సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళుసు పలుకు
నాలుక గుండెకు కవచం. బ్రతుక్కు రక్షణ. పలుకు పలువిధాలు. కొందరు బిగ్గరగా అరుస్తారు. కొందరు అదేపనిగా మాట్లాడుతారు. కొందరు పిచ్చి పిచ్చిగా వాగుతారు. కోపంతో కేకలేస్తారు. ద్వేషంతో బుసకొడుతారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని చెడగొడుతాయి. వినేవారిలో కోపం, ద్వేషం రేకెత్తిస్తాయి. మనసులను గాయపరుస్తాయి. ఉద్రేక పరుస్తాయి. రెచ్చగొడుతాయి ఎడమొహాలకు, పెడమొహాలకు దారితీస్తాయి. మంచిగామాట్లాడు. మన్నన పొందు.
అహం చెడ్డది
మనస్సు నిర్మలంగా ఉంటే తప్ప సత్యం సాక్షాత్కరించదు. ఆడంబరం, అసూయ, అహంకారం, ఈ ముగ్గురూ అక్కచెల్లెళ్లే. మనిషి అసలు స్వభావానికి ఇవి గొడ్డలి పెట్టు. నేను భక్తుణ్ణి అనుకోటం కూడా తప్పే. నీవు పర్వతానివే కావచ్చు. కానీ ఈ సంగతి అనుకోవాల్సింది నీవుకాదు. అవతలి వ్యక్తి. నేనింతటి వాడిని అనుకోడమే అహం. అంతకన్నా దారుణం, నీవు ఒక పర్వతానివి కాకపోయినా అలా నటించటం.
అంతటా అధమ రకమే
మనకు తారసిల్లే వ్యక్తులు మూడురకాలు. మొదటి రకం తమలోని లోపాలను వొప్పుకుంటూ ఇతరుల గొప్పతనం గురించి మాట్లాడుతారు. వీరు ఉత్తములు. కొందరు తప గొప్ప చెప్పుకుంటూ ఇతరుల లోపాలను ఎత్తి చూపుతుంటారు. ఇది మంచిది కాదు. ఇంకా కొందరు తమ గొప్ప చెప్పుకుంటుంటారు. అంతేకాదు. ఇతరులలో కనిపించే మంచిని చెడ్డగా చిత్రించి చెబుతారు. ఇది దారుణంగా అయితేనేం. ఈ చివరి రకమే ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
ఆచారానికి అర్థం
కొందరు పైకి ఎంతో ఆచార వంతులుగా కనిపిస్తారు. కానీ మనసులో ఈర్ష్యాద్వేషాలు నిండి ఉంటాయి. ఏం ప్రయోజనం? ఆయన తన మడీ , ఆచారమే చూసుకొంటున్నాడు. కానీ భగవంతుడందరిలోనూ అంతటా ఉన్నాడని గ్రహిస్తున్నాడా? సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ అని తాను వల్లించే మంత్రాల అర్థం ఏమిటో తెలుసుకున్నాడా? కావలసింది అంతశ్శుద్ధి కాని బాహ్యాడంబరాలు కావు.
నిర్మోహ యోగం
భారత్ కానుక- సత్యం
మన ఋషులు నిర్దేశించిన ఆధ్యాత్మిక సూత్రాలు ఎప్పటికీ వర్తిస్తాయి. ‘పరిశోధన చేసినకొద్దీ అవి ఎంత యథార్థమో తేలుతుంది. ముడివజ్రానికి సానబెట్టినకొద్దీ మెరసినట్లు, పరిశోధన చేసినకొద్దీ ఆ సూత్రాల విలువ అర్థం కాగలదు. సత్యం అనే అమూల్య వజ్రాన్ని ప్రపంచానికిచ్చింది భారత్. ఆ సత్యం ఏమిటి? ‘ఈశ్వరః సర్వభూతానాం’. ‘హృద్దేశేనర్జున తిష్ఠతి’ ఈశ్వరుడు అన్ని భూతాలలోనూ వుంటాడు. ప్రతి వ్యక్తి హృదయ భాగంలో వుంటాడు. అన్ని జీవాలకూ స్ఫూర్తినిచ్చేది దేవుడే. ఇదే ఆ సత్యం! ఈ సంగతిని బాగా అవగాహన చేసికో. గర్వం, అహంకారం, ద్వేషం, కోపం అన్నీ నశిస్తాయి.
త్రిగుణాలు
ఆత్మదర్శనంకై, భగవద్దర్శనంకై ఎంతో పాటుబడాలి. ఈ ఆదర్శంకై జరిపే పోరాటంలో ఓడిపోయినా, అది లౌకిక వ్యవహారాలలో గెలుపుకన్నా మిన్న.
గేదెకు కొమ్ములుంటాయి. ఏనుగుకు దంతాలుంటాయి. రెండూ జంతువులే. ఏం తేడా వుంది? దేహం కోసం దేహాన్ని అంటిపెట్టుకొని బతకడం ఏం బతుకు? ఒక పురుగు బతుకు. దేహంలో వుంటూ భగవానునికై జీవించటంలో ధన్యత వుంది. మందంగా, క్రియాశూన్యంగా వుండే తామసిక పురుషులను అహంకారం జాస్తీ. వారి ప్రేమ తమ బిడ్డా పాపకే పరిమితం. చురుకుగా ఉద్రేకంగా మెలగే రాజసిక వ్యక్తులు పరువూ, ప్రతిష్ఠా, ఆస్తీ, అధికారం కోసం ప్రాకులాడతారు. వాటిని సంపాదించుకొనేందుకు తోడ్పడే వారే వారి ప్రేమకు పాత్రులు.
శౌచం, సమత, సహృదయత కల వాళ్లు సాత్వికులు. అందరూ భగవత్స్వరూపులని భావించి సేవిస్తారు. ప్రేమిస్తారు.
ఏకం సత్
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’. ఒక జ్యోతిమీద కుండను బోర్లించు. ఆ కుండకు పది చిల్లులుంటే ఆ పది చిల్లులగుండా పది జ్యోతులున్నట్లుగా కనిపిస్తుంటాయి. దానిపైన దట్టమయిన బట్టను కప్పితే, జ్యోతులే కనిపించవు. ఆ వస్తమ్రును తీసివేస్తే పది జ్యోతులు కనిపిస్తాయి. ఆపైన బోర్లించిన కుండను పగలగొడితే ఒక జ్యోతే కనిపిస్తుంది.
అదే విధముగ ‘ఆత్మ’అనే ఏకజ్యోతి పైన దశేంద్రియములనే రంథ్రమును కలిగినటువంటి ఈ దేహమనే కుండను బోర్లించాము. దీనిపైన అభిమాన మమకారమనే దట్టమైన వస్తమ్రును కప్పినాము. కనుకనే ఈ ఆత్మజ్యోతిని చూడలేకపోతున్నాం. మొట్టమొదట అభిమాన మమకారమనే బట్టను తీసివేయి. పది జ్యోతులయినా కనిపిస్తాయి. ఈ దేహభ్రాంతిని కూడా వదిలిపెట్టు. ఒకే జ్యోతి కనిపిస్తుంది. అదే ఏకాత్మభావం. ఉన్నది ఒక్కటే.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.