సబ్ ఫీచర్

పరివర్తన కోసం ఏం చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వ వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’పై నలుగురు యువకులు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఉదంతం యావత్ దేశాన్ని కుదిపివేసింది. ఆ నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చేయడం కూడా అంతే సంచలనం సృష్టించింది. ‘దిశ’ ఘటన పార్లమెంటును సైతం కుదిపివేసింది. దేశవ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు స్పందించి కొవ్వొత్తులతో ఊరేగింపులు జరిపారు. కోర్టు విచారణతో సంబంధం లేకుండా నిందితులను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. ఈ దారుణ ఉదంతాన్ని విశే్లషిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి.
ఒక టీవీ చానల్‌లో గురువారం రాత్రి వచ్చిన ప్రోగ్రాంలో నిందితుల గ్రామానికి చెందిన ఒకరిని ఇంటర్వ్యూ చేశారు. ‘మా గ్రామంలో ఇలాంటి రేపిస్టుల గ్యాంగ్‌లో ఇంకా పాతిక మంది సభ్యులు ఉన్నారు’ అని ఆ గ్రామస్థుడు చెప్పాడు. గ్రామాల్లో సైతం పెడదారి పడుతున్న యువత ప్రస్తుతం ఎలా బరితెగిస్తున్నారో తెలిస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అత్యాచారం జరిగినపుడు బాధిత యువతి దీనంగా ‘హెల్ప్.. హెల్ప్’ అని అరిచినా అరణ్య రోదనే అయింది. ‘దిశ’ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళితే ‘ఈ కేసు తమ పరిధిలోకి రాద’ని తెగేసి చెప్పారు. అయితే, చివరికి ఆ పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
సభ్య సమాజం తలవంచుకునేలా జరిగిన ఈ సంఘటన భారతదేశంలో మొదటిదీ కాదు, చివరిదీ కాదు. సౌదీ అరేబియాలో ఇలాంటివి జరిగితే దోషులను అక్కడికక్కడే ఎన్‌కౌంటర్ చేస్తారు. మనది బుద్ధుడు పుట్టిన భూమి. ఈ చెంపకొడితే- ఆ చెంప చూపించండి.. అనే బోధలు నమ్మినవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. మరి రెండో చెంప మీద కూడా కొడితే ఏం చేయాలో ఎవరూ చెప్పలేదు. 2005లో ఇస్రత్ జహాన్ అనే గ్యాంగ్‌లీడర్‌ను కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హత్యచేసే నిమిత్తం అహమ్మదాబాద్‌కు పంపారు. ఐతే ఇస్రత్ జహాన్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు పి.చిదంబరం లాంటివారు కన్నీరు కార్చారు. మోదీని నర హంతకుడని కొందరు అన్నారు. సోనియా పరివార్ రాత్రింబవళ్లు మోదీపై విష ప్రచారం చేశారు.
నిర్భయ అనే అమ్మాయిని ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ చేస్తే ఆ కేసు కోర్టుల్లో ఏళ్ల తరబడి మూలుగుతూ ఉంది. పార్లమెంటు భవనంపై టెర్రరిస్టుల దాడి కేసులో పాతికేళ్ల తరువాత కరడు కట్టిన ఉగ్రవాదికి ఉన్నత న్యాయస్థానం ఉరిశిక్షను ఖరారు చేస్తే అతడికి క్షమాభిక్ష పెట్టవలసిందిగా సీపీఎం నేత ఏచూరి సీతారాం అర్ధరాత్రి రాష్టప్రతి వద్దకు వెళ్లిన ఘనత మన దేశానిది. కేరళలో ఫ్రాంకో ములక్కల్ అనే మత ప్రచారకుడు క్రైస్తవ సన్యాసినుల (నన్స్)ను దశాబ్దాలుగా రేప్ చేస్తుంటే అతనిని అరెస్టుచేయడానికి అక్కడి ప్రభుత్వం ముందుకు రాలేదు. అరెస్టు చేసినా కోర్టులో బెయిలు ఇప్పించారు. ఇదీ మన న్యాయవ్యవస్థ. కేరళలోనో, శంషాబాద్‌లోనో కాదు.. దేశంలో ఎక్కడపడితే అక్కడ రేపిస్టులు ఉన్నారు. వీరికి భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. కొంతమంది ఘరానా నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసినా రాజకీయ నాయకులు వెంటనే వారిని విడిపిస్తారు.
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? డ్రగ్స్‌కు, మద్యానికి బానిసలైనవారు ఎంతటి ఘాతుకం చేయడానికైనా సిద్ధపడతారు. కాబట్టి దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధం అమలుచేయాలి. ఫాస్ట్‌ట్రాక్ కేసులు ఏర్పాటుచేసి ఒకటి, రెండు నెలల్లో కేసులు పరిష్కరించాలి. ‘శంకరాభరణం’ వంటి కళాఖండాల్లో కూడా రేప్ సీన్లు ఉన్నాయంటే మన కళారంగం ఎంత భ్రష్టుపట్టిందో ఊహించుకోవచ్చు.
‘సామజ వర గమనా! నిను చూచి ఆడగలనా?’’
‘‘గాలి నిన్ను తాకింది వెలుగు నిన్ను తాకింది నేను తాకితే తప్పా?’’
ఈ పాటలు రాసిందెవరు? చీకటి పడేసరికి ‘నన్ను దోచుకొందువటే వనె్నల దొరసానీ’’అంటూ మ్యూజిక్ గాంగ్‌లు శబ్ద కాలుష్యం, భావ కాలుష్యం సృష్టిస్తున్నాయి. వీరినుండి సామాన్యులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత సెన్సారు బోర్డుమీద, ప్రభుత్వం మీద, పోలీసువ్యవస్థ మీద లేదా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ‘దిశ’ నిందితులకు జరిగిన ఎన్‌కౌంటర్ నరేంద్ర మోదీకి ఆదర్శం కావాలి. నేరస్థులను అక్కున చేర్చుకుంటున్న క్రిమినల్ ముఖ్యమంత్రులు సిగ్గుతో తల వంచుకోవాలి.
కొన్నాళ్ల క్రితం తెలంగాణలోని హాజీపూర్ వద్ద శ్రీనివాసరెడ్డి అనే రేపిస్టు దారినిపోయే ఆడపిల్లపై అత్యాచారం చేసి వారిని బావిలో పడవేశాడు. ఈ కేసు రెండురోజులు సంచలనం సృష్టించింది. ఆ తర్వాత షరామామూలే. అంతా మరచిపోయారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. శిక్షలు ఖరారు కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)ని మార్చేస్తామని అంటున్నాయి పాలకవర్గాలు. కాని నేరస్థుల కొమ్ముకాచే రాజకీయ వర్గాల మాటేమిటి? మరోమాట- ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలు, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’లూ సమాజంలో ఎందుకు పరివర్తన తీసుకొని రావడం లేదు? లోతుగా ఆలోచించండి??

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్