సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయపెడుతూ, భయపడుతూ...
మనిషి చంద్ర లోకానికి వెళుతున్నాడు. సముద్రాల లోతును తరచి చూస్తున్నాడు కాని రుూ భూమిపై జీవించటం ఎలాగో మాత్రం తెలుసుకోవటల్లేదు. తన తోటివారితో శాంతి, సౌఖ్యాలతో మెలగటం ఎలాగో నేర్చుకోవటల్లేదు. తనకన్న ముందెవరు చంద్ర లోకంలో కాలుబెడతారోనని అతడికి తగని ఆదుర్దా. సముద్రాలలోను అధిగమించి ఎవరినో భయపెట్టాలని చూస్తాడు. ఒకప్రక్క తనే భయపడుతూ వుంటాడు. ఒకరిని భయపెట్టకుండా, తాను భయపడకుండా బ్రతకటం ఎలాగో గీత చెబుతున్నది.
పెద్ద రోగం
ఈనాడు అన్ని రంగములందూ ఈ అసూయ అనే పెద్ద వ్యాధి ప్రవేశించింది. ఒక డాక్టరును చూస్తే డాక్టరుకు అసూయ: ఒక ధనవంతుని చూస్తే, ఇంకొక ధనవంతునికి అసూయ: ఒక అందమైన వానిని చూస్తే ఇంకొక అందమైన వానికి అసూయ: ఇదే మానవునికి వచ్చిన పెద్ద రోగము. ఈ రోగమును మొదట నివారణగావించుకోవాలి.
ఉన్మత్తత
ఈనాటి ప్రపంచములో ప్రజలు రెండు విధములైన ఉన్మత్తతలతో కాలమును గడుపుతున్నారు. ఒకటి ధనోన్మత్తము, రెండవది అధికార ఉన్మత్తము. ఇవి రెండూ వేరువేరుగా మనకు కన్పించుచున్నవి గాని రెండూ వేరుకాదు. రెండూ ఒక్కటే. విత్తనమునకు రెండు బద్దలున్నట్లే ధనోన్మాదము, అధికారోన్మాదము రెండు బద్దలుగా ఉంటున్నవి. ధనముతో అధికారాన్ని కొంటున్నాడు. అధికారముచే ధనమును అర్జిస్తున్నాడు. కనుక ఈ రెండూ ఒక విత్తనముయొక్క రెండు బద్దలే. ఈనాటి మానవుని జీవితమంతకూడనూ ఈ రెంటింటి పైననే ఆధారపడి వుంది. ధనమో లేక అధికారమో ఈ రెండింటిలో ఏదోఒకటి వుండినప్పుడే మానవుని యొక్క అహంకారము అధికంగా పెరిగిపోతుంది. రెండూ చేరినటువంటి వారి గతి ఇక చెప్పనక్కరలేదు.
గర్వాడంబరాలు
పాములు బుసకొడతాయి. పందులు ఘుర్ఘుర ధ్వనులు (గుర్‌గుర్ లాడటం) చేస్తాయి. ఎడ్లు రంకె వేస్తాయి. ఎందుకు? అహంకారం! మిగిలిన వాటిని భయపెట్టి దూరంగా తరిమేయటానికి అవలాచేస్తాయి. అహంకారానికున్న అంశలలో గర్వం ఎంతో ప్రమాదకరమైనది. పండితుల గర్వాడంబరాలు ఎంత గాఢమైనవంటే. వాటిని తొలగించుకోవడం అసాధ్యం.
సేతువును నిర్మించేటప్పుడు ఒక పెద్దకొండ రాతిని ఆంజనేయుడు విసిరి సముద్రంలో వేశాడు. అది తేలుతూ వుంది. రాముడో చిన్న గుండ్రాయి చేశాడు. అది మునిగింది. హనుమంతుడది చూసి సగర్వంగా నవ్వాడు. మరుక్షణమే అంతదాకా తేలుతూవున్న కొండరాయి (ఆంజనేయుడు విసరినది) మునిగింది. మునిగిపోయిన గుండ్రాయి (రాముడు వేసినది) తేలింది హనుమంతుని అహంకారం నీటి బుడగలా పేలిపోయింది!
అందుకే ముందు తానువేసిన గుండ్రాయి మునగాలని రాముడు సంకల్పించాడు!
భీముడికి తాను బలవంతుడిననే గర్వం జాస్తి. తీరాచూస్తే, ఒకనాడొక ముసలి కోతి తోకను ఎత్తి పక్కకు పెట్టమంటే పెట్టలేకపోయాడు. నిజానికి ఆ కోతి మరెవ్వరో కాదు, ఆంజనేయుడే! ఆ దెబ్బతో భీముని గర్వం నశించింది.
అర్జునుడికి కూడా తానో గొప్ప వీరుడినన్న గర్వం వుండేది. భారతయుద్ధం అయిపోయిన తరువాత కృష్ణార్జునులు రథంపై తమ శిబిరానికి తిరిగి వచ్చారు. తాను రథి, కృష్ణుడు సారథి అనే భావం అర్జునుడికి వుండేది. సారథి ముందు రథం దిగటం మర్యాద తర్వాతే దర్జాగా రథికుడు దిగుతాడు. అయితే కృష్ణుడు అర్జునుడినేముందు దిగమన్నాడు. విజయగర్వంతో వున్న అర్జునుడికి తాను ముందు దిగటం నామోషీ అనిపించింది. అయితే కృష్ణుడు ముందు దిగటానికి ససేమిరా వొప్పుకోలేదు. కాసేపు తర్కించిన తరువాత ఇక వాదించి లాభంలేదని అర్జునుడు తానే ముందు రథం దిగాడు. ఆ వెనుకనే కృష్ణుడు దిగాడు.
కృష్ణుడు రథం దిగాడో లేదో మరుక్షణం ఆ రథం ఉన్నట్లుండి భస్మీపటలమైపోయింది!
యుద్ధసమయంలో అనేక ఆగ్నేయ అస్త్రాలు ఆ రథానికి తగిలాయి. కృష్ణుడు రథంపై వున్నంతకాలం ఆ అస్త్రాలు ఏంచేయలేకపోయాయి. ఆయన దిగిపోగానే ఆ అస్త్రాల శక్తికి రథం యిట్టే దగ్ధమైపోయింది.
అహంకారంవల్ల తానెంత ప్రమాదంలోపడ్డాడో, కృష్ణుడు తనె్నలా రక్షించాడో అప్పటికిగాని అర్జునుడికి తెలిసిరాలేదు. తన గర్వం నీటి బుడగలాగా పేలిపోగానే అర్జునుడు తెలివితెచ్చుకొని కృష్ణునిముందు సాగిలపడ్డాడు. కృష్ణుడేపనిచేసినా అందులో తప్పక ఏదో అర్థం వుంటుందని అతడు గ్రహించాడు.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.