సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపికా ప్రేమ
ఒకరోజు ఒక గోపిక మందనుండి ఎందుకో తన యింటికి మధ్యలో అనుకోకుండా వచ్చింది. సరిగ్గా అప్పుడే చిన్ని కృష్ణుడు ఆ గోపిక యింట్లో దూరి పెరుగు కుండలో చేయి పెట్టబోతున్నాడు. గోపికను చూస్తూనే కంగారు నటిస్తూ కన్నయ్య బయటికి ఉరికాడు. గోపిక కూడా కన్నయ్యను పట్టుకొనేందుకు పరుగుపెట్టింది. తీరా గడప దాటేసరికి ఆమెకు తన పెరుగుకుండ సంగతి జ్ఞాపకమే లేదు. మండుటెండలో ఉత్త కాళ్లతో పరుగెడుతున్న కన్నయ్య లేత పాదాలు కందిపోతాయన్న బాధతో ఆమె చలించిపోయింది. కృష్ణుడిని తొందరగా పట్టుకొని కాళ్ళు కాలకుండా చంకవేసుకోవాలన్న తొందరే కాని ఆమెకు ఇంకేమీ గుర్తుకు రాలేదు. తన పెరుగుకుండ సంగతి అలావుంచి ఎండలో తన కాళ్లు కాలుతున్న సంగతిని కూడా ఎరక్కుండా ఆమె తొందరగా పరుగెత్తింది. అదీ ప్రేమ తత్వం.
అమలిన ప్రేమ
యశోద ఒకసారి కృష్ణునికోసం వెదుకుతూ వుంది. రాధను పిలిచి ‘కృష్ణుడు మీ యింటికి గాని వచ్చాడా?’ అనడిగింది. రాధ కాసేపు కన్నులుమూసికొని కృష్ణుని ధ్యానంచేస్తూ ‘కృష్ణా!’అని పిలిచేసరికి తక్షణమే కృష్ణుడక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాధ పవిత్రప్రేమ ప్రభావాన్ని చూసి యశోద చకిత అయింది. ఆమె కన్నులవెంట నీరు ధారలు కట్టింది.
‘‘నేను కన్నయ్య తల్లిని, నా అంతగా కృష్ణుని ప్రేమించే వారెవరుంటారు’- అని నాక్కొంచెం గర్వంగా ఉండేది. కంటికి రెప్పలా కన్నయ్యను కాచుకుంటున్నాననుకునే దాన్ని. ఈరోజు నా కళ్లు తెరిపించాడు. నీ ప్రేమ ఎంతటి పవిత్రమైనదో చూపించాడు. నీ చిన్ని కృష్ణుడు అహం అంటని అమలిన ప్రేమ నీది’’-అని యశోద రాధతో చెప్పింది.
అల్లరి కన్నయ్య
నీ హృదయ కుహరాలలో కృష్ణుడు దాగొనియున్నాడు. ఆయనను వెతికి పట్టుకో. దొరక్కుండా తప్పించుకొనిపోతాడు జాగ్రత్త. అయినా ఆ అల్లరి కన్నయ్య ఎటువెళ్ళిందీ వొలికిన పాలపై పడిన ఆయన పాదముద్రలు చెప్పేస్తాయిలే. ఆయన పాదాల గుర్తులను నీవు గుర్తుపట్టటం తెలుసుకో. సౌందర్యం, సచ్ఛీలం, కరుణ, ప్రేమ, కృతజ్ఞత ఎక్కడ వున్నా, అక్కడంతా ఆయన తిరుగాడుతున్నట్లు ఆయన పాదాల గుర్తులు కనిపిస్తాయి. అక్కడాయిక్కడా వెతకటం ఎందుకు? నీ గుండెనిండా ప్రేమ నింపుకో. నీ హృదయంలోనే ఆయన నీకు దొరికిపోతాడు.
తాళంచెవి
పంచ పాండవులు ఆదర్శప్రాయులు. ధర్మరాజు మాట జవదాటకుండా ఆయన సోదరులు ధర్మపథంలో ఆయనను అనుసరించారు. ధర్మమునకు అనుగుణంగా రాముడు రాజీ ఎరగని రీతిలో నడిచాడు. మానవులూ, జంతువులూ, పక్షులూ, రాక్షసులని లేకుండా అందరి పట్లా రాముడు ప్రేమనే ప్రదర్శించాడు. ఏ ప్రలోభానికీ లొంగని స్థిరచిత్తం ఆయనది. అహంకారం, లోభం కలిసి మూసివేసిన తలుపులను తెరిచే తాళంచెవి ప్రేమ ఆయన సొత్తు.
దైవబలం
అన్ని బలములుండి కూడా ఒక్క దైవబలం లేకపోవటం వలన కర్ణుడంతటివాడు చిట్టచివరికి ఏమైనాడు? అన్ని బలములకన్నా దైవబలమే మిన్నయని కర్ణుని విషయంలో కూడా ఋజువైంది. కనుక దైవబలమే నిజమైన బలము. అదే సరియైన బలము. ఆ బలము లేకుండా, ఎన్ని బలములున్నా అన్నీ దుర్బలములే. రావణాసురుడికి ఎన్ని బలములు ఉన్నాయి? కట్టకడపటికి ఏమైనాడు? దైవబలమును పెంచుకోకుండా, భౌతిక బలమును పెంచుకుంటూ వచ్చాడు. అందువలననే కట్టకడపటికి నాశనమైపోయినాడు. కౌరవులు నూర్గురైనా దైవబలం లేకపోవటంవలన నశించిపోయారు. పాండవులకు దైవబలం ఉండటంవలన విజయలక్ష్మిని చేబట్టగలిగారు. అంతేకాదు. ఐకమ్యతమే మహాబలమనే విషయాన్ని విస్మరించరాదు. ఈ ఐకమత్యానికి దైవమొక్కడే మూల కారణం. ఇక్కడ ఈ ప్రశాంతి నిలయంలో ఎన్నో దేశములవారు, ఎన్నో మతాలవారు, భాషలవారు, ఎన్నో భావములవారున్నారు. వారివారి పద్ధతులలో, సంస్కృతులలో, ఆహార వ్యవహారాలలో, అలవాట్లలో ఎన్ని తేడాలున్నా వారంతా అన్యోన్యంగా మెలగటం లేదా? వారిని ఎవరుమార్చారు? వారే మారారు. ఒక్క స్వామిని గురించే వారంతా ఏకమైనారు. అందుకు స్వామిపై వారికున్నటువంటి ప్రేమే కారణం. కనుక దైవభావాన్ని మనం పెంచుకోవాలి. దైవ ప్రేమ లోపల మీ జీవితాలను ముంచి పెట్టండి. ఈ ప్రేమను మరొక దానికి ఉపయోగపెట్టకండి.
పాండిత్యం
ప్రేమను పెంపొందించుకొనటంలో తాననీ, పరులనీ చూడని ప్రేమతత్వాన్ని బోధపరచుకో. అందరం ఆ ప్రేమ మయుని అంగాలమే. ప్రేమ ద్వారానే ఆ ప్రేమ సాగరుని చేరుకోగలవు. దీనికి పాండిత్యం అక్కరలేదు. పాండిత్యం ఒక రకంగా అవరోధం కూడా. తాను పండితుడననే అహంకారం; వివిధ శాస్త్రాలలోని సంగతులపై సంశయాలు; వాదించి తన సిద్ధాంతాన్ని స్థాపించాలన్న అభిలాష -యివన్నీ పాండిత్యం వెంట వుంటాయి.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.