సబ్ ఫీచర్

మతోన్మాదుల విధ్వంసానికి అక్షర సాక్ష్యాలివిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విల్ డ్యురాంట్ (1885-1981) 96 ఏళ్లు జీవించాడు. పదకొండు సంపుటాల ‘ప్రపంచ దేశ నాగరిక చరిత్ర’ను రచించాడు. మొదటి సంపుటం ప్రాచ్య నాగరికత (ఇండియా) చరిత్ర. ఈ సంపుటంలో ఆయన సముద్ర గుప్తుడిని గూర్చి, భారతదేశంలో ముస్లింల దండయాత్రలో దేవాలయాల విధ్వంసపు తబ్శీళ్ళను గూర్చి చాలా వివరాలు కూర్చాడు. సముద్ర గుప్తుడు భారతదేశ చరిత్ర స్వర్ణయుగానికి (క్రీ.పూ.4వ శతాబ్దానికి) చెందినవాడు. ఈ చక్రవర్తిని గూర్చిన ప్రస్తావనలో విల్ డ్యురాంట్- ‘సముద్ర గుప్తుడు పాటలీపుత్రం నుంచి అయోధ్యకు తన రాజధానిని తరలించాడనీ బెంగాల్, నేపాల్, దక్షిణ హిందూ దేశాన్ని జయించి పన్నులు వసూలుచేశాడ’ని రాశాడు. అయోధ్య గూర్చిన ప్రసక్తి వచ్చింది కాబట్టి అయోధ్యానగరం పురాణ పురుషుడు, భారతీయులకు పరమారాధ్యుడు అయిన శ్రీరామచంద్రుడి జన్మస్థలమూ, ఆయన రాజధాని అని కూడా విల్ డ్యురాంట్ రాశాడు. (పేజీ 451- మొదటి సంపుటం).
కాన్యకుబ్జ పట్టణాన్ని (ఉత్తరప్రదేశ్‌లోని నేటి కనౌజ్) ముస్లిం దండయాత్రాపరులు సర్వనాశనం చేసినప్పుడు- అక్కడి పదివేల దేవాలయాలను నేలమట్టం చేసి ధ్వంసం చేశారని విల్ డ్యురాంట్ వక్కాణం. ఆ రాజధాని అతులిత విస్తార సంపద ప్రభావం ఎంతటిదో ఈ ఘాతుకం వల్ల తెలుస్తున్నది అని విల్ డ్యురాంట్ వ్యాఖ్యానించాడు. (We may conjecture the size, splendor, and prosperity from the unbelievable item that when Muslims sacked it (1018 A.D) they destroyed 10,000 temples (page- 453)

ఫూర్వకాలపు చరిత్ర, హిందూ మత విశ్వాస తీర్థక్షేత్రాల స్థానిక చరిత్రలలో ప్రతిచోటా ముస్లింల అమానుష హింస రచన, ధ్వంస నచణ (శ్రీశ్రీ ఉవాచ) క్రూరకృత్యాల ప్రసక్తి కనపడుతూనే ఉంది. అంతదాకా ఎందుకు? 8వ శతాబ్దికి చెందిన ఆప్ఘన్‌స్థానంలోని గాంధార బుద్ధ విగ్రహాన్ని ఈ ఆధునిక కాలంలోనే వాళ్ళు ధ్వంసం చేశారు కదా! తూర్పు గోదావరి జిల్లాలోని ‘ర్యాలి’ అనే పల్లెటూరులో జగన్మోహిని ఆలయం ఉంది. ఎదుటి నుంచి చూసినప్పుడు జగన్నాథుడు, వెనుకవైపు చూ సినప్పుడు జగన్మోహిని శిల్పాలలో పరమసుందరమైన శిల్పకళాఖండం ఈ ఆలయంలో ఉంది. ‘ర్యాలి’ స్థానిక చరిత్రను చిన్న పుస్తకంగా ఆ దేవాలయంలో విక్రయిస్తారు. ఈ చరిత్రలో ముస్లిములు ఈ పరమ సౌందర్య శిల్పకళాఖండాన్ని విరూపం చేసినట్లు రాసి ఉంది. భారతదేశంలో ఏ పురాతన పుణ్యస్థలి అని హిందువులు విశ్వసిస్తున్న చోట్లలో ఈ కిరాతక చర్యల ప్రస్తావన అనివార్యంగా కనపడుతుంది.
ముప్ఫై, నలభై సంవత్సరాల కిందట ఇప్పటి బహుళ పాఠక వ్యాప్తిగల ఒక ఇంగ్లీషు దినపత్రిక సందర్భం ఉన్నా లేకపోయినా వారణాసిలో ఔరంగజేబు, ఇతర ముస్లిం పాదుషాలు ధ్వంసం చేసిన కాశీవిశ్వనాథ దేవాలయాన్ని, ఆక్రమిత మసీదుగా రూపొందించిన దానిని ‘‘జ్ఞానవాపి మసీదు’’ అంటూ ఆహ్లాద ధ్వనిచేస్తూ వర్ణిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఇటువంటిది ఎక్కడైనా జరుగుతుందా? జ్ఞానవాపి మసీదు ఉంటుందా? మధురలో ఇప్పటికీ ఔరంగజేబు క్రౌర్యం చరిత్రలో స్మరణీయం అవుతూనే ఉన్నది. పక్కపక్కనే దేవాలయం, మసీదులు ఆనాటి దుర్మార్గాలకు సాక్ష్యం పలుకుతూనే ఉన్నాయి. వారణాసి, మధురలలో ముస్లిములు హిందువుల అతి పవిత్ర పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేసి ఆక్రమించుకున్న ఆనవాళ్ళు కనపడుతున్నాయి కదా! న్యాయస్థానాలు వాటిగూర్చి ఏమంటాయి? అయోధ్య విషయంలో ‘ఆకాశవాణి’ ఇది రాముడు పుట్టిన చోటే అని సాక్ష్యం పలకాలని విమతస్తుల న్యాయవాద దురంధరులు వాదించటం ఎంతవరకు సబబు? హంపీ విజయనగర క్షేత్రం గూర్చి తిరుమల రామచంద్ర స్వీయచరిత్ర చదవండి తెలుస్తుంది. వెయ్యేళ్ళుగా భారతదేశ చరిత్రలో ముస్లిం దండయాత్రల ఫలితంగా హిందూ దేవాలయ విధ్వంసం అక్షర సాక్ష్యం పలుకుతుండగా బాబరు.. అయోధ్యలో దేవాలయం కూల్చకుండా గొప్ప మసీదును రామ చబుత్ర, సీతా రసోయి, హనుమాన్ చావిడుల మధ్య నిర్మించాడనటం ఎట్లా సమర్ధనీయం? న్యాయమా? ధర్మమా? కశ్మీరులో వేల దేవ మందిరాలు అఘాయిత్యానికి గురి కాలేదా? ఇందుకు విల్ డ్యురాంట్ సాక్ష్యం పనికిరాదా?

-అక్కిరాజు రమాపతిరావు