సబ్ ఫీచర్

‘112 ఇండియా’ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మహిళాలోకం బిక్కుబిక్కుమంటోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఆపద పొంచి ఉందో, ఎవరు దాడి చేస్తారో, ... ఇలా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు, ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించేందుకు ఈ ఏడాది జనవరి 19న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘112’ ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దానితో పాటు ‘112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. అమెరికాలో 911 నెంబర్ ఎలాగో భారతదేశంలో 112 అదేవిధంగా ఎమర్జెన్సీ సేవలను అందిస్తుంది. ‘112 ఇండియా’ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని కష్ట సమయంలో అందులోని బటన్‌ను ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందుతుంది. ఎలాంటి వాయిస్ కాల్ లేకుండానే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని బాధితురాలి చెంతకు పోలీసులు చేరుకుంటారు. అందులోని ప్రత్యేక సదుపాయాన్ని ‘షౌట్’ అంటారు. దీనికి చేయాల్సిందల్లా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత మొబైల్ నెంబరును ఉపయోగించి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగానే జీపీఎస్ సాయంతో మొబైల్ స్క్రీన్‌పై మీరున్న ప్రాంతం కనిపిస్తుంది. స్క్రీన్ దిగువన నాలుగు అంశాల బ్లాక్ ఉంటుంది. అందులో పోలీస్, ఫైర్, మెడికల్, అదర్స్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో కావాల్సిన ఐకాన్‌ను క్లిక్ చేస్తే చాలు.. సమాచారం పంపించాలా? అనే పాప్‌అప్ విండో వస్తుంది. దాన్ని ‘ఓకే’ చేస్తే మీరున్న ప్రాంతం, మీ మొబైల్ నెంబర్ తదితర వివరాలు పోలీసులు, మీరు ఏ విభాగాన్నయితే ఎంచుకుంటారో ఆ విభాగానికి చేరిపోతాయి. వాటి ఆధారంగా భద్రతా సిబ్బంది బాధితుల దగ్గరకు చేరుకుని సాయం చేస్తారు.
ఈ యాప్ గూగుల్ ఈఎల్‌ఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఈఎల్‌ఎస్ అంటే ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్. గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ ద్వారా వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులకు చేరిపోతుంది. అక్షాంశం, రేఖాంశాల సాయంతో లొకేషన్‌కు కేవలం ఐదు నుంచి యాభై మీటర్ల వరకు వ్యత్యాసంతో సంకేతాలు అందుతాయి. దీంతో స్పందించి ఘటనాస్థలానికి వెంటనే చేరుకోవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలోనే కాకుండా సాధారణ ఫోన్లలోనూ ‘112’ సేవలు పొందవచ్చు. లేదా వరుసగా మూడుసార్లు పవర్ బటన్‌ను నొక్కినా, ఐదు లేదా తొమ్మిది నెంబర్‌ను లాంగ్ ప్రెస్ చేసినా 112కు కాల్ వెళ్లేలా ఇప్పటి సాధారణ ఫోన్లను తయారు చేస్తున్నారు.