సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను, నాది
నీవు ఎవురు? నీ శరీరం, నీ మనస్సు, నీ యింద్రియాలు, నీ బుద్ధి, అలా అనుకోటంవల్ల నీ దేహాన్ని స్వస్థతగా వుంచుకొనేందుకు దోహదం చేకూరుతుంది. మసుకు కలిగే ఆకర్షణల సంగతి చూసుకోగలుగుతావు. నానారకాల రుచులు అనుభవించగలవు. బుద్ధి సత్యాన్నీ హేతువు అనుభూతినీ నమ్మవద్దంటాయి. ‘నాది’అన్న భావనవల్ల అన్నీ సంపాదించుకోవాలి అన్న కోరిక పుడుతుంది. ఆ సంపాదన ఎందుకు? కేవలం సంపాదించాం అన్న గొప్పకోసమే గదా! లేకపోతే, ఇంకొకరికి ఆ సొమ్ము దక్కకుండా మనమే ఆర్జించాలన్న తపనవల్లనా? అయితే బుద్ధిని సంపాదనకే కాదు, ముక్తికి కూడా వినియోగించవచ్చు. ముక్తి దేనినుండి? ‘నేను’ ‘నాది’-అన్న భావనలనుండి. ‘నేను’, ‘నాది’అన్న ధ్యాస వదిలివేసి ఆయన (్భగవాన్), ఆయనది (్భగవాన్‌ది)అన్న భావనను అలవరచుకో, ‘నేను’, ‘నాది’అన్న రెండు సంకెలలూ విడివడిపోతాయి.
ఏడుస్తూ రాక
నీ దేహం ఏమిటి? నీ మందిరం. పట్టుపురుగులా నీ కోరికలతో, నీ వాసనలతో నీ చుట్టూ నీవల్లుకున్న గూడు. ఇందులోకి నీవు వచ్చిందెందుకు? నీ వెవరవో ఎందుకొచ్చావో తెలుసుకునేందుకు. ఈ శరీరం వున్నంతకాలం దానిని నీ పనికి చక్కగా వాడుకో. నీకు రెక్కలు వచ్చి ఎగిరేదాకా ఈ పంజరాన్ని ఉపయోగించు. పుట్టే సమయంలో బిడ్డ ఏడుస్తూ పుడతాడు. ఈ లోకంలోకి బలవంతాన నెట్టబడినందుకే వాడు దుఃఖపడేది. భగవంతుని పట్టు సడలి, రుూ బంధాల్లో చిక్కుకొన్నందుకే ఆ ఏడుపు. రావటం ఏడుస్తూ వచ్చానుగదా అని ఏడుస్తూనే వెళ్లక్కరలేదు. దుఃఖాన్ని యిక్కడే రుూ జన్మలోనే వదిలేసి పో!
ప్రేమమానం
మీరు ఈ దేవుణ్ణి కొలుస్తున్నారా, ఆ దేవుణ్ణా-అన్న మీమాంస నాకు పట్టదు. వెలుగు చూడాలనుకున్నవారంతా నావద్దకు రావచ్చు. ఈ అద్భుత తాపం విషయ లంపటం అనే చలిని పటాపంచలు చేస్తుంది. యుగయుగాల అంధకారాన్ని దూరం చేస్తుంది.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే...
భగవద్గీతలో మొదటి మాట ఏమిటి? ‘్ధర్మక్షేత్రే...’ ధృతరాష్ట్రుడు ప్రశ్నవేశాడు ‘్ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మావాళ్లూ, పాండవులూ చేరి ఏంచేశారు?’ -అని పాండవులు కౌరవులకు ప్రతిపక్షం. వ్యామోహానికీ, స్వార్థానికి వ్యతిరేకులు, అంటే ధర్మాత్ములు అని అర్థం.
జయం ఎప్పుడూ ధర్మానిదే కాని మనుషులతో ‘మావాళ్లు’ అనిపించి, వారిని గుడ్డివారుగా చేసే లోభమోహాలది కాదు.
తాళం తిప్పు
తాళం కప్పలో తాళంచెవి పెట్టి కుడికి తిప్పితే తాళం వూడి వస్తుంది. ఎడమకు తిప్పితే తాళం పడుతుంది. నీ మనసును ప్రాపంచిక విషయాలవైపు తిప్పావో తాళం పడుతుంది. నీవు లంపటంలో చిక్కుపడిపోతావు. విషయ వ్యామోహాలనుండి పక్కకు తిప్పు. తాళం విడిపోతుంది. నీవు బయటపడతావు. ముక్తి కరతలామలకం అవుతుంది.
అయితే తాళాన్ని విడిపడేలా తిప్పటం ఎలా? నామస్మరణతో మొదలుపెట్టు. అది మొదటి మెట్టు. ఇక అక్కడినుంచి అదే నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. లంపటాలను వదిలించి గమ్యానికి చేరుస్తుంది.
శ్రీకృష్ణుని భార్యలు
శ్రీకృష్ణుడు అష్ట్భార్యలను పెండ్లాడాడు. ఈ ఎనిమిది మందికాక పదహారువేల మంది రాజకన్యలను నరకుడు చెరపడితే నరకాసుర సంహారం తరువాత విడిపించి వారి కోర్కెపై వారిని పెండ్లాడాడని భాగవతం చెబుతోంది. ఇందరు భార్యలున్నా శ్రీకృష్ణునికి ఏ సంగం లేదు. శ్రీకృష్ణుని భార్యల విషయంలో పైకి లౌకికంగా కనుపించే అర్థం ఒకటైతే, అంతరార్థం వేరొకటి.
మన దేహంలో షట్చక్రాలున్నాయి. ఈ ఆరుచక్రాలలో రెండు ప్రధానమైనవి. ఒకటి సహస్రారం: రెండు హృదయ చక్రం. హృదయ చక్రంలో హృదయ పుష్పం ఉంది. ఈ పుష్పానికి అష్టదళాలున్నాయి. ఈ అష్టదళ పుష్పం ప్రకృతి. శ్రీకృష్ణుడు పురుషుడు. అనగా భగవంతుడు. పుష్పంలో వున్న ఎనిమిది దళాలూ కృష్ణుని అష్ట్భార్యలు. ఇక సహస్రారంలో వేయి దళాలున్నాయి. ఒక్కొక్క దళం షోడశ కళలతో శోభిల్లుతుంటుంది. మొత్తం 16000 కళలన్న మాట. కృష్ణుడు తరువాత పెండ్లాడిన పదహారు వేల రాజకుమార్తెలు ఈ దళాలు. ఈ విధంగా అంతరార్థంలో ప్రకృతికి అధినాథుడై మన హృదయ చక్రంలో, సహస్రారంలో, ప్రకాశించే పరమాత్మను సూచించటం జరిగింది.
సంగం భగవాన్‌తోనే!
దేవుడు లేడనే వారు కూడా ‘నేను వున్నాను’ అంటారు గదా! అయితే ఈ ‘నేను’ ఎవరు? శరీరం మారవచ్చు. మనసు మారవచ్చు. సుఖమో, దుఃఖమో కలగొచ్చు. మారకుండా వుంటున్నది మాత్రం ఈ ‘నేను’ అన్నదే. ‘నేను’అనేది పరమాత్మ అన్న సముద్రంలో ఒక తరంగం.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.