సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాలయ ప్రబోధం
హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోట. ఔన్నత్యానికీ, గాంభీర్యానికీ అవి ప్రతీక. మనం స్వచ్ఛంగా వుండాలన్న సంగతిని అవి గుర్తుచేస్తుంటాయి. మీ మనస్సులను హిమశృంగాల లాగానే స్థిరంగా, చుట్టూజరిగే బజారు రద్దీకి చలించకుండా వుంచుకోవాలని అవి బోధిస్తున్నాయి.
అగ్ని-అమృతం
దేవుని పేర్లలో రెండక్షరాల మాటలే ఎక్కువగా వుంటున్నాయి. రామ, కృష్ణ, హరి, దత్త, కాళీ, శక్తి, దుర్గ, సాయి మొదలయినవి. మొదటి అక్షరం అగ్నిరూపం. పాపాలను దహిస్తుంది. రెండవ అక్షరం అమృత రూపం. పునరుజ్జీవింప చేస్తుంది. మొదటి అక్షరం పని చెడును తొలగించటం; మంచిని పెంచటం రెండవ దాని పని.
సత్సంగత్వే...
ప్రతి వ్యక్తి సత్సాంగత్యం చేయాలి. సత్పురుషుల అండతో ముందుకు సాగటానికి మనకు ఎక్కువ వీలు చిక్కుతుంది.
ఒకసారి గరుత్మంతుడు కైలాసం వెళ్లాడు. అక్కడ శివుని మెడలోనూ, చేతులకూ, శిరస్సు పైగా నాగుపాములే అలంకారాలుగా వున్నాయి. పాము కనిపిస్తే చీల్చిచెండాడే గరుత్మంతుడు వాటినేం చేయలేకపోయాడు. సర్పాలకు కూడా శివుని సాంగత్యంవల్ల రక్షణే కాదు. పూజనీయత లభించింది.
అదొక్కటే అడక్కు
సినిమాలు చూస్తుంటారు. జనం క్లబ్బులకు వెళుతుంటారు. చీట్లపేక లాడుతుంటారు. వీటన్నిటికీ టైముంటుంది. ‘్భజన చేయండి: భగవంతుని స్మరించండి: పవిత్రులు కండి!’ అంటే, ఏదో ఒక పని వచ్చిపడుతుంది. భజనకు రావటం కుదరదు. తలకాయలొకదానినొకటి కోపావేశాలతో ఢీకొట్టుకుంటుంటే, కాళ్లు స్థిమితంగా నిలుచోగలవా? అనికూడా విజృంభించి పిచ్చి పిచ్చిగా తన్నుకోవా?
అలవాటు
నీ స్థూల దేహానికి మధ్యమధ్య ఆహార పానీయాలు యిచ్చి పోషించుకుంటున్నట్లే సూక్ష్మదేహానికి కూడా నియమంగా జపం, ధ్యానం, సచ్ఛీలం మొదలయినవి ఆహారంగా ఇచ్చి పోషించుకోవాలి. అంతరంగంలో వుండే జీవునికి సత్సంగం, సత్ప్రవర్తన, సచ్చింతన ఎంతో అవసరం.
ఈ దేహం అంటే ఏమిటి? భువనేశ్వరుని భవనం! ఇదే ఆయన భువనం! నీ దేహానికి టైముకు కాఫీ ఎలాకావాలో, అలాగే నీ ఆత్మకు టైముకు జపం కావాలి. ఆ అలవాటును కూడా చేసుకో.
పిలు! పలుకుతా!
అందరినీ నారాయణ స్వరూపులుగా భావించండి! ప్రేమతో ఆరాధించండి! సన్నర్థం చేసికోవాలన్న పవిత్ర దృష్టినలవరచుకోండి! పవిత్రమైన విషయాలను గుర్తించాలంటే అలాంటి వాటిని వెదికేవారు కావాలి. మరేది వెదుకుతున్నారో అదే మీకు దొరుకుతుంది. మీరేది చూద్దామనుకుంటున్నారో అదే మీకు కనిపిస్తుంది. రోగులున్నచోటనే డాక్టరుగారూ కనిపిస్తారు. సర్జన్ కావాలంటే ఆపరేషన్ థియేటర్‌లో దొరుకుతాడు. అలాగే, కన్నీళ్లూ, కడగండ్లూ ఎక్కడున్నాయో, భగవాన్ అక్కడే వుంటాడు. బాధతో వేదనతో ‘ఓయి దేవుడా’అని జనం చిత్తశుద్ధితో ఆక్రోశించినప్పుడు దేవుడక్కడే ప్రత్యక్షవౌతాడు. అంతా నీ పిలుపులోనే ఉంది.
ఏదీ చెడ్డది కాదు
భారతదేశ సంప్రదాయాలలో వౌలికంగావున్న భావన సహనం. సానుభూతి. ఎవరికి ఏ ఆపద జరిగినా నీ హృదయం సానుభూతితో నిండిపోవాలి. ఎవరినీ హీనుడనీ, నీచుడనీ తేలికగా చూడకు. చిన్న పుల్లకదా అని తోసిపుచ్చకు. అదే పన్ను కుట్టుపుల్లగా వుపయోగిస్తుంది. దేవుడెవర్నీ సంపూర్ణంగా చెడ్డవాడిగానో, సంపూర్ణంగా మంచివాడిగానో సృష్టించలేదు. నీ ఇష్టాయిష్టాలనుబట్టి నీవే వారికి ఆ ముద్ర వేస్తున్నావు.
ఒకే ఇల్లు
బాహ్యచిహ్నాలకు బూటకపు విలువలనెందుకు ఇవ్వటం? సరిహద్దుల అవతల జన్మించాడని మరో మనిషిని ఎందుకు అసహ్యించుకోవటం? భగవంతుని మరో పేరుతో పిలుస్తున్నాడని, ఇతర మతస్థులను ఎందుకు ద్వేషిస్తావు? హద్దులదేముంది. ఎప్పుడూ మారుతునే ఉంటాయి. అవి మనిషి కల్పించుకున్న గీతలే. భగవత్సేవ విషయంలో అటువంటి వాటిని పట్టించుకోవద్దు. దేవుడు ఈ ప్రపంచమంతటినీ ఒక ఇంటిగా చేశాడు. ఆ భవనంలో ఆయా దేశాలు అన్నీ వేరువేరు గదులు!

ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.