సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవెవరు?
నీవెవరవో తెలుసుకోగల్గడం కష్టం. ‘నేను’అన్న అహాన్ని ముందు దగ్ధం చేయి. నీలోని దైవాంశను గుర్తించు. దివ్యజ్వాలగా దానిని జ్వలింపచేయి. సనాతన ధర్మం దైవాంశను గుర్తించటం ఎలాగో, దానిని అభివృద్ధి చేసికొనటం ఎలాగో చెబుతుంది. సైన్సు పేరుతో నీవాధర్మాన్ని ఉపేక్షిస్తే, నీ సంస్కృతికే నీవు అగౌరవం తెచ్చిన వాడివౌతావు.
సుధను ఆస్వాదించు
నాలుగయిదేళ్లలో యిక్కడికి మహర్షులూ, మునులూ, యోగులూ గుంపులుగా రావటం మీరు చూస్తారు. అప్పుడు మీకు నన్ను విడిగా కలుసుకొనే అవకాశంకానీ, ప్రశ్నలడిగే వీలుకాని వుండదు. కనుక, యిప్పుడు పద్మంచుట్టూ చేరే కప్పల్లా ప్రవర్తించకండి! పద్మంపై వాలే తేనెటీగల్లా వ్యవహరించండి. త్యాగసుధను ఆస్వాదించండి! అమృతత్వాన్ని అందుకోండి!
భక్తియోగం
పుణ్యభూమి
భారతదేశం పుణ్యభూమి. ఇక్కడే వేదాలు ఆవిష్కరించబడ్డాయి. సామాన్య మానవునికి విజ్ఞానదాయకంగా వుండే విధంగా శాస్త్రాలూ, ఇతిహాసాలూ, పురాణాలూ రచించబడ్డాయి. అందులోంచే సంగీతం, లలిత కళలూ దివ్యత్వాన్ని కీర్తించటంకోసం ఆవిర్భవించాయి. ఇక్కడే మంత్ర తంత్ర శాస్త్రాలు జన్మించాయి. యోగశాస్త్రం నిబద్ధించబడింది జ్ఞాన, కర్మ, భక్తియోగాలు పరిఢవిల్లాయి.
యుగయుగాలుగా భక్తిప్రపత్తులు నిండిన భారత్ నిజంగా దివ్యభూమి. ఇక్కడ సామాన్య ప్రజానీకం కూడా భక్తిమార్గాన నడుస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఇక్కడ మారుమూలల్లో కూడ కనిపిస్తుంది. నిత్యజీవితంలో అన్ని రంగాలలో ఆధ్యాత్మికత చోటుచేసికొంది. అటువంటి మహా సంస్కృతీ సంప్రదాయాలకు మీరు వారసులు. ఈ సంస్కృతి అనేక ఆటుపోటులను తట్టుకొని నిలిచింది. పరాయి పాలనలోనూ, రాజకీయ వొత్తిడులకూ అది చెక్కుచెదరలేదు. ఈ సంస్కృతికి పునాది ఏమిటి? భక్తి!
‘్భక్తి రేవ పరమార్థ దాయినీ
భక్తి రేవ భవరోగ నాశినీ
భక్తిరేవ పరమోచ కారిణీ
భక్తిరేవ పరమోక్ష సాధినీ’
భక్తిచేతనే మానవుడు పరమతత్వాన్ని పొందగలుగుతున్నాడు. భక్తిచేతనే జనన మరణాది భవరోగములను నివారణగావించుచున్నాడు. భక్తిచేతనే పరమాత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించుచున్నాడు. భక్తి చేతనే పరమ పదవిని కూడనూ పొందుచున్నాడు. భక్తియే పరమసాధనగా భావించి, పరమగమ్యముగా విశ్వసించి, పరమ లక్ష్యముగా తలచి, అనాది కాలమునుండి భారతీయులు భక్తిమార్గమును అవలంబిస్తూ వచ్చారు.
భక్తి అంటే
భక్తి అనే పదము ‘్భజ్’అనే ధాతువునుండి ఉద్భవించినది. ‘్భజ్ సేవాయా’ అన్నాడు శంకరుడు. అనగా సేవకు భక్తి అని పేరు. ఎవరి సేవ? ఎట్టి సేవ? ‘్భజ.. .సేవాయాం’అనగా భగవత్ సేవయే. అదే నిజమైన భక్తి. ‘స్వ స్వరూప సందర్శనమే భక్తి’అని వివేక చూడామణి బోధిస్తున్నది. ఇక నారదుడు ‘‘పరమప్రేమను భక్తి’’అని బోధించాడు. (్భజ-పరమభక్తిః) అనగా ఏకధారగా భగవత్ నామంలో ప్రేమను ఇమిడ్చి, ప్రేమ ప్రవాహమును భగవంతునివైపు మరల్చునదే... భక్తి అన్నారు. ప్రేమ తత్త్వముతో తననుతాను మరిపించి దేహమును మురిపించి, మనస్సుతో లీనముగావించి, తన్మయత్వము గావించునట్టిదే భక్తి. తన దివ్యత్వాన్ని ఆవిష్కరించునటువంటి ప్రేమతత్త్వమే భక్తి.
భక్తి ప్రధానం
భగవద్గీత అంటుంది: ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం-ఏది భక్తితో అర్పించినా తృప్తిపడతాడు భగవంతుడు’అని. నిజానికి ఆయనకు కావలసింది భక్తికాని పత్రి కాదు.
ద్రౌపది ఏమిచ్చింది? అంట్లగినె్నకంటుకున్న ఎంగిలి మెతుకు. అదే అరణ్యవాసంలో అక్షయమై, అందరికీ పంచభక్ష్య పరమాన్నాలను అందించలేదా? కుచేలుడిచ్చింది అటుకులు. పొందిందో! అంతులేని సిరిసంపదలు!
ఇంకా ఉంది