సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమ పాశం
యముడు జీవులను తన లోకానికి రుూడ్చుకొని పోతాడు, ఎలా? వారిని యమ పాశాలతో బంధించి. మరి యమలోకంలో తాళ్లు తయారుచేసే ఫ్యాక్టరీ వుందా? ఇన్ని తాళ్లు యముడికెక్కడివి? ఆ తాళ్లను పేని యిచ్చేది ఎవరో కాదు, మీరే! ఎవరి తాడు వారే పేనుకుంటారు. ఎవరి మెడకు వారే వేసుకుంటారు. యముడు చేసే పనల్లా ఆ తాడు పట్టుకొని లాక్కొని పోవటం మాత్రమే. మూడు నారపీచు పాయలతో మీరు ఆ తాడు పేనుతారు. అవి: అహంకారం, విషయవాసన, కామం.
అణోరణీయాన్...
భగవంతుడు అణువుకన్నా చిన్న. అతి విస్తారమైన వాటికన్నా విస్తారం. అయినా ఆయనకు అహంకారం లేదు! ఆయన ప్రశస్తిలో అణుమాత్రం లేని మనిషికెందుకీ గర్వం? తన గొప్పతనాన్ని చాటుకుంటూ ఎందుకిలా రొమ్మువిరుచుకొని తిరగటం? ఎంత అజ్ఞానం? అహంభావి సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. సరయిన పద్ధతిలో తన శక్తియుక్తులను పెంపొందించుకొనే అవకాశాలను కోల్పోతాడు.
భారతంలో సర్వమూ తనేననే అహంకారముతో విర్రవీగిన దుర్యోధనుడు ఏమై పోయినాడు? ఐదు గ్రామములైనా ఇస్తే చాలునని ప్రాధేయపడిన పాండవులను కాదని, సూది మొన మోపే స్థలం కూడా ఇవ్వటానికి వీలుకాదని నిరాకరించాడు దుర్యోధనుడు. ఇంతటి లోభత్వమును ప్రకటించిన దుర్యోధనుడు కట్టకడపటికి ఏమైనాడు?
అహంకారం ఒక ముళ్లపొద. దానిని మనసులో నాటుకున్నావా పెనాల్టీ తగలకమానదు. అనుంగు మిత్రులను శత్రువులుగా మార్చేది అహంకారమే. మంచి పనులను చెడగొట్టేదీ అహంకారమే. మంచి వాళ్లని అది కలిసి పని చేయనీయదు.
అహంకారాన్ని దుఃఖం నీడలా వెంటాడుతుంది. అహంకారం లేకపోతే, శాంతి, సామరస్యం, సహకారం, ప్రేమ, సంతోషం అంతటా తాండవిస్తాయి. తన నుత్తేజ పరిచే దివ్యాత్మే అందరినీ ఉత్తేజపరుస్తోందని మనిషి గ్రహించగలడు. అప్పుడతని ప్రతి మాటలోనూ, ఆలోచించే ప్రతి యోచనలోనూ, చేసే ప్రతి పనిలోనూ ప్రేమ తొణికిసలాడుతుంటుంది.
అహంకారాన్ని నశింపచేసి కోవటం ఎలా? ‘అంతా ఆయనదే, నాదేం లేదు’ అని సదా నీకు నీవు చెప్పుకుంటుండటమే దానికి మార్గం. ఆయన నామాన్ని నిరంతరం జపించు; ఏ సుందర దృశ్యాన్ని చూసినా ఆయన మహిమను మననం చేయి. ఎవరిని చూసినా ఆయనే ఆ రూపంలో సంచరిస్తున్నాడని గ్రహించు. ఎవరిని గురించీ చెడుగా మాట్లాడకు. వారిలోని మంచినే గ్రహించు. ఇతరులకు సాయం చేసేందుకు ఏ అవకాశం లభిస్తుందా అని ఎదురుచూడు. ఆధ్యాత్మిక చింతన చేసేవారిని ప్రోత్సహించు.
మంచి మందు
చెట్టు మనకు గురువు. అది బోధించే నీతి ఏమిటి? పండ్లు బాగా కాసినప్పుడు అది గర్వంతో నిక్కి చూడదు. వినయంతో తగ్గి వుంటుంది. కిందికి వంగుతుంది. ఆకలితో వున్నవారు కోసుకునేందుకు వీలుగా, కొమ్మలు వంగి పండ్లను అందిస్తాయి.
ఇక పక్షులను చూడండి! అవేం చేస్తున్నాయి? గేదెల పైనా దున్నపోతుల పైనా పక్షులు వాలి వాటి దురదను పోగొడతాయి. అందుకవి ఏ ప్రతిఫలమూ కోరవు.
మనిషికి చెట్లకన్నా, పిట్టలకన్న ఎన్నో శక్తులను ప్రకృతి అధికంగా యిచ్చింది. కాని ఏం చేశాడు? నిజానికి తన తెలివితేటలతో మనిషి ఎంత గొప్పగా, ఎంత చక్కగా సేవచేయొచ్చు?
సద్యో స్పందన
కౌరవులు నూర్గురూ ఒక్కొక్కరు ఏ విధంగా మరణించిందీ భారతం వర్ణించింది. అందరిలోకీ పెద్దవాడయిన దుర్యోధనుడు భీమునితో గదా యుద్ధంచేసి తొడలు విరిగి కొలిపోతాడు. అప్పుడు భీముడు అతడిని అవమానించటానికి తలపై కాలితో తంతాడు. దుర్యోధనుడు మరణవేదన పడుతూ కూడా వెంటనే భీమునికి బుద్ధిచెబుతాడు: ‘నా తలపై తన్ని నీవేదో ఘనకార్యం చేశానని కులక నక్కరలేదు. ఇంకాసేపటికి కాకులూ, గద్దలూ ఆ పనేచేస్తాయి. ఆ పనికి నీ అంతటి వీరుక్కరలేదు. పిరికిపంద! నేను దెబ్బకు దెబ్బతీసే స్థితిలో వున్నప్పుడు, ఏం చేయలేకపోయావ్!’ రారాజులోని రాజసం, రోషం, పరాక్రమం అంత దారుణ స్థితిలో కూడ క్షణం తడుముకోకుండా భీమునికి తగిన జవాబు చెప్పేలా చేశాయి.
చుట్టూ జరిగే సంఘటనలకు అలా సద్యోస్పందన చేసే శక్తిని పెంపొందించుకోవటం అవసరం. ఎటొచ్చీ ఆ స్పందన సాత్వికంగా వుండాలి.
శాస్త్ర ప్రయోజనం
నేను శాస్త్ర వాదినీ కాను. బుద్ధివాదినీ కాను. పండితులతో గాని, హేతువాదులతో గాని నాకే తగాదా లేదు. రెంటిలోనూ మంచివుంది. రెంటికీ వాటి పరిమితులు వాటికున్నాయి. ప్రేమ నీలో నింపుకోగలిగితే నీకు శాస్త్రాల అవసరం రాదు; ఎందుకంటే, శాస్త్రాల ప్రయోజనం సరిగ్గా అదే! సర్వజన సామాన్య ప్రేమను పాదుకొల్పటమే వాటి లక్ష్యం. దానికి అడ్డుగా నిలచే అహంకారాన్ని తొలగించుకోమని చెప్పటమే వాటి సారాంశం.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.