సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ ఆనందమే నా ఆనందం
ప్రేమలో అహంకారం గానీ, మాలిన్యంకానీ వుండవు. అది స్వార్థరహితం. సాయి ఏం చేసినా, ఏం చెప్పినా, ఏ ఆలోచన చేసినా అవన్నీ మీకోసమే కాని సాయికోసం కాదు. నా ఒకే ఒక్క కోరిక ఏమిటి? మీ ఆనందమే. మీ ఆనందమే నా ఆనందం. మీ ఆనందంకాక నాకు వేరే ఆనందం లేదు.
‘బహు’మతి
ఈనాడు మీరు బహుమతులను పొందారు. ఏమిటి ఈ బహుమతంటే అర్థము? ‘బహుమతి’అనగా ఎన్నో మతులు అని అర్థము. ఒక మతి ఉంటేనే మనము ఇన్ని విధాలైన చింతలకు గురిఅవుతున్నాము. బహుమతులయితే మన గతి యిక వేరే చెప్పల్నా? కనుక బహు... మతులనుంచి నీవు ఏక...మతివి కావాలి. ఏక...మతి అయినపుడే దైవానుగ్రహం అనేటటువంటి బహుమతిని నీవు అందుకొంటావు. అట్టి ఏకమతిని నీవు సాధించటానికి ప్రయత్నించాలి. ఆ ఏకమతి ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతుంది.
ప్రేమే కానుక
స్వామినే నమ్ముకో. ప్రాప్తించిన దానితో తృప్తిపడు. ఆయన నీలోనే వున్నాడు. నీవాయనలో వున్నావు. నీకేం యివ్వాలో, ఎప్పుడివ్వాలో ఆయనకు బాగాతెలుసు. ఆయన ప్రేమతో పొంగి పొరలుతుండాడు. అదే స్వామి ప్రత్యేకత. ప్రేమే నేను తెచ్చే ప్రత్యేకమైన కానుక. ప్రేమే నా అనుగ్రహాన్ని ప్రసరించే సాధనం. నేను చేసే పనులన్నిటికీ మూలం అదే. భగవంతుడన్నిట్లో వున్నాడు. నిజమే. ప్రేమగా నిండి వున్నాడు. ప్రేమే లేకపోతే ప్రపంచం కడగండ్ల కొలిమి అవుతుంది.
ఐక్యతా బంధం
సత్యసాయి సంస్థల పవిత్రాశయాలను గురించి ప్రపంచమంతటికీ తెలుసు. బియ్యం బస్తాలో నాలుగు యిసుక రేణువులు కలిసిపోయే అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఏ మానవ సంస్థలోనైనా కొందరు ప్రబుద్ధులు ఉండవచ్చు. ఆ సంస్థ తన ఆదర్శాలను శ్రద్ధగా అమలుచేస్తున్నంత కాలం అలాటి వాళ్లవల్ల ఆ సంస్థకే ప్రమాదమూ కలగబోదు.
సత్యసాయి సేవాసంస్థలు సాగిస్తున్న సేవ బృహత్తరం. దీనికి మూలం వారందరిమధ్యా నెలకొని వున్న ప్రేమ బంధమే.
ఉపనిషత్తులు ప్రవచించిన ఆదర్శాన్ని చూడండి: ‘సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వి నాపధీతమస్తు మావిద్విషావహై’
- ఈ వాక్యంలో అంతర్లీనంగా వున్న ఐక్యతాబంధం ఒక్క సత్యసాయి సంస్థల్లోనే ఈనాడు కనిపిస్తూ వుంది.
అందరికన్నా దగ్గర చుట్టం
మీకు అందరికన్నా దగ్గరి చుట్టం ఎవరో ఆలోచించండి! తల్లీ, తండ్రీ, భార్యాబిడ్డలూ! కాని వారుకూడా కొంత ఎడంగావుండే వారే, అందరికన్నా దగ్గర భగవంతుడే. ఎందుకని? ఆయన నీలోనే ఉన్నాడు. ఎప్పుడూ నీనుండి వెళ్లిపోడు. దూరంగా జరగనే జరగడు.
వేదం ఆయనను ‘అణోరణీయాన్’ -అణువుకన్నా చిన్న-అనీ, ‘మహతో మహీయాన్’- బ్రహ్మాండాది లోకాలన్నిటికన్నా పెద్దఅనీ వర్ణించింది.
ఆయనను గురించిన ఎరుక ఎలా కలుగుతుంది? అందుకు అత్యంత తపనతో కూడిన ప్రేమకావాలి.
ఈ ట్రిక్కులెందుకు?
ఉపనిషత్తులను రచించినవారు కీర్తికోసమో, సంపదలకోసమో ఆ పని చేసినవారు కాదు. వారు పనీపాటా లేనివారూ, వూసుపోక రాసుకొనే వారూ కాదు. వారి రచనలలో వారివారి వాస్తవానుభూతులు ధ్వనిస్తుంటాయి. ఎడారిలో కొట్టుమిట్టాడుతూ, సుఖ దుఃఖాల విష వలయంలో తిరుగాడుతూ వుండే జీవులపట్ల కరుణతో వారా రచనలు చేశారు. మీకు తరణోపాయం చూపించాలనే వారు ఆ ప్రయత్నంచేశారు. అయితే దారిచూపాల్సిన పెద్దలే ఆ తరువాత క్రమంగా అలసత్వంలో పడిపోయారు. వృధా వాగ్వివాదాలలో చిక్కుకొనిపోయారు. అందుకే ఈనాడు దైవం అవతరించి ప్రేమ సందేశాన్ని అందించాల్సి వచ్చింది.
ఆడంబరాలు, దర్పం, రకరకాల ఆహార్యం, నోరు తిరగని గొట్టుగొట్ట శ్లోకాలు, అబ్రకదబ్రలూ, మంత్రాలూ, తంత్రాలూ - యివి నిజమైన మతానికి సంబంధించినవి కావు. ఇవన్నీ మనిషి తన స్వార్థంకోసం చేసే ట్రిక్కులు. నిజమైన మతం ప్రేమే.

ఇంకా ఉంది