సబ్ ఫీచర్

గ్రంథాలయాలతో మంచి నడవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తున్న క్రమంలో గ్రంథాలయాల వినియోగం తగ్గి పాఠకుల సంఖ్య రోజురోజుకు తగ్గి సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య తగ్గి వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఆధునిక శాస్త్ర సాంకేతిక సమాజంలో గ్రంథాలయాలలో పాఠకుల ఆదరణ కరువై ‘సామాజిక మాధ్యమాలు’ విస్తృతి పెరుగుతున్న క్రమంలో పిల్లలు మరియు యువత ఆ చట్రంలో ఇరుక్కుపోవడం కలవరపెట్టే అంశం. పూర్వకాలంలో గ్రంథాలయంలోని చదివిన ‘పుస్తక జ్ఞానం’ పిల్లలు మరియు యువత జీవితంపై తనదైన ముద్రవేసి సన్మార్గంలో వెళ్ళేవిధంగా తోడ్పడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో ప్రముఖ పాత్ర పోషించేది. కానీ నేటి గ్లోబల్ ప్రపంచంలో చరవాణిలు మరియు కంప్యూటర్లు వాడుకలోనికి వచ్చిన తరువాత ‘సామాజిక మాధ్యమాల’ విస్తృతి పెరగడంతో పిల్లలు మరియు యువత వాటికి బానిసవుతూ కాలాన్ని వృథా చేసుకుంటూ పెడదారి పడుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు యూట్యూబ్ లాంటివి యువత మరియు పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లలు తరచూ ఫోన్లు మరియు కంప్యూటర్లు వినియోగించుకోవడంపై మందలిస్తే వారిలో భావసమతుల్యత లోపించి క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ మధ్య వచ్చిన భయంకరమైన మొబైల్ గేమ్ అయిన పబ్జిగేమ్ ప్రభావం వలన పిల్లలు మరియు పెద్దలు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు.
సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లల మరియు యువత వ్యక్తిత్వ నిర్మాణంలో తిరోగమన ప్రభావం చూపుతున్నాయని అనేక అధ్యయనాలు చెప్పినప్పటికీ మార్పురావడం లేదు. ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల వల్ల పిల్లల్లో క్రియాశీలత లోపిస్తూ కృత్రిమమైన జ్ఞానానికి పరిమితం కావడం మరియు చదువుల్లో వెనకబడుతూ వత్తిడికి గురికావడం జరుగుతుంది. నేటి సమాచార సాంకేతిక విప్లవంలో వాటి వినియోగంపై పరిమితి లేకపోవడంవలన నిజమైన భౌతిక మానవ ప్రగతిని అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. ఒకప్పుడు టీవీలు కంప్యూటర్లు చూసే పిల్లలు మరియు యువత పెడదారిపడుతోంది అని ఆందోళన చెందేవాళ్ళం. కానీ నేడు వాటికన్నా పెనుభూతంగా ఈ సామాజిక మాధ్యమాలు తయారుకావడం జరిగింది. గ్రామాలలో యువత, చదువుతున్న విద్యార్థులు సామాజిక మాధ్యమాల వేదికగా కులాలు, మతాలు, పార్టీల, దేశభక్తి మరియు ప్రభుత్వాలపై పోస్టులు పెడుతూ అనేక వాగ్వివాదాలు, గొడవలు కొని తెచ్చుకుంటూ పనిపాట చేయకుండా కాలాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని సందర్భాలలో అసభ్యకరమైన మరియు క్రూరమైన వీడియోలు చూస్తూ వాటిని అనుకరించడం జరుగుతుంది. యువత సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరిపైఒకరు ఆవేశం, ఆక్రోశంతో ద్వారా పౌరుష పదజాలాలు వాడుతూ వాగ్వివాదాలకు దిగడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్టులు సమస్యాత్మకంగా మారి సాంకేతిక చట్టం-2000 (ఐటి చట్టం) సెక్షన్ 66 ప్రకారం చట్టపరమైన శిక్షలకు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గ్రంథాలయ ప్రచారం కొరవడుతూ, కేవలం జిల్లా కేంద్రానికి వారోత్సవాలు పరిమితం చేసి మండల, గ్రామం గ్రంథాలయాలలో ఎలాంటి వారోత్సవాలు నిర్వహించరాదని అంతర్గత ఉత్తర్వులు జారీచేయడం విచారించదగ్గ విషయం.
ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు అవసరం ఉన్నప్పటికీ వాటి వినియోగంలో విజ్ఞతను పాటిస్తూ గ్రంథాలయ విజ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. యువత, పిల్లలు సామాజిక మాధ్యమాలకు సాధ్యమైనంత మేరకు దూరంగా ఉంటూ సామాజిక స్పృహను పెంచుకుంటూ ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి. అదే విధంగా తల్లిదండ్రులు కూడా వారిని సరైన మార్గంలో పెట్టడానికి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచుతూ గ్రంథాలయ ప్రాముఖ్యాన్ని వివరించాల్సిన అవసరం కూడ ఉంది. యువత, పిల్లలు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానాన్ని చేరడానికి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. తద్వారా ప్రపంచ జ్ఞానం మనలో నిబిడీకృతమై భావోద్వేగ సమతుల్యతను పాటిస్తూ ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి, వాటిని వినియోగించుకునేటట్లు యువతను, పిల్లలను ప్రోత్సహించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ భవిష్యత్తు మేధావి వర్గంగా తయారుచేయవలసిన అవసరం ఉంది. ప్రతి ఏటా గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గ్రంథాలయ ప్రచారాన్ని పునాది స్థాయినుంచి రాష్టవ్య్రాప్తంగా అట్టహాసంగా నిర్వహించాలి. నేటి సమకాలీన సమాజంలో మారుతున్న ఆధునిక శాస్తస్రాంకేతిక అభివృద్ధిలో భాగంగా డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటుకై ప్రభుత్వం కృషిచేస్తూ జ్ఞాన సమాజ నిర్మాణానికై మరో గ్రంథాలయోద్యమానికి ప్రభుత్వాలు పునరంకితం కావాలి.

- సంపతి రమేష్ మహరాజ్, 9959556367