సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ అదృష్టం
ఓనం పండుగను కేరళవారు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఓనం పండుగ జరుపుకోడంలో ఎంతో విశిష్టమైన అంతరార్థం వుంది. వేద సంప్రదాయాలను పరిరక్షించుటలోనూ సంస్కృత భాషాధ్యయనాన్ని ప్రోత్సహించటంలోనూ కేరళ శ్రద్ధాసక్తులతో కృషిచేసింది. హిమాలయాలలోగల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బదరీనాథ్. అక్కడ ఆలయంలో కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులే నేటికీ అర్చకులుగా వున్నారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం యిది. ఆసేతు హిమాచలాన్ని ఐక్యంగా వుంచే అనుబంధం యిది. కేరళలో తిండి తీర్థములకు ఏనాడు కొదవలేదు. అన్ని విధములా భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడైన బలిచక్రవర్తి ఏలిన రాజ్యము అది. కనుకనే ప్రజలను వీడలేక తిరిగి వామనుని ప్రార్థించి సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చి ప్రజలను దర్శించి పోవటానికి వరాన్ని పొందాడు బలిచక్రవర్తి. ఆ దినమే ‘ఓణం’. ఈ ఓనమునకే ‘శ్రావణము’అని పేరు. కనుక ఈ శ్రావణ మాసములో ద్వాదశి దినమున అభిజిత్ నక్షత్రమునందు తిరిగి బలి చక్రవర్తి ప్రజలను చూడటానికి వస్తున్నాడని కేరళ ప్రజల నమ్మిక. అనాది నుంచి కేరళ ప్రజలు ఆ శుభదినాన ప్రతి సంవత్సరం ఈ పండుగను కడు వైభవంగా చేసుకుంటూ వస్తున్నారు. కేరళ ప్రజలకు ఈ ‘ఓనం’ మహాపర్వదినం. బంధువులతో, కూతుళ్ళతో, అల్లుళ్ళతో, ఆడబిడ్డలతో కడు వైభవంగా, విందులనారగిస్తూ ఉల్లాసంగా ఆనందంతో ఇండ్లవద్ద కాలంగడిపే దినం. అటువంటి అవకాశాన్ని వదులుకొని అందరూ స్వామి వద్దకు ప్రతి సంవత్సరం వస్తున్నారంటే, వారి భక్తిని మనం గుర్తించాలి. ఆనాడు బలిచక్రవర్తి త్యాగం చేశాడు. ఈనాడు ఈ బలిచక్రవర్తి రాజ్యంలోని కేరళ ప్రజలు తమ సుఖాన్ని త్యాగంచేసి స్వామి సన్నిధికి చేరుతున్నారు.
ప్రతిబింబం
బుద్ధి జన్మాంతర వాసనలచే ఆవరించబడి వుంటుంది. బుద్ధికి సార్థకత, నిజంగా చూస్తే, త్యాగమే! వైరాగ్యమే!
నీ బుద్ధి దేనిని సత్యం అనుకుంటున్నదో అది మాయ. కుండలోని నీటిలో ఆకాశం కనిపిస్తుంది. అది ప్రతిబింబం మాత్రమే. ఆ నీళ్లు పారబోయి. ఆకాశం పోతుందా? దాని ప్రతిబింబం కనుపించదు. అంతే!
మాయను వదిలించుకో. సత్యం నిలిచే వుంటుంది. కాని, స్వాప్నికమైన దృశ్యం అదృశ్యమవుతుంది.
సర్వధర్మాన్ పరిత్యజ్య...
‘అన్ని ధర్మాలనూ వదులు’అని గీత చెబుతోంది. కాని అన్ని కర్మలూ మానమని కాదు.
మనం ఏదిచేసినా భగవత్పరంగా చేయాలి. భగవంతునికి అర్పితంగా చేయాలి. అప్పుడు ధర్మాధర్మాలు ఆ కర్మనంటవు. దానిని భగవంతుడు అంగీకరిస్తాడు. ఫలమిస్తాడు.
ఈ సంగతి ఎందుకు చెప్పారు?
ఏ పనీ చేయకుండా సోమరిగా కూచోమనా? తిరగమనా? విచ్చలవిడిగా తిరగమనా? మనిషిలోవున్న పరమాత్మకు అంకితంకమ్మనే ప్రబోధం యిది!
భగవద్గీతలోని శ్లోకాలలో రామకృష్ణుని ఎంతో ఆకట్టుకొన్న శ్లోకం యిది:
‘‘మన్మనాభవ మద్భక్తో
మద్యాజీ మాం మనస్కురు
మామే వైష్యసి సత్యం తే
ప్రతిజానే ప్రియోసి మే’’
‘నాయందు మనసు నిలుపు, నాపట్ల భక్తి కలిగిఉండు. నన్నారాధించు. నాకోసం త్యాగం చేయి! నాకు నమస్కరించు. ఈ విధంగా చేస్తే, నాతో తాదాత్మ్యం పొంది ననే్న చేరుకుంటావు. నాకిష్టుడవు కనుక ఈ సంగతి ప్రతిజ్ఞచేసి నీకు చెబుతున్నాను.
త్యాగం ఏది?
భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భారతీయులు ప్రాచీన కాలము నుండి త్యాగమునకే పట్టముకడుతూ వచ్చారు. ధర్మమునే అందలమెక్కించారు. న్యాయమునకు కంకణముకట్టారు. సత్యానికి స్వాగతం చెప్పారు. ప్రాచీన సంబంధమైనటువంటి సంస్కృతిని ఈ ఆధునిక యుగంవారు విస్మరించారు. కేవలము తన భౌతికమైన జీవితమే ప్రధానమని, ప్రమాణమని మనిషి విశ్వసించి, అనేక విధములుగా ఈ ప్రాకృతమైన జీవితానికి, లౌకికమైన జీవితానికి తాను అంకితమై పోతున్నాడు. అందువలననే ఈనాటి ప్రపంచము ఈనాటి మానవులు ఏనాడూ కూడనూ కనీవినీ ఎరుగనటువంటి దురవస్థలకు గురిఅయిపోయి, దుర్భావములకు ఆలవాలమై, దుశ్చర్యలలో ప్రవేశిస్తున్నారు.

ఇంకా ఉంది