సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలియై, చుట్టమవై...
సంతోషం ఒక వల లాంటిది. దుఃఖం నిజానికి ఒక ఉపాధ్యాయుని వంటిది. అది నీకు జాగ్రత్తగా వుండటం, ఎరుక, నిస్సంగం. విచక్షణలను బోధించి హెచ్చరిస్తుంది. మృత్యువు నీవు అనుకొనేటంత చెడ్డదేం కాదు- మృత్యుదేవత నీ స్నేహితుడు, నీ గురువు, నీ బంధువు నిన్ను తన వొడిలోనికి తీసుకొని లాలించి నీకు అన్నీ గుర్తుకుతెస్తాడు.
గుండె రాయి కాకూడదు- అది దృఢంగా వుండాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడే అది అలా దృఢంగా తయారుకాగలదు. పిరికితనంలో జారిపోయేది కాకూడదు- మృదువుగా వుండాలి. కష్టాలూ కన్నీళ్లూ, యిబ్బందులూ కలిగినప్పుడే గుండె అలా కరిగి మెత్తబడుతుంది. భగవంతుడు దైవత్వం అన్న మూసలో పోసి నిన్ను సరిగా తయారుచేసే పద్ధతులే యివన్నీ.
దేవుని ఆరాటం
దేవుని చేరుకోవాలని భక్తునికి వుండే ఆరాటంకన్న భక్తుని చేరాలని దేవుని కుండే ఆరాటం ఎక్కువ. నీవు ఆయనవేపు ఒక్క అడుగువేస్తే చాలు. ఆయన నీ వేపు వందడుగులు వేస్తాడు. నీ తల్లీతండ్రీ కన్న మిన్నగా నిన్ను చూసుకుంటాడు. ఆయన యందు నమ్మకముంచిన సాధు సత్తములను ఎందరినో ఆయన కాపాడాడు. నిన్ను అలాగే కాపాడుతాడు.
జీవితంలో ఆయా దశలలో ప్రకృతిసిద్ధంగా సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. ఆ ఆవేశకావేశాలను పీల్చుకొంటూ వుండే అద్దుడు కాగితానివి కావద్దు.
అరుణోదయం కాగానే వికసించే పద్మంలా నీవు శోభిల్లాలి. తాను బురద నీటిలోనే పుట్టినా దానికి ఆ బురదేమన్నా అంటుతున్ననా? తామర పూవుకే కాదు, దాని ఆకుకుకూడా కనీసం నీరైనా అంటదు. (అలా తామరాకుపైని నీటిబొట్టులా ఏదీ అంటకుండా వుండగలగాలి.)
ఏకైక మార్గం
నీకున్న బంధాలెన్నో! స్నేహబంధం, బాంధవ్య బంధం. సంసారబంధం- అన్నిటినీ వదిలేయి. అంటే, వాటన్నిటికీ సంబంధించిన సంగాన్ని వదిలేయి. ఆ విధంగా నీ హృదయం విముక్తి పొందుతుంది. అందులో దేవదేవుని ప్రతిష్ఠించుకో. త్యాగాన్ని అలవరచుకో. అమృతత్వసిద్ధికి యిదొక్కటే మార్గం.
యుద్ధం చేయి!
మనసును భగవస్సాన్నిధ్యంలో వుంచటం అనే సాధన చేయండి! మీరే పని చేసినా. దానిని భగవదర్పితం చేయండి! వానికే దోషమూ అంటదు.
కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు. అయితే, శత్రువుల పట్ల ద్వేషంతోకాదు. యుద్ధం ‘రాగం’కోసం ద్వేషం కొట్లాటకు. కాని ద్వేషం లేకపోవటం ‘విరాగం’! ఈ రెంటికీ సుతి కుదరటం లేదు. ఈ రెంటినీ సమన్వయం చేయటంకోసమే అర్జునుడికి కృష్ణుడు ‘మామనుస్మర యుద్ధాచ’ (నన్ను స్మరిస్తూ, యుద్ధంచేయి!) అని బోధించాడు. ‘ఈ యుద్ధం నేను చేస్తున్నాను’, అన్న అహంకార బుద్ధితో చేయకు. ‘నేను నిమిత్తమాత్రుణ్ణి. అంతా ఆయనే చేస్తున్నాడు’అన్న యెరుకతో చేయి’, అంటారు భగవానులు!
ఫలితం పరమాత్మకు...
యుద్ధరంగంలో ప్రశ్న ఎవరు ఎవరికి ఏవౌతారనేది కాదు. ఎవరిది ధర్మం? ఎవరిది ఆధర్మం- అనేది.
‘యుద్ధం చేయి!’-అని చెప్పాడు, అర్జునునితో కృష్ణుడు. ‘న్యాయంకోసం, సత్యంకోసం యుద్ధం చేయి! క్షత్రియుడివిగా యుద్ధం చేయడం నీ స్వధర్మం కనుక యుద్ధంచేయి! ఫలితాన్ని పరబ్రహ్మకు వదిలేయి!’
అర్జునుడి విషాదయోగం చూసి కృష్ణుడు ‘నీవిలా బేలలా దుఃఖించటం ఆశ్చర్యంగా వుంది. నీవు గుడాకేశుడవు. (నిద్రనూ-అజ్ఞానాన్ని జయించిన వాడవు.) నీవు చంపుతున్నావని భ్రమపడకు.
‘మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్త మాత్రం భవ!’
వీరందరూ నాచే యిదివరకే చంపబడ్డారు. నీవు (వారి మరణానికి) నిమిత్త మాత్రుడివి కా!’అని చెప్పాడు.
జన్మాంతర జ్ఞాపకాలు
గత జన్మ తాలూకు అనుభవాలేవీ యిప్పుడు మాకు ఎందుకు జ్ఞాపకం లేవని మీరు అడగవచ్చు. ఒక చిన్న ఉదాహరణ. ఒక మనిషికి చాల భాషలు వచ్చియుండవచ్చు. కాని, తమిళంలో మాట్లాడుతున్నప్పుడు తెలుగు మాటలు మనస్సులోకి రావు. ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు ఆలోచనలన్నీ ఆ భాషలోనే వెలువడుతాయి. అదే విధంగా, ఈ జన్మను మరచిపోతే పూర్వజన్మ స్మృతులు అందుతాయి. కాని, ఈ జన్మమీద మమకారం ఎప్పుడూ వదులుకోలేరు కదా! జ్ఞాపకాలు లేకపోయినా వాసనలు వదలవు.

ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.