సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు ముక్తుడవే!
‘నాకు ముక్తికావాలి’అని అంటుంటారు కొందరు. మిమ్మల్నెవరైనా బంధిస్తేకదా! మీరే మిమ్మల్ని ప్రాపంచిక వాంఛలతో బంధించుకుంటున్నారు. బాధపడుతున్నారు.
ఏదైనా మాంసపుముక్కను పక్షి ముక్కుతో కరచుకొని పోతుంటే దాని వెంట కాకులన్నీ అరుస్తూపోతాయి. దానిని వదలవు. చివరకది చిరాకులో మాంసాన్ని ఎక్కడో జారవిడుచుకుంటుంది. అంతే! ఆ కాకులన్నీ దానిని వదిలివెళ్లిపోతాయి. విషయ వాసనలను వదిల్తే విచారం. దుఃఖం నీ వెంటపడవు.
సంసార సులోచనం
మానవునికి సంసారం కంటి అద్దాలవలె ఉండాలి. కంటి అద్దాలు దృష్టిని అభివృద్ధిచేస్తాయే కాని, చూపుకు అడ్డం రావు కదా! అలాగే సంసార జీవితం భగవదృష్టిని అభివృద్ధిచేయాలి కాని, అందుకు అడ్డం వచ్చేదిగా ఉండకూడదు.
సర్వలోక హితే రతః
రామునిలో మూడు గుణాలుంటున్నాయి. సర్వ లోక హితే రతః సర్వలోకములకు హితమును బోధించి హితమును కలిగించి, హితమును అందుకొనేటటువంటివాడు. కనుకనేరాముడు దేవుడుగా మారిపోయినాడు. రావణాసురునికో? ‘సర్వమునేనే. నాకు మించినటువంటివారు లేరనే’ భావం ఉంది. అభిమాన, అహంకార, ఆడంబర జీవితమును గడపటం చేతనే రావణాసురుడు అంతమైనాడు. రాముడలా కాదు. నిగర్వి. ఒకసారి శ్రీరాముడు మిథిలకు వెళ్లుతూ ఉంటే మధ్యలో గౌతముని ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక రాతికి ఆయన పాదం తగిలింది. తక్షణమే ఆ రాతి నుంచి ఒక స్ర్తి ఉద్భవించింది. కాని శ్రీరాముడు నా పదము సోకిన వెంటనే రాతినాతిగా మారిపోయినదని గర్వించలేదు. అలా అనుకొని ఆనందించకపోగా ‘అయ్యో! మునిపత్నికి నా పాదము సోకినదే ! ఎంత పొరపాటు’ అని విచారించాడు. నమ్రత ఆయనకు పెట్టని నగ.
తన కోపమే తన శత్రువు
కారు, బ్యాంకు డిపాజిట్లు పట్నంల పోష్ లోకాలిటీలో మంచి బంగళా - ఇన్ని ఉండి ఏం ప్రయోజనం? నీ మనసులో ప్రేమ లేనపుడు? నీ గుండె కామ క్రోధాలనే గబ్బిలాలు వ్రేలాడే విథిలాలయంగా మారినపుడు అలాంటి మనసులు అంధకార నిలయాలు. దోష భూయిష్టాలు. దారుణ ప్రమాద భరితాలు.
నాలుగు వేదములు. ఆరు శాస్తమ్రులు పఠించిన రావణుని ‘దశకంఠుడు’ అన్నారు. పది తలలు గలవాడేమిటని విచిత్రంగా భావించవచ్చు. పది తలలు అంటే ఏమిటి? నాల్గు వేదములు, ఆరు శాస్తమ్రులు చదివినవాడు కనుకనే ఇతనిని పది తలలు గల (దశకంఠుడు) వాడన్నారు. ఇంతటి శక్తి సామర్థ్యములు గల రావణుడు కేవలం చిత్త శుద్ధి లేకపోవడం చేత కామం చేత అంతర్ ముఖత్వం కోల్పోయి అంధకారంలోనే మునిగాడు.
కోపం కన్న కఠినమైంది లేదు. అదివదలని మకిల. కోపం వచ్చినవారు తల్లీ, దండ్రీ, గురువూ అని చూడరు. అధః పాతాళానికి దిగజారి పోతారు. ఉద్రేకంలో విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతారు.
తన తోకను రాక్షసులు అంటించినందుకు కోపించిన హనుమంతుడు విజృంనించి లంకా దహనం చేశాడు. ఆ ఆవేశంలో ఆ లంకలోనే సీతమ్మవారు కూడా ఉన్నదన్న సంగతి విస్మరించాడు. తాను చేసిన పనికి చంకలు కొట్టుకుంటుండగా సీతమ్మతల్లి గుర్తుకు వచ్చింది. తక్షణమే అతనికి తన పొరపాటు అర్థమైంది. అపుడు కోపంలో మైమరిచినందుకు తనను తాను మందలించుకున్నాడు.
హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్టు. ఈ మధ్యనే పంచభూతముల యొక్క తత్త్వాన్ని ఆధునిక సైంటిస్టులు గుర్తించారు. కానీ ఎన్నో వేల సంవత్సరరములకు పూర్వమున్న హిరణ్యకశిపుడు ఆనాడే పంచభూతములను హస్తగతం చేసుకున్నాడు. అనేక పరిశోధనలు చేశాడు. ఋతువుల ధర్మాలను నియంత్రణ చేశాడు. భూమియొక్క బాలెన్స్ సరియైన రీతిలో పెట్టాలని ప్రయత్నించాడు. కాని ఇంత శక్తిగల వాడైనప్పటికినీ క్రోధము అనే చెడు గుణము ఇతనిలో ఉంది. ఎవరిపైన క్రోధము? నారాయణుని పైన క్రోధము. భగవంతుని పైన ఉన్న క్రోధము చేతనే కట్టకపటికి భగవంతుని చేతిలోనే మరణించాడు.
రుగ్మత
విషయవాసనలూ, చెడు ఆలోచనలూ శరీరంలో రుగ్మతను ప్రేరేపిస్తాయి. ఈ రుగ్మత శారీరికంగాను, మానసికమైనదిగానూ ఉంటున్నది. నిర్మలమైన మనస్సే ఆరోగ్యానికి మూలం. కాలుష్యం అనారోగ్యానికి దారి తీస్తుంది. చెడు తలపులు , చెడు అలవాట్లు, చెడు సావాసాలు, చెడు ఆహారం ఇవన్నీ రోగం అనే విషపు మొక్కల్ని పెంచి పోషించే సారవంతమైన మాగాణులని తెలుసుకో.
ఆరోగ్యం, ఆనందం ఇవి ఎప్పుడూ కలిసిమెలసే ఉంటాయి. ఆనందంతో పరవశించే దేహాన్ని అనారోగ్యం చేరలేదు.

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.