సబ్ ఫీచర్

వైకుంఠపురములో.. అంతా వినోదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటెంట్‌కు మించి ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. సరైనోడు, డీజె, నాపేరు సూర్య.. లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాల తరువాత -ఆడియన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనిపించింది. నా ఆలోచనకు త్రివిక్రమ్ తోడవ్వడంతో -అల.. వైకుంఠపురములో
పుట్టుకొచ్చింది.
దర్శకుడు త్రివిక్రమ్ నాతోనే ఎక్కువ సినిమాలు చేశారు -అంటున్నాడు అల్లు అర్జున్. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ఫెస్టివ్ ప్యాక్‌గా వస్తున్న సినిమా -అల.. వైకుంఠపురములో. పూజాహెగ్డే హీరోయిన్. ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు కనిపించనుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం -నేడు విడుదలవుతుంది. ఈ సందర్భంగా బన్నీ మీడియాతో ఇంటరాక్టయ్యాడు.
అల.. వైకుంఠపుములో -అంటే అక్కడ జరిగిన అందమైన కథనం అన్న ఆలోచనతో టైటిల్ పెట్టాం. వైకుంఠపురం లాంటి అందమైన ఇంట్లో -కుటుంబ సభ్యుల మధ్య అల్లుకున్న కథ ఇది. ఒకరకంగా నాకు అలాంటి టైటిల్సే యాప్ట్‌గా ఉంటున్నాయేమో. త్రివిక్రమ్ సైతం అదే సెంటిమెంట్‌తో పని చేయడంతో -అలాంటి చిత్రాలొస్తున్నాయి.
కొందరు హీరోలకు కొందరు దర్శకులతో ర్యాపో బావుంటుంది. వేవ్‌లెంగ్త్ కలిసి -ఇద్దరూ ఒక్కటన్నట్టే ఉంటుంటారు. ఒకప్పుడు చిరంజీవి- కోదండరామిరెడ్డి మధ్య అలాంటి వేవ్‌లెంగ్త్ ఉండేది. అందుకే -వాళ్లనుంచి మంచి సినిమాలొచ్చాయి. త్రివిక్రమ్‌తో నాకూ అలాంటి రిథమ్ ఉందనిపిస్తుంది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంప్లాయిని నేను. నా బాస్ పూజా హెగ్డే. అదీ, ఇదీ అంటూ నాకు పురమాయింపులు చేస్తుంటుంది. తండ్రిగా మురళీ శర్మ కనిపిస్తారు. ఆ పాత్రకు నాకు అస్సలు పడదు. గతంలోనూ ఇలాంటి పాత్ర తనికెళ్ల భరణితో చేశా.
సినిమాలు చేయడంలో గ్యాప్ వచ్చిందని మీరనుకుంటారు. నేను అస్సలు అనుకోను. ఈ గ్యాప్‌లో చాలా నేర్చుకున్నా. పెద్ద విరామాన్ని సంతృప్తిపర్చే విషయాలు ఏం తెలుసుకున్నాననే ఆలోచిస్తా. ఇంత గ్యాప్‌లోనూ ఫ్యాన్స్ నాతోనే ట్రావెల్ చేస్తుండటం ఆనందాన్నిచ్చే విషయం. అందుకే వారిని ఆర్మీ అనుకుంటాను. ఒకరకంగా నా ఆర్మీ నా అభిమానులే.
‘సామజవరగమన’ పాటకు ఓ చరిత్రే చెప్పొచ్చు. ఈ రెండేళ్లల్లో అనేక కార్యక్రమాల్లో బాండ్ కల్చర్ పెరిగింది. ఓసారి నేను, నా భార్య ఇలాంటి పార్టీలకు వెళ్లినపుడు యూత్ దీనికి కనెక్టవుతారన్న విషయాన్ని గుర్తించా. అలాంటి పాటను ఒకటి చేయాలనుకున్నా. నేననుకున్నట్టే తమన్ సైతం ఆలోచించాడు. విచిత్రమే.
సినిమాలో ఓ సన్నివేశంలో లవ్‌సాంగ్‌కు బాండ్‌కల్చర్ జత చేస్తే ఎలా వుంటుందా? అని ఇద్దరం అనుకున్నాం. ఎలాంటి పాటలు ఇష్టపడుతున్నారో గమనించి ఆ టెంపోలోనే పాట చేయాలనుకున్నాం. దర్శకుడు కూడా సామజవరగమన అనే పాటను తయారుచేసి తమన్‌తో ట్యూన్ చేసి నాకు వినిపించారు. ఓరకంగా అందరి సమిష్టి కృషే ఈ పాటనుకుంటా.
ఆడియోకి మంచి ఆదరణ లభించింది. పాటల తాలూకు విజువల్స్‌కీ ప్రేక్షకుల నుంచి లైక్స్ వచ్చాయి. పాటలు థియేటర్‌లో చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ఇలాంటి చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ చేయాలంటే ఎప్పుడూ సరదా మూడ్‌లోనే ఉండాలి. అపుడే పాత్రలు బాగా పండుతాయి. అనవసరమైన టెన్షన్ తీసుకుని బరువు పెంచుకోకూడదు. సీరియస్‌గావుండి షాట్ రాగానే వచ్చి సరదాగా చేసి వెళ్లిపోతే -ఆ షాట్‌లో ఆ మూడ్ రాదు, జీవం ఉండదు. అందుకే నేను అలాంటి టెన్షన్లు పెట్టుకోను. సరదా సరదాగానే చేసేస్తాను. నా పాత్ర కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా.
సినిమాపై భారీ అంచనాలున్నమాట నిజమే. ఎందుకంటే త్రివిక్రమ్, నేను కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే భారీగా అంచనాలు ఉన్నాయనుకుంటా. విడుదల చేయడానికి ముందే అనేక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సినిమా ప్రతివారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.
అల్లు అర్జున్ కాస్తా మల్లు అర్జున్‌గా కేరళలో గుర్తింపు పొందారు. మలయాళంలోనూ స్ట్రెయిట్ చిత్రం చేయడానికి ఒకరిద్దరు మేకర్స్ వచ్చారు. కానీ సరైన స్క్రిప్ట్ కుదరడంలేదు. మనం అక్కడ చేస్తే ఏదైనా మంచి సినిమా చేయాలనుకుంటున్నా. లేదంటే మన తెలుగు పరువు పోతుంది కదా!