లు ప్రాపంచిక సుఖాలకోసం. నేను చెప్పే యిల్లు ఆధ్యాత్మిక ఆనందంకోసం! నా నివాసం ఎప్పుడూ ముముక్షువుల పవిత్ర హృదయాలలోనే!
సంస్కారం
సంస్కారమనగా ఏమిటి? సత్సంకల్పం. సద్భావం. సద్గుణం. మానవుని యొక్క నడత పవిత్రమైనదిగా ఉంటుండాలి. భావములు, ఆలోచనలు సమాజ క్షేమమును గురించినటువంటివిగా ఉండావి.
త్యాగం, సేవ, యితరుల కష్టసుఖాలను పంచుకోడం, ఇతరుల బాధలకు సానుభూతి చూపటం ఇవన్నీ మానవుని తన గమ్యానికిచేర్చే సద్గుణాలే. మనిషి తన సంకుచిత తత్వాన్ని దివ్యమైన అనంత తత్వంగా విస్తరించుకోవాలి. అనాదిగా విజ్ఞతచేసే అమంత్రణ అదే!
సత్యం సులభం
అసత్యాన్ని చెప్పాలంటే ఎన్నో ప్లాన్లువేయాలి. ఎంతో యోచనచేయాలి. అయినప్పటికీ పట్టుబడిపోతుంటారు. కాని, సత్యమునకు యోచించనక్కరలేదు. ఉన్నదిఉన్నట్లు చెప్పడం అతి సులభం. చెడిపోవడం అంటే అసత్యం చెప్పడం. నిజానికి చాలా కష్టం. కాని, చెడిపోవటమనే కష్టమైన పనిలోనే ఆసక్తిపెట్టుకొని, అమితంగా చెడితున్నారు నేటి మానవులు.
మనకేది నచ్చుతుందో ఆ పనిచేయటం తేలిక అనుకుంటారు. మనకు ఏది మంచిదో ఆ పని చేయటం కష్టం అని భావిస్తారు. ఆలోచిస్తే. మనం యిష్టంగా చేసే పనులన్నీ మన మంచికి దోహదం చేయవు.
కష్టం అనిపించినాసరే, మంచికి దారితీసే పనులు చేయటంలోనే విజయ రహస్యం వుంది. నిన్ను గమ్యానికి చేర్చేదే ఎప్పుడూ నీవు అనుసరించాల్సిన మార్గం.
ధర్మం
ధర్మం అంటే ఏమిటి? నీవేది చెబుతున్నావో దానినే చేయటం. ఏం చేస్తున్నావో దానినే చెప్పటం.
న్యాయంగా సంపాదించు. పవిత్రమైన ధనానే్న ఆశించు. దైవభీతి కలిగివుండు. దైవాన్ని చేరుకోడంకోసమే జీవించు. అదే ధర్మం!
రాముడెలా వుంటాడు?
ఇతరులకు సాయపడే అవకాశంకోసం చూడు. దీనులకు ధైర్యం చెప్పు. ఊరటను కలిగించు. సానుభూతి చూపి సాయం చేయి. ప్రార్థన అన్న మార్గంలో ప్రేమను విస్తృతం చేసుకో. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు అంటూ ఎవర్నీ దూరంపెట్టుకోకు. పరమాత్మ అంటే పరులకే దేవుడనో, పరాయి దేవుడనో అర్థంకాదు. అందరికీ ఆయనే దేవుడు. రాముడు, కృష్ణుడు మొదలయిన దేవుళ్ల పటాలను కొని పూజిస్తుంటారు. నిజంగా వారు నీ పూజించే పటంలో వున్నట్లే వుండేవారా? ఆ సంగతి ఎవరు గ్యారంటీ యిస్తారు? కవి వర్ణన, చిత్రకారుని నైపుణ్యం ఆ రూపాన్నీ కల్పించాయి. తప్ప అందులో విశేషం ఏముంటుంది?
కొమ్మలెన్నైనా, కాండమొక్కటే
విత్తనం మొలకెత్తినప్పుడు ఒక అంకురం, రెండు పప్పుబద్దలు (ఆకులు) వుంటాయి. ఎదిగిన తర్వాతనో? మొదలు ఒకటే కాని, కొమ్మలు అనేకం! ఒక కొమ్మ లావుగా వుండొచ్చు. మరొకటి సన్నంగా వుండొచ్చు. అయినా వేర్లు భూసారాన్ని కొమ్మకొమ్మకూ పంపేది ఒక్క మొదలుద్వారానే అని మరిచిపోరాదు. అన్ని జాతుల, దేశాల ప్రజల ఆధ్యాత్మిక తపనను తీరుస్తున్న భగవంతుడు ఒక్కడే సత్యం. సత్యం. వినయం. త్యాగం వంటి సద్గుణాల ద్వారానే ఆయన తన దివ్యకార్యాన్ని ఘటిస్తున్నాడు.

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.