సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ, ప్రశాంతులకు ప్రతీక
అనంతుని అనేక పేర్లలో ఎల్లవేళలా ఏదోవొక పేరునే మీరు స్మరించండి! ధ్యానించండి! ఆయన అవతారాలలో ఏదో ఒక మూర్తిని అర్చించండి! మీరు ప్రేమను విస్తరించండి! ఈర్ష్యాద్వేషాలు తొలగిపోతాయి. మీలో మీరాయనను దర్శించినట్లే. అందరిలోనూ మీరు అర్పించే అవతారమూర్తినే దర్శించగలుగుతారు. ప్రేమ, శాంతి, ఆనందాలకు ప్రతీకగా రూపొందుతారు.
ప్రేమయే నావ
సంసార సాగరం ఎప్పుడూ సంక్షోభంతో నిండి వుంటుంది. సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ- ఇవే ఆటూపోట్లూ! కామక్రోధాలూ, రాగ ద్వేషాలూ- యివే సుడిగుండాలు! ఈ సముద్రాన్ని దాటేందుకు భద్రమైన నావ వొక్కటే- ప్రేమ!
నారాయణుని పట్లనే కాదు, నరుని పట్ల కూడా ప్రేమ చూపాలి!
ఎన్నో జన్మల పుణ్యఫలంవల్ల మనిషిగా జన్మించావు. ఎందుకు? సత్యాన్ని అనే్వషించటానికి, దర్శించటానికీ. అందుకే ఈ మానవ జన్మ అనే మహద్భాగ్యం నీకు లభించింది. చౌకబారు వేషాలతో, అలగా చేష్టలతో ఈ అమూల్య అవకాశాన్ని జారవిడుకోవద్దు. నీవెందుకు పుట్టావో అది మరవకు. సత్యానే్వషణ అన్న ఉత్తమ ఆదర్శం నీముందుండాలి. లేకుంటే, నీ బ్రతుక్కు అర్థమే లేదు. సంసార సాగరంలోపడి కొట్టుకులాడే జన్మ కేవలం వృథా!
తమసోమా జ్యోతిర్గమయ
ప్రేమ అనేక విధాలుగా వుంటున్నది. పిల్లల పట్ల ప్రేమ సంపదల పట్ల ప్రేమ. భార్య పట్ల ప్రేమ. తల్లిదండ్రుల పట్ల ప్రేమ. స్నేహితుల పట్ల ప్రేమ-ఇలా ఎన్నోరకాలుగా వుంటున్నది. ఈ ప్రేమలన్నీ విశ్వప్రేమలో భాగమేకాని ఈ ప్రేమలన్నిటిలోకి స్వార్థం లేని ప్రేమ ఉన్నతోన్నతమైనది. ప్రతిఫలం కోరని ప్రేమ అది. నిర్మలమైనదీ, నిష్కళంకమైనదీ ఆ ప్రేమ. ఆ ప్రేమ పుస్తక పాండిత్యంవల్ల వస్తుందా? రాదు. దానికి ఏ గైడులూ, మేడ్ ఈజీలూ లేవు. చీకటిని భరించలేక కాంతికోసం పడే తపనలోంచి ఈ ప్రేమ జన్మిస్తుంది. తపన వొరపిడికే తేజస్సు ఉద్భవిస్తుంది. ఆ అద్భుత ప్రకాశమే ప్రేమ. అదే క్రమంగా విస్తరించి నిన్ను దైవంగా మారుస్తుంది.
తల్లీబిడ్డల ప్రేమ మధ్యలో ప్రవేశించినటువంటిది. పుట్టక పూర్వం తల్లి ఏ బిడ్డను ప్రేమించింది? ఏ బిడ్డ తల్లిని ప్రేమించింది? పుట్టిన పిదపనే తల్లి బిడ్డను ప్రేమించడం, బిడ్డ తల్లిని ప్రేమించడం. కనుక ఇది మధ్యలో ప్రవేశించినటువంటి సంబంధమేకాని ప్రేమ కాదు. పెండ్లికి పూర్వం ఎవరు ఎవరికి భర్త? ఎవరు ఎవరికి భార్య? వివాహము జరిగిన తరువాతనే ఈ ప్రేమ ప్రవేశిస్తుంది. ఈ ప్రేమకు ఆద్యంతములుంటున్నాయి. కనుక ఇది అసలయిన ప్రేమ అనిపించుకోదు. ఏ ప్రేమ ఆద్యంతము లేక నిత్యసత్యమై నిరంతరమూ ఆనందప్రవాహంలో మానవుని తేల్చి ముంచునో అదియే నిజమైనటువంటి ప్రేమ.
