సబ్ ఫీచర్

తాజా పండ్లతో జబ్బులు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ అదుపు చేసే శక్తి పుచ్చపండులో వుంది. బొప్పాయి పండు, అరటిపండు జీర్ణశక్తికి ఉపయోగపడతాయి. పండ్లలో ముఖ్యంగా విటమిన్ ఎ, కెరోటిన్ కేలరీలు, పోషక పదార్థాలు మెండుగా వున్నాయి. పండ్లు మన ఆరోగ్యానికి ప్రతీకలు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలకు పండ్లు తినే అలవాటు నేర్పించడం చాలా మంచిది. పండ్ల రసాలు అన్ని కాలాలోను ఉపయోగించవచ్చును. నారింజ పళ్ళరసం సేవించడంవలన వృద్ధులకు సైతం ఉత్సాహాన్ని
కలిగిస్తుంది.
మనం నిత్యం తినే ఆహారంలో తాజాగా లభించే పండ్లు తీసుకోవడం వలన శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆయా కాలాలలో లభించే తాజాగా నిగనిగలాడే పండ్లను తినడంవలన శరీర వృద్ధికి, ఆరోగ్యానికి బలం చేకూరడమే కాకుండా తాజాపండ్లలో వుండే పోషకాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ పండు తినడంవలన వృద్ధాప్యం ఛాయలు శరీరానికి దరిచేరవు. పైగా ఆయుష్షునిచ్చే గుణాలు శరీర పోషణకు, కాంతికి దోహదపడగలవని శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడైంది. అరటిపండు, ఆపిల్, కర్జూరఫలం, కమలాఫలం, నారింజ, నిమ్మ, ద్రాక్ష, అనాసపండు, పుచ్చకాయ, దోస, సీతాఫలం, బొప్పాయి, మామిడిపండు, జామ, దానిమ్మపండు, స్ట్రాబెర్రీ, నేరేడుపండు- ఇలా ఎన్నో తాజాపండ్లు ఆయా కాలాలలో మనకు లభించే అవకాశం వుంది. ఒక ఋతువులో ఒక పండు వర్షాకాలంలో సీతాఫలం, వేసవిలో మామిడిఫలం- ఇలా ఓక్కో కాలంలో ఒక్కోపండు మనకు లభ్యమవుతాయి.
పకృతి ప్రసాదించిన వరం ఫలాలు
అరటిపండ్లు అన్ని కాలాలలోనూ లభిస్తుంది. తాజా ఫలాలలో విటమిన్లు, పోషక విలువలు మెండుగా వుంటాయి. ప్రతిరోజూ పండు తినడం అలవాటు చేసుకోవాలి. వృద్ధులు దగ్గరనుండి పిల్లలవరకూ పండ్లు ఆహారంగా తీసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే తాజాపండ్లు, నిత్య జీవితంలో మనిషికి ఎంతో అవసరం. ఆయుష్షు పెంచే గుణం పండ్లలో అధికంగా వుంది. ఆరోగ్యానికి, శరీర కాంతికి, అనారోగ్యం దూరం చేయడానికి పండ్లు దోహదపడతాయి. మార్కెట్లో లభించే తాజాపండ్లు మంచినీటితో కడిగిన తరువాత తినాలి. ఎందుకంటే పండ్లపై క్రిమి సంహారక మందులు చల్లడంవలన విష రసాయనాలు వుంటాయి. తాజాపండ్లను బాగా శుభ్రంగా కడిగి తీసుకోవటం ఉత్తమం.
తాజాపండ్లతో ఐస్‌క్రీములు, ఫ్రూట్ సలాడ్, జ్యూస్ తయారుచేస్తారు. ఇవి కూడా మంచిదే. స్ర్తిల అందానికి, ఆరోగ్యానికి పుచ్చకాయఫలం, యాపిల్, స్ట్రాబెర్రీ, కమలాఫలం, నారింజ, బత్తాయి, దానిమ్మఫలాలు దోహదపడతాయి. నిత్యం ఇతర ఆహార పదార్థాలతోబాటు మనం తాజాపండ్లను తినే అలవాటు పెంచుకోవాలి. అనారోగ్యం దరిజేరదు. భోజనం చేసిన తరువాత కొంత సమయానికి పండ్లను సేవించడం అలవాటు చేసుకోవాలి. ప్రకృతినుండి లభించిన ఫలం మానవాళికి ప్రయోజనకారి కాగలదు. అందుకు మార్కెట్లో కొనేముందు తాజాపండ్లనే ఎంచుకోవాలి.

- ఎల్.ప్రపుల్లచంద్ర