సబ్ ఫీచర్

ఆదర్శ పౌరులకు అమ్మే తొలి గురువు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి నాణేనికి బొమ్మ బొరుసు వుండ టం ఎంత సహజమో, అదే విధంగా ప్రతి మార్పుకి మంచి చెడులు వుంటాయి. ఆధునిక నాగరికత (పేరుతో) వలన మన జీవన విధానంలో పలు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కారణంగా సమాజంలో విలువలు పతనావస్థకు చేరుకొన్నాయి. అదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కరవై, యాంత్రికజీవనం సాగిస్తున్నారు. కుటుంబ విలువలు పతనం కావడం ఎప్పుడు ప్రారంభం అయిందో, సమాజంలో కూడా వెర్రిపోకడలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా యువతలో దేశభక్తి సన్నగిల్లుతున్నది. దీని కారణంగా, యువత వక్రమార్గంలో (తీవ్రవాదం, నక్సలిజం, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం) ప్రయాణిస్తున్నారు. ఈ దుస్థితినుంచి యువత దృష్టిని మరలించగలిగిన సత్తా వారి తల్లులకే వుంది. ఈ నేపథ్యంలో మహిళలు తమ పిల్లలను దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రీయ సేవాసమితి ఏర్పాటు..
పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దేవిధంగా, మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది రాష్ట్రీయ సేవాసమితి. మహిళలు కేవలం తమ హక్కుల కోసం పోరాటాలు చేయకుండా, తమ పిల్లల పెంపకం పట్ల తగిన శ్రద్ధ చూపించి, వారి లో దేశభక్తిని పెంపొందించే విధంగా పెం చేలా చేయడమే తమ సంస్థ లక్ష్యమని రాష్ట్రీ య సేవికా సమితి ప్రధాన కార్యదర్శి అన్నదానం సీత పేర్కొన్నారు. మాతృత్వం అనే ది మహిళలకు భగవంతుడు ప్రసాదించిన అపూర్వమైన వరం. ఆధునిక సమాజంలో మాతృత్వం అనే పిల్లల్ని కనడం, చదివించడం, వారికోసం ఆస్తులు కూడబెట్టడం మాత్రమే అనుకుంటున్నారు.
అంతర్గత సామర్థ్యాల వెలికితీతకు శిక్షణ
భారతదేశంలోని మహిళలు వంటింటికే పరిమితం అవ్వడం వలన, అంతర్గతంగా వారిలో ఉన్న సామర్థ్యాలు మరుగున పడుతున్నాయి. భవిష్యత్తులో ఆ విధంగా జరుగకుండా నిరోధించేందుకు యువతులకు శిక్షణ ఇచ్చి, వారిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలను వెలికితీయడానికి రాష్ట్రీయ సేవికా సమితి సన్నాహాలు చేస్తూన్నది. ఈ శిక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు వలన పలువురు మహిళలు నట్టింట్లో భూతం (బుల్లితెర) బారినుంచి బయటపడే అవకాశం వుంది. ఏ రంగంలో అయినా మార్పువలన ఎంత మేలు జరుగుతుందో, కీడు కూడా అదేవిధంగా జరుగుతుంది. అయితే, అది మనపై ఆధారపడి ఉంటుంది. మంచిని స్వీకరిస్తే మంచి జరుగుతుంది. చెడును అనుసరిస్తే కీడు జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నది అదే.

చిత్రం.. రాష్ట్రీయ సేవాసమితిలో శిక్షణ పొందుతున్న మహిళలు

- పి.హైమావతి