సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన సంస్కృతి
విదేశీయ దుస్తులు, ఫ్యాషన్లు, అభిరుచులంటే ఈనాడు మోజు జాస్తిగా వుంది. దిగుమతి చేసికొన్న ఆదర్శాలను చిలకపలుకుల్లా వల్లించటం ఎక్కువయింది. యువత మంచేదో, చెడేదో తెలుసుకోలేక, ఈ వ్యామోహంలో కొట్టుకొనిపోతూ వున్నది. ఇవన్నీ మన సంస్కృతిలో ఇమిడేవి కావు. ఈ దేశపు సంస్కృతి సనాతన ధర్మంపై నిలచివుంది.
ఈ గడ్డపై పుట్టి పెరిగేవారికి సుఖసంతోషాలు కలిగించేందుకు ఈ సంస్కృతి ఉపకరిస్తుంది. అరువు నగలతో ఎన్నాళ్లు తళతళలాడతావు? దానివల్ల నీకు కలిగేది తాత్కాలికమైన ఆనందమే. వాటికి ఆశపడి నీ సంస్కృతిని వికృతం చేసికోకు, నిర్లక్ష్యం చేయకు.
పరోపకారం
మన సంస్కృతిలో పరోపకారానికి ప్రత్యేక స్థానం ఉంది.
‘పరోపకారాయ ఫలంతి వృక్షాః॥
పరోపకారాయ వహంతి సద్యః
పరోపకారాయ దుహంతి గావః॥
పరోపకారార్థ మిదం శరీరం’
చెట్లు ఇతరులకోసమే పండ్లు కాస్తున్నాయి. నదులు పరులకోసమే ప్రవహిస్తున్నాయి. ఆవులు ఇతరులకోసమే పాలిస్తున్నాయి. ఈ విషయం మానవుడు ప్రకృతినుండి నేర్చుకోవాలి. తన శరీరం పరోపకారం కోసమేనని గ్రహించాలి.
ఆలోచిస్తే...
అన్నదానాన్ని మించిన దానంలేదు. తల్లిదండ్రులకంటే దైవం లేదు. సత్యానికి మించిన తపస్సులేదు. దయకన్నా ధర్మం లేదు. సత్ సాంగత్యాన్ని మించిన లాభం మరొకటి లేదు. సద్గుణాలకన్నా ఆభరణాలు లేవు. సత్యకీర్తికన్నా సంపద లేదు. అపకీర్తికన్నా మరణం లేదు. త్యాగం కన్నా అమృతం లేదు. సంతోషాన్ని మించిన స్వర్గం లేదు.
నారాయణ సేవ
అన్నదానం అని మనమంతా తరచు అంటుంటాం. కాని అన్నాన్ని దానం చేసే అధికారం ఎవరికుంది? పరమాత్ముడనుగ్రహించిన పంటను ఆకలితో వచ్చిన అభాగతులకర్పించుట దానమా? అది నారాయణ సేవ మాత్రమే. అందులో అహంకారానికి చోటులేదు. సోదర మానవులలోగల నారాయణునికే అది నైవేద్యం.
త్యాగంతో భోగం?
త్యాగంతో భోగాన్ని అనుభవించు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యం? త్యాగి, భోగి ఒకరుకారే! త్యాగి భోగాన్ని గురించి, భోగి త్యాగాన్ని గురించి యోచించరు. ఈ రెంటికీ పొత్తుకుదరక పోయినా త్యాగంతో భోగాన్ని అనుభవించమని పెద్దలనటంలో అర్థం ఏమిటి? త్యాగంలో అహంకారానికి చోటుండరాదు. భోగంలో ఆసక్తికి అవకాశమివ్వరాదు. త్యాగంచేయడంలో అహంకారాన్నీ, భోగానుభవంలో ఆసక్తిని వదిలితే రెంటికీ తేడా లేదు.
త్యాగ తత్వం
త్యాగం అంటే ఏమిటి? కొంత డబ్బునో, సామగ్రినో యితరులకు ఇవ్వడమా? కాదు. త్యాగము ఒక యోగము. త్యాగమంటే ఆస్తిని వదలి, అడవులకు పోవటంకాదు. మనసులోని చెడును వదిలివేయటం త్యాగం. చెడు తలపులున్నంత కాలం చెడుపనులు చేయకుండా వుండటం కష్టం. మన దోషాలను మరుగుచేసికొని, ఎవరూ చూడలేదనుకోవటం పొరపాటు. ఉష్టప్రక్షి యిసుకలో తలదూర్చినంత మాత్రాన అది వేటగాని కంటికి కనిపించకుండా పోతుందా? దేవుని దృష్టిని నీ మనసులోని మకిల తప్పించుకోగలదా?
మనసు పని ఇంతే
మనసు మంచి పనులకు పూనుకోటం కష్టం. అది కోరిన వాటిని కావాలంటుంది. చూచినవన్ని అనుభవించాలంటుంది. ఆపేక్ష త్యాగానికి అడ్డువేస్తుంది. ఉపేక్షను పెంపొందించుకో, త్యాగానికి మార్గం సుగమం అవుతుంది. అపేక్ష లౌకికం. ఉపేక్ష పారలౌకికం. ఉపేక్ష ఎండిపోయిన సొరకాయ. సంసార ప్రవాహంలో అది తేలుతుంది. అపేక్ష పచ్చి సొరకాయ. బుడుంగున మునుగుతుంది.
- ఇంకా ఉంది