జననీ జన్మ భూమిశ్చ...
మొట్టమొదట మానవుని మనస్సునుండి ఆవిర్భవించినటువంటిది ప్రేమ. ఆ ప్రేమ పుట్టిన తరువాతనే అన్నీ పుడుతున్నాయి. కనుకనే పుట్టిన తక్షణమే తల్లిపైన ప్రేమ వస్తుంది. ప్రతివాడు మొట్టమొదట తల్లి, తండ్రిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఏవిధంగా వ్యక్తి తన జీవితంలో పుట్టిన వెంటనే తల్లిదండ్రులను గుర్తించటానికి ప్రయత్నించుతాడో అదే విధముగనే ప్రతి వ్యక్తి కూడనూ మనం పుట్టిన దేశమునూ, సంస్కృతినీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మన దేశము, మన సంస్కృతియే మన తల్లిదండ్రులు. దేశమే తల్లి, అందుకే మాతృభూమి అంటున్నాం. మన సంస్కృతి తండ్రి. దీనిని పురస్కరించుకొనియే రాముడు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’, దీనికంటే స్వర్గము మరియొకటి లేదన్నాడు. తల్లిని ప్రేమించు. తల్లియొక్క సంస్కృతిని ప్రేమించు- అదియే ప్రతి మానవుని ప్రధాన కర్తవ్యము.
భాషా మాధురి
భారత్ నీ మాతృభూమి అయినందుకు ఆనందించు. నీ దేశాన్ని నీవు ప్రేమించు. ఆ ప్రేమ విశ్వమానవ ప్రేమకు పునాది కావాలి.
ప్రేమకు ఎల్లలు లేవు. అది అనంతంగా విస్తరించగలదు.
నీ మాతృభాషను ప్రేమించు. అప్పుడే అన్ని భాషలూ మధురమైనవేనన్న సత్యాన్ని గ్రహిస్తావు. నిజానికి ఒక భాష తీయదనం దానిని మాట్లాడే వారి మానసిక సౌమ్యతనుబట్టీ. సరళత్వాన్నిబట్టీ వుంటుంది.
ప్రేమ బీజం
వ్యక్తి క్షేమంకోసంకన్నా సమాజ కళ్యాణంకోసం పూజచేయటం నాకిష్టం. ఎవరికివారు తమ సుఖశాంతులకోసం పూజలుచేయటం మంచిదే. అంతకన్నా ముఖ్యం ప్రతివ్యక్తి పట్లా ప్రేమను పెంపొందించుకొనటం. అదే నా ఉద్యమం. అదే నా తీర్మానం. అదే నా సంకల్పం. అదే నా దీక్ష. ప్రతి హృదంయంలోనూ ప్రేమ బీజం నాటాలి. అదేనా ఆకాంక్ష!
సన్యాసి విధి
సన్యాసులు తలను నున్నగా గొరిగించుకుంటారు. తమ పూర్వ స్నేహితులు తమను గుర్తుపట్టకుండా వుండటంకోసం బోడిగుండు చేసుకునే సంప్రదాయం ఏర్పడింది. కాని ప్రస్తుతం స్వాములవారలు గుర్తింపుకోసం, పొగడ్తల కోసం పాకులాడుతున్నారు. నిజానికి, అహంకారాన్ని పెంచే ఆ విషయాలను వారు తిరస్కరించాలి. ఒక సామెత వుంది. ‘సన్యాసి కుక్కలాగా తినాలి. నక్క లాగా పడుకోవాలి’ అని. అంటే, ఏది దొరికితే దానినే తినాలి. ఎక్కడ వీలయితే అక్కడ పడుకోవాలి. వాళ్లు రేపటికి ఏమీ దాచుకోకూడదు. ఇల్లు కట్టుకోరాదు. విషయ వాంఛలనూ, అహంకారాన్నీ జయించాలి.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.