సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనని
ప్రతి వ్యక్తికీ జన్మనిచ్చిన జనని వుంది. సంసారంలో తల్లి పాత్ర చాల గొప్పది. సంస్కృతీ సంప్రదాయాలను ఇల్లాలు చక్కగా తెలుసుకొని వుండాలి. పవిత్రమైన భావాలతో, ప్రేమ స్వరూపిణిగా వుండాలి. మంచి తల్లులే మంచి జాతిని రూపొందిస్తారు. వారిలో త్యాగం, యోగం, భక్తి నిండి వుండాలి. క్రమశిక్షణ, భక్త్భివాలతో నిస్సంగిగా వుండాలి. వారి కర్మ(చేసే పని) అంతా ఈ ఆదర్శాల కనుగుణంగా వుండాలి.
పట్టుకుంది ఎవరు?
అనేకమంది చెబుతుంటారు ‘స్వామి! మేమీ సంసారంలో పడ్డాము. ఈ సంసారం మమ్ములను బాధిస్తున్నది. వదలటం లేదు’అని. కాని పట్టుకున్నది నీవా? సంసారమా? సంసారానికి చేతులున్నాయా? చేతులు నీకు ఉన్నాయి. నీవు సంసారాన్ని పట్టుకున్నావు కాని సంసారం నిన్ను పట్టుకోలేదు. నీవే సంసారాన్ని పట్టుకొని సంసారం నన్ను పట్టుకుందనుకోవటం ఎంత ఉల్టాసీదా!
భగవత్కృపకు ప్రతీక
‘స్వామికి నాపట్ల దయరాలేదు’ -అనుకొంటుంటారు మీరు. ఎందుకు రాదు? ఆయన మనసు కరిగేలా చేయండి! మీరాయనకై ఎలా తపిస్తున్నారో తెలపండి! మీ పశ్చాత్తప్త హృదయాన్ని, ఇతరుల యిబ్బందులపట్ల సానుభూతితో స్పందిస్తున్న మీ మనసును ఆయనకు చూపండి!
నిస్సంగం ద్వారా విషయ వాంఛలనుండి విముక్తిపొందాలి. అది చింతను క్షాళన చేస్తుంది. అప్పుడే దైవం స్పష్టంగా ప్రతిబింబించగలదు. యథార్థాన్ని నీవు గుర్తించగలవు. అప్పుడే నీకు శాంతి లభిస్తుంది. సమదృష్టి కలుగుతుంది. ఉత్కృష్టమైన భగవత్కృపకు అది ప్రతీక.
సుఖ దుఃఖాల ఆశ
ఆదర్శాలు ఉన్నతోన్నతంగా వుండాలి. కోరికలు స్వార్థరహితంగా వుండాలి. సంగాలను ఉదాత్తంగా మలచుకోవాలి. అప్పుడే కథ మంచి పాకాన పడుతుంది. సుఖదుఃఖాల అరనుండి సాధకుడు మరింత పునీతుడై వెలువడుతాడు.
చంటి పిల్లవాడు చిక్కిపోతే ఉసూరుమంటావు. వళ్లుచేస్తే సంతోష పడతావు. వాడు మరీమరీ లావయిపోతే, మళ్లీ విచారిస్తావు. సుఖ దుఃఖాల అర అంటే యిదే!
ఎరుకలోనే వుంది!
‘సర్వం ఖల్విదం బ్రహ్మ’. అంతా ఆ బ్రహ్మమే. మనమంతా దైవాంశ సంభూతులమే. మనందరిలో వున్నది ఆ పరమాత్మే అయినప్పుడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు-వీరి గొప్పేముంది? వారు పుట్టిన రోజున మనం ఇంత భక్తితో, ఇంత ఉత్సాహంతో పండుగ చేసికోవటం ఎందుకు?
వారి ప్రత్యేకత వారిదే! ‘తామే దైవం’అన్న ఎరుక వారికుంది. నీకో? ‘సత్యమే దైవం, ఆత్మే పరమాత్మ’అన్న ఎరుక లేదు. అవతారమూర్తులకు కీర్తిప్రతిష్ఠలనూ, కరుణప్రేమలనూ బలపరాక్రమాలనూ, శోభాసౌందర్యాలనూ సంతరించి పెట్టేది ఆ ఎరుకే! సంగాలు అంటకుండా, బంధాలు చుట్టకుండా కాపాడేది ఆ ఎరుకే. కార్యకారణ సంబంధాల నుండీ, స్వప్న, సుషుప్తి, జాగ్రతవస్థల నుండీ ముక్తినిచ్చేది ఆ ఎరుకే!
అనుక్షణం జాకరూకత! అహరహం చైతన్యం! అవతారమూర్తుల ప్రత్యేకత అదే!
కౌరవ, పాండవ గాథ
భగవంతుని భార్య మాయ. కొడుకు మానసుడు. మానసునికి ఇద్దరు భార్యలు- ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి ముద్దుల భార్య. ఆమెకు ఓ వంద మంది సంతానం! పాపం, నివృత్తిని పెనిమిటి ఉపేక్ష చేస్తాడు. ఆమెకు పిల్లలు అయిదుగురు.
కౌరవ, పాండవ గాథలో అంతరార్థం యిది. అందరూ ఒకేచోట పెరిగారు. ఒకే తిండి తిన్నారు. ఒకే గురువుదగ్గర చదివారు. అయినా ఎవరితత్వం వారిదే.
కౌరవులకు ఆశ ఎక్కువ. క్రౌర్యమూ జాస్తే; ఆడంబరం అధికం, అసూయ సరేసరి! వాళ్లంతా ‘లంపటం’కన్న సంతానం కదా!
పాండవులు ఒక్కొక్కరూ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సద్గుణాలకు వరుసగా ప్రతీకలు. వారిది నిస్సంగత్వ స్వభావం కనుక భగవానుడే వారికి అమాత్యుడయ్యాడు.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.