సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలలు బోడులైన...
బోడిగుండు చేయించుకొని ప్రయోజనం ఏమిటి? అవతల అసంఖ్యాకంగా కోరికలు కట్టలుతెంచుకొని వస్తుంటే! ఈ రకమైన సన్యాసం ఉత్త బూటకం. అది ధర్మం పట్ల, సమాజం పట్ల కూడ అపచారమే. ఏ అవతారమూర్తి అయినా ఎవరికైనా సన్యాస దీక్ష యిచ్చారా? బాహ్య చిహ్నాలతో పనేమిటి? అవి అవసరం లేదు. జ్ఞానంవల్ల నిస్సంగత్వం రావాలి. అందుకు భగవత్కృప కావాలి. అదే ఆధ్యాత్మిక అభ్యున్నతికి పునాది.
మోహ క్షయం
మాయను జయించాలంటే, ముందు త్రిగుణాతీతుడు కావాలి. (సత్వ, రజస్తమో గుణాలకు లోబడకుండా చరించాలి). సత్వగుణం ఉత్తమగుణం అయినా, దానికికూడా అతీతుడు కావాలి. ఎందుకు? మోక్షం పట్ల కోరిక కూడా ఒక సంగమే. ఒక బంధమే! దాన్నీ వదిలించుకోవాల్సిందే!
గుణం అంటే ఏమిటి? తాడు! జీవుని కట్టివేసే తాళ్లు ఈ మూడు గుణాలే. తాడెంత మంచిదైనా బంధమే! ముక్తి అంటే మోహం (ఇంద్రియ వ్యామోహం)నుండి తప్పించుకోవడం, మోహక్షయమే మోక్షం.
రాగమే రోగం
సంగము, అనురక్తి, ఆసక్తి కారణంగా పక్షపాతం, భ్రమ, అయిష్టత కలుగుతూ వుంటాయి. అవి సత్యాన్ని మరుగుపరుస్తాయి. మేధను మొద్దుబారుస్తాయి. రాగమే రోగం. ముముక్షువుకు సంగమే రుగ్మత. యోగికి రాగం పనికిరాదు. ఇష్టాయిష్టాలకు అతడు దూరంగా వుండాలి. ఒకసారి ఒక వ్యక్తికో, అలవాటుకో, మేనరిజానికో నీవు అలవాటుపడితే వాటిని వదిలించుకోటం కష్టం.
విభూది
ఒక పదార్థాన్ని కాల్చినప్పుడు అది భస్మంగా మారిపోతుంది. అంతకుముందు ఆ పదార్థానికి వున్న నామం, రూపం పోయి భస్మంగా మిగిలిపోతుంది. అట్టి నామరూప రహితమైన భస్మమే అద్వైతం. నిజమైన అద్వైతి నిస్సంగే. నీవు అద్వైతివి కావాలనే స్వామి నీకు భస్మాన్ని ఇస్తారు. నీవు సంగాలనుండి విడివడాలనీ, అహంకారం నిర్మూలనం గావించుకోవాలనే నీకు భస్మాన్ని ప్రసాదిస్తారు. యద్ధృశ్యం తన్నశ్యం అని; రూప నామములు ధరించిన ప్రతి వస్తువు నశించక తప్పదు. ఆ రూపనామములను నిర్మూలనం గావించినప్పుడు అది భస్మంగా తయారౌతుంది. అయినా, పదార్థమందున్న రూపనామాలు రెండింటినీ నిర్మూలనం చేయాలి.
విభూదిని యిచ్చినప్పుడు కొంతమందికి సందేహం కలుగుతుంది- ‘స్వామి మనల్ని శైవులను కమ్మంటున్నారా’అని. విభూతి వినాశనం లేని దానికి గుర్తు. అన్నీ చివరకు బూడిదే అవుతాయి.
విభూది వైరాగ్యానికి సంకేతం. కర్మను దహించే జ్ఞానానికి ప్రతీక. అది ఈశ్వరుని విభూతికి చిహ్నం. నేను దానిని నీ నొసట వుంచి, నీలోనూ ఆ దైవత్వమే వుందని గుర్తుచేస్తున్నాను. నీవెవరవో నీకు గుర్తుకుతెచ్చే అమూల్యమైన వుపదేశం అది.
ఈ శరీరం ఎప్పటికయినా పిడికెడు బూడిదయేదేనని కూడా అది స్పష్టం చేస్తుంది.
విభూది బోధించే పాఠం విరాగం, నిస్సంగం.
ఉపేక్ష
సుఖ దుఃఖాలనే అలలో అటూయిటూ కొట్టుకొని పోతుండే జీవి ఏది ప్రాప్తించినా సమంగా స్వీకరించాలి.
పనసకాయ చెక్కుతీస్తుంటే చేయి బంకట్లాడుతుంది. అలాకాకుండా వుండాలంటే, చేతికి రెండుచుక్కలు నూనె రాచుకోవాలి. ఈ సంగతే చెబుతూ రామకృష్ణ పరమహంస ‘లౌకిక లంపటాలు నిన్నంట కూడదనుకుంటే ఉపేక్ష అనే తైలాన్ని నీ మనసుకు రాసుకో’ -అన్నారు.
దయలేని దైవం
ఒక కవి యిలా రాశాడు: ‘‘ఓ కృష్ణా! నీవు నాపట్ల దయ చూపుతావని నేనెట్లా అనుకుంటాను? నీ మేనమామను నీ చేతులతోనే చంపేశావు. నీకు పాలివ్వటానికి వచ్చి దాదిని చంపేశావు. నీకు అత్యంత భక్తుడైన ప్రహ్లాదుడు చూస్తుండగా ఆయన తండ్రిని దారుణంగా చంపేశావు. దానమడగటానికి వెళ్లి, మూడు లోకాలనూ నీ పాదాల వద్ద పెట్టిన బలిని తలపై కాలేసి పాతాళానికి తొక్కేశావు. అటువంటి నీకు నా బాధ చూసి దయ కలుగుతుందని ఎలా అనుకోకు?’’
నిజమే! దేవునికి ఎవరి పట్లా సంగం లేదు. ఆయనకు తనవారనీ, పరవారనీ లేదు.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.