సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే శాశ్వతమైన ఆత్మను కనుక్కో! అదే పరమాత్మ ఆ అనంతుని సహచర్యంలో అమృతత్వాన్ని అందుకో!
ఈ రోజిక్కడ, రేపెక్కడో రుూ బిడారు? ఈ ‘కాసేపు’ ఈ కరుణాక్షేత్రంలో నీవు సంతరించుకొనే సంపదలన్నిటికీ నీవు ట్రస్టీవి. వాటిని సద్వినియోగం చేయి! అంతే.
ఉచిత సేవ
ఆరోగ్యానికి గుండె చాలా ప్రధానం. జీవితానికి విద్య ప్రధానం. దేహానికి జలం ప్రధానం. ఈ మూడూ-అంటే వైద్యం, విద్య, మంచినీరు ఉచితంగా యివ్వాలి. దీనిని వ్యాపారంమాదిరి చేయకూడదు. ఇవి భగవంతుని ఆస్తి. దీపమునకు తైలము ఎంత ప్రాణమో, జీవితానికి ప్రేమ అంత ప్రాణం. తైలములేని జ్యోతి, ప్రేమలేని జీవితం కేవలం చీకటియే. నీతోపాటు అందరూ సుఖపడాలి. అందరూ ఆనందించాలి. సాధ్యమైనంత వరకు దీనిని దృష్టిలో పెట్టుకొని త్యాగభావంతో తగిన సేవలు చేయాలి.
మూడు మెట్లు
సేవకు మించిన సుగుణం లేదు. సేవాభావాన్ని పెంపొందించుకోడానికి ప్రేమ, దయ, త్యాగం అనే మెట్లుదాటాలి. ఆ తరువాత అమృతమే.
‘హిందు’ అంటే...?
ఈనాడు చాలమందికి జాతీయతా తత్త్వం అర్ధంకావటం లేదు. ఇది భరతదేశం. భరతుడనే రాజు ఏలాడు కాబట్టి ఈ దేశమునకు ‘్భరతదేశము’అని పేరు వచ్చిందంటున్నారు. ఇది కాదు. ‘పద్మపత్ర విశాలాక్షి... సరస్వతీ, భగవతీ, భారతి’. సరస్వతి యొక్క పేరు ఈ భారతి. ఇది వ్యక్తుల పేరనుకుంటున్నారు. శ్రీరాముని తమ్ముని పేరని కొందరు, శకుంతల కుమారుని పేరని మరికొందరంటున్నారు. కానే కాదు. వీటన్నింటికన్నా ముందుగా ఉన్నది భారతి పేరు. భారతీయ సంస్కృతిని విదేశీయులు గుర్తించి, దానికి సరియైన అర్థంగా హిందు అని పేరుపెట్టారు. ఏమిటి ఈ హిందు ఇవి అయిదు అక్షరములు. ఈ ఐదు అక్షరములే భారతదేశముయొక్క పంచప్రాణములు; పంచకోశములు; పంచభూతములు. ఈ పంచభూతముల యొక్క తత్త్వమే భారతీయుల తత్త్వము.
H- Humanity (మానవత్వం)
I- Individuality (వ్యక్తిత్వం)
N- Nationality (జాతీయత)
D- Divinity (దివ్యత్వం)
U- Unity (ఐకమత్యం)
భారతీయుల మధ్యనే కాదు, యావత్ మానవ సమాజంలోనూ ఐకమత్యం ఏది? యదార్థంగా నీవు హిందువువయితే, నీకు పాపభీతి వుండాలి. జ్ఞాన తృష్ణ వుండాలి. త్యాగశీలం వుండాలి.
నదులందరివి
భారతదేశంలో ఉన్న జీవనదులు ఏ దేశంలోనూ లేవు. భారతదేశంలో అన్నపూర్ణను అందించేటటువంటి సారవంతమైన సువిశాలమైన భూములు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఉపయోగించుకోలేక పోతున్నాం. గంగా, కావేరి, కృష్ణా, గోదావరి మొదలైనవి జీవనదులెన్నో భారతదేశంలో ఉన్నాయి. దేశంలోని ఈ నదీ జలాలన్నింటినీ జాతీయ ఆస్తిగా ప్రకటించితే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ ఈనాడు ఒక నది కర్ణాటకదని, మరొక నది మహారాష్టద్రని భావిస్తూ నదీజలాల పంపిణీ విషయంలో పోరాటం చేస్తున్నారు. ఈ భేదం ఎవరు పెట్టారు?
కొందరు స్వార్థపరులో, ఆవేశపరులో పెట్టిన భేదం ఇది. ఇది దేశము యొక్క ఆస్తి. ఇది జాతీయ సంపద. నీటిని అందరూ ఉపయోగించుకోవచ్చును. ఐకమత్యం లేక ఇది నా నది, అది నీ నది అని తేడాలురావటం చేతనే, చివరికి అంత జలమూ సముద్రములో వృథాగా చేరిపోతున్నది. ఇది మన సంపద, మనందరి సంపద. ఇట్టి విశాలమైన త్యాగభావమును అంతా పెంపొందించుకోవాలి.
సుస్వరం
వీణలోని తీగలన్నీ వేరువేరుగా ఉంటాయి. కాని వీణ ఒక్కటిగానే ఉంటుంది. అదే విధముగా దేశమంతా ఒక వీణలాంటిది. తీగలు మతములు. ఏ తీగ అపస్వరం పలికినా వినేవారికి ఇంపుగా ఉండదు. కనుక వీణలోని అన్ని తీగలు సరిగా ఉండేట్లు చూచుకోవాలి. అదే విధంగా అన్ని మతముల క్షేమమును మనం కోరుకోవాలి. మానవులందరి క్షేమాన్ని మనం త్యాగభావన చేసి ఆకాంక్షించాలి.
సనాతన ధర్మ విశిష్టత
ఈ కాలపు భౌతికవాదం సనాతన ధర్మంముందు తలవొంచక తప్పదు. లౌకిక, ఆధ్యాత్మిక ధోరణులను మేళవించి ఒకే జీవిత విధానంగా మలచగల శక్తి సనాతన ధర్మానికి వుంది. మానవునీ, మాధువునీ సన్నిహితం చేయగలిగింది ఆ ధర్మమే. నిత్యమూ, సత్యమూ అయిన ఆత్మతత్వంపై అది ఆధారపడి వుంది. కనుక అది ఒక దేశానికీ, ఒక మతానికీ, ఒక జాతికీ, ఒక కాలానికీ, ఒక వ్యక్తికీ పరిమితంకాదు. అనేక విధానాలూ, అనేక దృక్పథాలూ, అనేక దర్శనాలూ అందులో అంతర్భాగంగా వున్నాయి. ఏ వయసువారికైనా, ఏ పరిసరాలనుండి వచ్చిన వారికైనా వర్తించే ప్రత్యేక అంశాలు అందులో వున్నాయి.
ఇంకా ఉంది