సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధూమపానం
కొందరు సిగరెట్లు, బీడీలు కాలుస్తుంటారు. ఈ సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరిన జబ్బులు వస్తున్నాయి. ఆస్త్మా, ఇస్నోఫీలియా, గుండె జబ్బు ఇవన్నీ ఒక్కతూరి సిగరెట్ పీల్చి తన చంటిబిడ్డను ముద్దుపెట్టుకుంటే, ఆ బిడ్డకు లంగ్ కాన్సరు రావచ్చు. ఒకసారి సిగరెట్టు పీల్చి తెల్లని బట్టమీద ‘ఉఫ్’అని వూదండి. ఆ తెల్లని బట్టపైన మచ్చ ఏర్పడుతుంది. ఈ పొగ దేహం లోనికిపోయి రక్తనాళాలను ఎంతవరకు చెడగొడుతుంది? ఆరోగ్యానే్న ఎలా పూర్తి నిర్మూలన చేస్తుంది? జీవితమునే ఎలా కొంతవరకు నశింపచేస్తుంది? అంతా తెలుసుకోవలసి వుంది.
కనుక నిజమైన దైవభక్తులు, మాంసభక్షణ, మద్యపానము, ధూమపానములను త్యజించాలి. వీటిని ఏ ప్రభుత్వమూ ఆపలేదు. ఎవరికి వారే మారాలి. ఇది మానసిక పరివర్తన వలన కలిగేదే కాని ఒరులు బోధిస్తే వచ్చేది కాదు. ఎవరికివారు ఈ సత్యాన్ని గుర్తించాలి.
మానవత్వం మరుగవుతోందా?
మానవజాతి పవిత్రమైనది. ఉత్తమమైనది. చాలా విలువైనటువంటిది. అట్టి విలువైన మానవత్వాన్ని ఈనాడు మనం విస్మరించాం. మానవతా లక్షణములను మరచిపోయినాము. కనుకనే దేశంలో ఎన్నో అల్లకల్లోలములకు అవకాశం ఏర్పడింది. దేశంలో దరిద్రం తాండవించడానికి గాని, భయభ్రాంతులకు గురికావటానికి గాని, ఆధ్యాత్మిక రహస్యాలను గుర్తించుకోలేని మూఢులు అధికంకావడానికి గాని, నైతిక ధార్మికత్వాన్ని కోల్పోవటానికిగాని కారణం ఏమిటి?
మానవుడు, మానవునిగా, మానవులలో సంచరించలేక పోవడమే దీనికి మూల కారణం. మానవుల మధ్య ఈ మానవుడు మృగంగా ప్రవర్తిస్తున్నాడు. రాక్షసుడుగా జీవిస్తున్నాడు. మానవునిలో ప్రవేశించిన అహంకారం. అసూయలే దీనికి కారణం. దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యుడు దట్టమైన మేఘములచేత కప్పబడినప్పుడు ఏవిధంగా కనిపించడో, స్వప్రకాశమైన ఆత్మతత్వము అహంకారమనే మేఘముచేత కప్పబడటంవలన మానవత్వమునే మరిపింపజేస్తున్నది.
క్రూరమృగాలు
లేడి, ఏనుగు, ఆవు, గుర్రం-యివన్నీ సాత్వికాహారమే తింటాయి. అందుకే మనిషికి అవంటే యిష్టం. ఆరాధన కూడా.
పులులూ, ఎలుగుబంట్లూ, సైనాలూ, యితర అడవి జంతువులూ అంటే మనిషికి భయం. వాటిని అడవుల్లోకి తరిమేస్తారు. ఆ అడవి జంతువులలోని క్రౌర్యం, రౌద్రం, భయంకరత్వం చూసి మనిషి భయపడతాడు. చిత్రమేమిటంటే ఆ అడవి జంతువుల క్రౌర్యం మొదలయిన గుణాలన్నీ మనిషిలోనే కొల్లలుగావున్నాయి.
తానే ఈ సృష్టికంతకూ మకుటాయమానం అంటాడు మానవుడు. తనలో దివ్యాంశ వుందనుకుంటాడు. కాని ఆ దివ్యాంశను పైకి రానిస్తేనా? దానిని అణగదొక్కి, క్రూరమృగాల లక్షణాలను పుణికిపుచ్చుకోడంలోనే అతనికి ఆనందమా?
బలి పీఠం
నీ మనసే బలిపీఠం: నీలోని దుష్టపు ఆలోచనలను, అలవాట్లను బలి యివ్వవలసిన జంతువుగా భావించు. భగవంతునికి బలిగా సమర్పించు.
మనిషి జన్మఎత్తినా పాశవికప్రవృత్తి అణిగిపోదు. పూర్వజన్మ పరంపరలో ఎన్నిసార్లు జంతుజన్మలు ఎత్తి ఉన్నాడో ఏమో! ఆ జంతు లక్షణాలన్నీ మనిషి పుణికిపుచ్చుకొని వున్నాడు. గాయం నయమయిన తర్వాత మచ్చ మిగిలిపోయినట్లు, జన్మలు అంతమయినా, ఆ వాసనలు అలాగే వెన్నాడుతుంటాయి.
చిరకీర్తి
ఈరోజు ప్రతి దేశంలోనూ జనం అధికారంకోసం వెంపర్లాడుతున్నారు. సిగ్గూ, లజ్జాలేకుండా ఆత్మస్తుతీ, పరనిందా చేస్తున్నారు. ఇతరులంటే ద్వేషం, అసూయ పెంచుకుంటున్నారు. అహంకారంతో, దర్పంతో విర్రవీగుతున్నారు. సమాజాన్ని భీతావహంలో పడవేస్తున్నారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. అలాకాక, ఉన్నతాదర్శాలకోసం ఆ నాయకులు కృషిచేసి వుంటే చిరకీర్తి సంపాదించుకొని వుండేవారు కదా!
గాడ్ కా! డాగ్ కాదు!
తెలుగులో ఒక సామెత ఉన్నది. ‘దుష్టుడు తప్పులు వెతుకుతాడు. కుక్క చెప్పులు వెతుకుతుంది’అని. కుక్క ఎల్లప్పుడూ చెప్పులనే వెతుకుతుంది. దుష్టుడు ఎల్లప్పుడూ పరుల తప్పులనే వెతుకుంటాడు. కనుక దుష్టునికి, కుక్కకు ఎట్టి వ్యత్యాసము లేదు. అలాంటివారు కుక్కలతో సమానం. ‘మనం డాగ్ కాకూడదు. గాడ్ కావాలి’.
పామే నయం
దుష్టుని కంటెను విషసర్పమే చాలా ఉత్తమమైనదని భాగవతంలో చెప్పబడినది. విషసర్పం ఏదోఒక పర్యాయం మాత్రమే కరుస్తుంది. కాని దుష్టుడుమాత్రం సమయ సందర్భములను విచారించక రాత్రింబవళ్లు కరుస్తూనే ఉంటాడు. ఇతరులను బాధించడం, నొప్పించడం, హింసించడం, ఏడ్పించడం ఇది దుష్టులకు ఒక విధమైన ఆనందం. ఇతరులను నిందించక, విమర్శించక, బాధించకపోతే వారికి నిద్రకూడా పట్టదు. ఎట్టివారితో చేరితే అట్టివిధంగా మారుతుంది మన మనస్సు. అందుకే సత్సాంగత్యం అలవరచుకో.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.