సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు పావనుడు
కొంతమంది ఎప్పుడూ తమనుతాము తిట్టుకుంటూ వుంటారు. తమను రక్షించాలని దేవుడికి మొరపెడుతుంటాడు. ‘జీవుడు వేరు. దేవుడు వేరు- జీవుడెప్పటికీ దేవుడు కాలేడని’ వారు చెబుతుంటారు. అది చాల తప్పు. మనిషి సహజసిద్ధంగా పాపి కాడు. సంగాలే అతడిని పాపంలోకి నెడుతున్నాయి. పాపం చేస్తే, పశ్చాత్తాపంతో పోగొట్టుకోవచ్చు. మానవుడు పాపసుడు. ప్రేమ పూర్ణుడు, పరిపూర్ణుడు. అందుకే నేను ప్రశాంతి నిలయంలో ‘‘మనిషి పాపంలో జన్మించి, పాపంలో పెరుగుతున్నాడనే అర్థంవచ్చే శ్లోకాలను చదవనీయను. నీవే శౌచము. నీలో పవిత్రత ప్రస్ఫుటంకావాలి. నీ ప్రతి పనిలో అది ద్యోతకం కావాలి. అదే నాకానందం. అప్పుడే నా అనుగ్రహం వర్షిస్తుంది.
దుఃఖం దేనికి?
ఒక ఇంటిలో ఒక మృత్యువు సంభవించింది. అందరూ బాధపడుతున్నారు. ఈ బాధకు ఆ మృత్యువా కారణము? కాదు...కాదు... ఆ మరణించిన వ్యక్తిపైన ఉండిన అభిమానమే ఈ దుఃఖమునకు కారణము. మరణము కాదు దుఃఖమునకు కారణము. ఒక ఇంటిలో వ్యక్తి మరణించినప్పుడు ఆ ఇంటిలో వారు మాత్రమే దుఃఖిస్తారు. మరెవ్వరూ దుఃఖించరే! మరణమే మూల కారణమయితే అందరూ దుఃఖించాలి కదా! కాదు! కాదు! ఆ మరణించిన వ్యక్తిపైన ఉన్న అభిమానమే ఈ దుఃఖమునకు మూలకారణము. కనుక మొట్టమొదట ఈ అభిమానమును క్రమక్రమేణ మనం తగ్గించుకుంటూ రావాలి. దీనినే వేదాంత పరిభాష యందు ‘వైరాగ్యము’ అని చెబుతూ వచ్చారు.
ఒక జైలునుండి మరో జైలుకు...
ఒక జైలునుండి మరో జైలుకు మార్చేటప్పుడు మనిషి వెంట యిద్దరు పోలీసులుంటారు. పుణ్యమూ, పాపమూ, అనే ఆ పోలీసులిద్దరూ మనిషిని ఒక జన్మనుండి మరో జన్మకు తీసికొనిపోతుంటారు. వాళ్ల బాధనుండి నీవు ముక్తిపొందు. అందుకు కృషిచేయి. అయితే ఫలంపై ఆశ పెట్టుకోవద్దు.
‘కర్మణ్యేవాథికారస్తే
మాఫలేషు కథాచన’
కర్మయందే కాని నీకు ఫలితమందు అధికారం లేదు. అందుకే నీ కోరికను, కార్యాన్ని, ఫలాన్నీ అన్నీ ఆయనకే అర్పించు.
జగన్నాటకం
భగవద్గీత కర్మ సన్యాసం గురించి ప్రస్తావించింది. అంటే, కర్మను వదిలివేయమనా? కాదు, తన ధర్మం కనుక కర్మ చేయాలి. కాని దాని వల్ల ఏదో లాభం కలుగుతుందనే ఆపేక్ష పెట్టుకోరాదు.
సంసారంలో విధిగా చేయవలసిన కర్మలున్నాయి. ఆ విధులను సరయిన విధంగా - అంటే ఫలాపేక్ష లేకుండా నిర్వర్తిస్తే ఆ కర్మ నీకు అంటదు. ఈ జగన్నాటకంలో నీ పాత్రను నువ్వు చక్కగా పోషించు. అంతే నీవు చేయాల్సింది. దాంతో నీ బాధ్యత తీరుతుంది. ఈ పాత్రను నీకిచ్చిన ఆ జగన్నాటక సూత్రధారి ఆనందిస్తాడు.
వంతెనపై ఇల్లా?
ప్రపంచం అంటే ఏమిటి? ఎప్పటికీ నీవు తిష్ఠవేసే స్థలం కాదు; నీ సుదీర్ఘ యాత్రలో ఒకింత విశ్రమించే చోటు మాత్రమే. నీ లక్ష్యాన్ని సాధించే దానికి ఒక సాధనంగా నీవు ప్రపంచాన్ని వినియోగించుకో!
ఈ జగత్తొక వంతెన. బాగా వెడల్పుగా దృఢంగా వుందని దారివెంట పోయేవాళ్లు వంతెనపై యిల్లు కట్టుకుంటానంటే ఎలా కుదురుతుంది?
విశ్వం అనుక్షణం మారుతుంది. కోటి రూపాయలిచ్చినా, గతించిన నిమిషం ఒక్కటి కూడా వెనక్కిరాదు. గతం గతించింది. ఇక అది మనది కాదు. వర్తమానం చేజారిపోతూనే వుంది. భావి ఎలా వుంటుందో ఎవరికి తెలుసు?
ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటిపై పోచయినా లేకుండా వచ్చావు. పోయేటప్పుడూ అంతే! పైగా, పత్తాలేకుండా పోతావు. అయినా రుూ లోపల యిది నాది, అది నాది అంటూ గిరి గీసుకుంటావు. అంతా కేవలం భ్రమ!
భక్తి చెప్పుల మీదనా?
నీవు గుడికి వెళ్తావు. కాని ‘చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీద’ అన్నట్లుంటావు. నీ మనసును దైవంపై కేంద్రీకరించగలుగుతున్నావా? - చెప్పులమీదనా? సాధకుడు యిలా ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించాలి. సంగాలను వదిలించుకోవాలి. ప్రశాంతి నిలయాన్ని సందర్శించగానే, ఇక ముక్తి వచ్చేస్తుంది అనుకోవద్దు. దర్శనం, స్పర్శనం దొరికినా, సంభాషణం లభించినా ముక్తి లభిస్తుందని లేదు. ముక్తి లభించాలంటే స్వామి ఆదేశాన్ని తలకెక్కించుకోవాలి. ఆచరించాలి.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.