సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ ప్రవర్తన
ప్రేమ, సహనం వున్నప్పుడు జీవితం ఒక దివ్యానుభూతిగా మారుతుంది. ఇతరులతో సర్దుకొని పోగలగటం, పరస్పర సహకారం-జీవితాన్ని హాయిగా గడిపేందుకు దోహదం చేస్తాయి. శతాబ్దాలుగా జనం ఎలా నడుచుకోవాలో నిర్దేశించే నీతి నియమాలు ఏర్పరచబడి వున్నాయి. ఆయా కాలాలలోని పరిస్థితులనుబట్టి వాటిల్లో కావలసిన మార్పులు చేసికొంటూ వస్తున్నారు. వర్తమాన జీవితంలో శాస్తస్రాంకేతిక రంగాలతో సహా ఆయా రంగాలను అభివృద్ధిచేస్తున్నారు. కాని మానవ ప్రవర్తనను మెరుగుపరచుకోటం లేదు. దైవిక లక్షణాలను సాధించు. దివ్య చైతన్యాన్ని సంపాదించు. ఆత్మజ్ఞానాన్ని పొందు. ప్రేమను, పరస్పర అవగాహనను పెంపొందించు.
గట్టి పనిముట్టుగా తయారుకా!
ప్రేమ లేని హృదయం ఆలయం లేని గ్రామం లాంటిది. ప్రేమ లేకపోతే మనసులో గర్వం తిష్ఠవేస్తుంది. అన్నిరకాల గర్వాలలోకీ ఎక్కువ విష పూరితం ఆధ్యాత్మిక గర్వమే. ఆ గర్వం ఆవేశించిన సాధకుడిని అది పాతాళంలోకి తోస్తుంది. జాగ్రత్త!
ధర్మ సంస్థాపన అనే నా దివ్యాధర్మాన్ని సాధించటంలో మీరంతా నా సాధనాలేనని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నా చేతిలో సమర్థవంతమైన గట్టి పనిముట్టుగా వుండేందుకే సదా ప్రయత్నం చేయి. ఏ పని ముట్టును ఎప్పుడు ఎలా వినియోగించుకోవాలో, ఆ పని ముట్టును వాడే చేతికి బాగా తెలుసు!
ప్రేమ అంటే...
ప్రేమ అన్న మాటను అనేక సందర్భాలలో వాడుతున్నాము. అందువల్ల కొంత గందరగోళం కలుగుతూ వుంది. కనుక మనం కొత్త మాటలనన్నా కనిపెట్టాలి. లేక ఫలానా సందర్భానికి ఫలానా మాట అని అన్నా ఖాయం చేయాలి.
ఉదాహరణకు, తల్లిదండ్రులకు తమ సంతానం పట్ల వుండే దానిని పుత్రవాత్సల్యం లేక పుత్రికా వాత్సల్యం అనవచ్చు. శృంగార పరమయిన భావనకు మోహం అనవచ్చు. చుట్టాల విషయంలో బంధుప్రీతి అనవచ్చు. ఆస్తిపాస్తుల విషయంలో తృప్తిఅనవచ్చు. కాని, సత్యాన్ని దర్శించాలన్న ఉదాత్త్భావనను మాత్రమే ‘ప్రేమ’అనాలి.
నిర్మల మానసం
ఈ దేహం ఏమిటి? ఎన్నోరకాల సూక్ష్మజీవులకూ, యితర క్రిములకూ ఆకరం. నీటినుండి తప్పించుకొనే వారెవరూ లేరు. కాని దుఃఖాన్ని తొలగించుకొనే మార్గం వుంది. ఇతరుల పట్ల కరుణను పెంచుకో. ప్రేమను పెంపొందించుకో. ప్రేమను పంచు. ప్రేమను పెంచు.
చినుకు- సంద్రం
నీ గమ్యం ఏమిటి? ఆలోచించు. వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటూ బతకటం మాత్రమేనా? సమాజ కళ్యాణంవైపు సాగటమా? సముద్రంలో పడినప్పుడు చినుకు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. అప్పుడు దానిని చినుకు అనం. సముద్రమే అంటాము. దాని నామరూపాలు మారిపోతాయి. దాని రుచి మారిపోతుంది. అది విడిగా వున్నంత సేపు ‘చినుకు’గానే వుండిపోతుంది. ఏం ప్రయోజనం? కాసేపటికి ఆవిరై గాలిలో కలిసిపోతుంది.
వ్యక్తివ్యక్తిగా వున్నంతకాలం చినుకు గతే. వ్యక్తి తానొక అనంత, శాశ్వత సత్యంలో భాగం అని గుర్తిస్తే, చినుకుగా వుండజాలడు. సముద్రంగా మారగలడు. జీవితమంతా లోభ, మోహాలతో యిలా సతమతవౌతూ వుండటం ఎంత చికాకు? హృదయాన్ని విశాలం చేసుకో. మనసును పవిత్రం చేసుకో. ప్రేమతత్వం పెంపొందించుకో. దైవత్వం సంతరించుకో.
ప్రేమ- అనురాగం
ఒక పర్యాయం గోపికలంతా వచ్చి కుండలు పగులగొట్టి వెన్నను, పాలను కృష్ణుడు దొంగిలిస్తున్నాడని యశోదతో మొరపెట్టుకున్నారు. నిత్యమూ ఏదోఒక ఫిర్యాదు కృష్ణునిమీద రావటం చూచి ‘కృష్ణా! నేను పెడితే వెన్న తినవు. పరాయి ఇండ్లలో దొంగిలిస్తున్నావు. చెడ్డపేరు తెచ్చుకుంటున్నావు. మన ఇంటి వెన్న నీకు రుచి లేదా? ఇతరుల ఇండ్లలోని వెనే్న నీకు రుచా?’అని అడుగుతుంది యశోద. దీని అంతరార్థమేమిటి? యశోదమ్మ వాత్సల్య భావంతో వెన్న పెడుతున్నది. కాని గోపికల హృదయాలు దైవభావంతో ఉంటున్నాయి. అది వెన్నకాదు. వాళ్ళ హృదయమనేటటువంటి పవిత్రతను తాను ఆకర్షిస్తున్నాడు. నిర్మల నిశ్చల నిస్వార్థంతో కూడినటువంటి గోపికల హృదయమే వెన్న. స్వార్థము, స్వప్రయోజనములతో కూడినటువంటి అనుబంధమే మిగతాది. ఇది అనురాగము, అది ప్రేమ. ప్రేమకు అనురాగమునకు వుండిన వ్యత్యాసము ఇదే.
మత బాంధవ్యం
అన్ని మతాల్లోనూ సూక్తులూ, సూత్రాలూ దాదాపు ఒకే రకంగా వుంటాయి. మతాల పరస్పర సంబంధాన్ని యిది సూచిస్తుంది.
మొదట వేద మతం ఉద్భవించింది. ప్రాచ్యదేశాల ప్రభావం బాగాకనిపించే క్రైస్తవ మతం మనుమడు కాగా, క్రైస్తవ ప్రవక్తల బోధల ఆధారంగా వచ్చిన ఇస్లాం మునిమనవడు అనుకోవచ్చు!
అన్నిటిలోను ప్రధానంగా కనిపించేది ప్రేమ. మనిషిని మనిషిగాచేసి దివ్యత్వం వైపు నడిపించేది ఆ ప్రేమే!
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.