సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయ పుష్పం
ఇక్కడినుండి నీవు వెళ్లవలసింది ఆత్మ విచారం వేపే. అదే నిజమైన అర్చన. మీరు తెచ్చే పూలూ, పండ్లూ నాకెందుకు? అవి వాడి వత్తలైపోతాయి. వసివాడనిది నీ హృదయ పుష్పం. భగవాన్ కోరేదదే. నీవు చిత్తశుద్ధితో, భక్తితో, సౌశీల్యంతో పూయించే ఆ పుష్పాన్ని సమర్పించు. కరుణ, త్యాగం, సేవ అనే ఫలాలను అర్పించు.
పెద్దవాళ్ల దగ్గరకుపోయేటప్పుడు పూలో, పండ్లో తీసుకొనిపోవటం లోక మర్యాద. కాని సాయి ఆ మర్యాదకు అతీతుడు. సాయి లోకంవేరు. అది ఆధ్యాత్మికమైంది. అక్కడ మర్యాదలు వేరు. విలువలు వేరు. మీరు మంచి శీలాన్ని పెంపొందించుకోండి! భక్తితో మెలగండి! అదే నాకు సేవ! అదే నాకు అర్చన! నాకా కైంకర్యం చాలు! దానికే నెనెంతో ఆనందిస్తాను.
భక్తుని లక్షణం
భక్తి సమర్పణ కోరుతుంది. దేనినీ సొంతానికి దాచుకోనివ్వదు. తనదంటూ దేనినీ వుండనీయదు. లేశమాత్రమైనా అహంకారం వుండరాదు. ఆయన ఇచ్ఛే జరుగుతుంది. ఆయన ఆజ్ఞే శిరసావహించబడుతుంది. తాగుబోతుకు వలెనే భక్తునకుకూడా సిగ్గూలజ్జా తెలియవు. మట్టూమర్యాదా వుండవు. భక్తుడు కూడా మత్తుడే. ఉన్మత్తుడే. తన దైవానికి సంబంధించింది తప్ప అతనికి ఇంకేదీ పట్టదు. ఆకలీ, దప్పికా తెలియవు. అతనికి తర్కం కుదరదు. బజారుకు పంపితే బేరసారాలు చేయలేడు. కనీసం లెక్కప్రకారం చిల్లర తెస్తాడన్న నమ్మకం కూడా లేదు.
దివ్యాత్మ స్వరూపులు
సంతోషాన్నిచ్చే వనరులలో అత్యంత ప్రధానమైన వానికి మీరు చేరువలో వున్నారు. ఇటువంటి ఆనందం ఇంకెక్కడా లభించదు. ఇది ఎంతో దగ్గరగా వుంది. ఎంతో తేలికగా లభిస్తున్నది. పరిపూర్ణమైన అనుగ్రహం వర్షిస్తున్నది. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే, మళ్లీరాదు. భద్రాన్ని కోరుకో, బంధాలను కాదు.
మీరు ననె్నన్నో ప్రాపంచిక విషయాలను అడుగుతారు. కాని ‘నన్ను’ కోరుకుంటున్నారా? అందుకే మిమ్మల్ని నేను ‘్భక్తులారా!’అని ఎక్కువగా సంబోధించను. ‘దివ్యాత్మ స్వరూపులారా!’అంటాను. మీకు తెలియదు. కాని మీరు దివ్యాత్మ స్వరూపులే. కనుక నేనలాఅనటంలో అసంబద్ధత లేదు. కాని, భక్తి మాట వేరు. మీకు దైవంతప్ప మరేమీ అక్కరలేదనిపించే స్థితే భక్తి!
భక్తుల అర్హత
నిత్యం నా ప్రశస్తిని నా భక్తులు గానం చేస్తున్నారు. నా ప్రశస్తి ఏమిటి? అది తెలుసుకొని నీవు నా భక్తుడివా? ఆత్మనిగ్రహాన్ని ఎంతవరకు అవలంబించగలుగుతున్నావు? ఎంతవరకు నిస్సంగుడిగా మారావు? ఎంతటి సత్ప్రవర్తనను అలవరచుకొన్నావు? వీటినిబట్టి లెక్కవేయి. నీది ఎంత దృఢమైన భక్తో నీకే తెలుస్తుంది. నా భక్తుడనని అనిపించుకోటానికి ముందు తగిన అర్హత సంపాదించుకో. నా చుట్టూ భక్తులు మూగాలని నాకు లేదు. ఈ లోకంలో జనం దేన్నైనా ప్రత్యక్షంగా తెలుసుకోలేరు. పరోక్షంగా కొలుస్తారు. అయితే నా నిజమైన భక్తులెందరుంటారు? చాలా అరుదు. నాతో ‘్భక్తులారా!’అని పిలిపించుకోవాలంటే మిమ్మల్ని నా చేతుల్లో పెట్టుకోండి. సంపూర్ణంగా ఏమాత్రం అహానికి తావు లేకుండా శరణు పొందండి!
నమస్కారం
ఒక్కసారి నమస్కారం పెట్టినా అది భక్తిశ్రద్ధలతో పెట్టు. కాని నీవదయినా సరిగా చేయవు. ఏదో పరధ్యానంగానో, మొక్కుబడిగానో ఎవరినో ఉద్ధరిస్తున్నట్లుగానో చేస్తావు. నీవు రెండు హస్తాలనూ దగ్గరకు చేర్చి దండం పెట్టడంలో అర్థం ఏమిటి? అయిదు కర్మేంద్రియాలు చేసే పనులనూ, అయిదు జ్ఞానేంద్రియాలు చేసే పనులనూ అన్నిటినీ ఆయన పాదాలపై అర్పిస్తున్నానని చెప్పటమే నమస్కారం ఉద్దేశం. వంగి, కాళ్లు తాకి, సాష్టాంగ ప్రణామం చేయటంలో ఉద్దేశం స్పర్శనమే. మాయ శక్తి, మహాశక్తి కలిసినప్పుడు నీలో ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం బయలుదేరుతుంది. ప్రణామం అంతరార్థం అది!
గురువులు గాని, పెద్దలుగాని ఉదయానే్న మొదటిసారిగా కనుపించినపుడు భారతీయ సంస్కృతిననుసరించి నమస్కరించాలి.

ఇంకా ఉంది