సబ్ ఫీచర్

పశ్చిమాసియాలో పడగ విప్పిన ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వదేశంలో విదేశీ సైన్యాధిపత్యం’ ప్రపంచంలోని పశ్చిమాసియా దేశాలలో అమెరికా సైనిక స్థావరాల మోహరింపు కారణంగా ప్రపంచ రాజనీతిగా చెలామణీ అవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొంత చల్లారినట్టుగా స్పష్టంకావటంతో, దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ముడి చమురు, సహజ వాయువుల సరఫరాకు ఎటువంటి విఘాతం కలగక పోవటం మన దేశానికి కొంత ఊరట కలిగిస్తోంది. మన దేశం ముడి చమురు సహజ వాయువును అత్యధికంగా 83 శాతం దిగుమతులపై ఆధరాపడి వుండగా 60 శాతం గల్ఫ్ ప్రాంతాలనుంచి వస్తున్నదే. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో మన దేశం మూడవ స్థానంలో వుంది. 2018 ఆర్థిక గణాంకాల ప్రకారం ఈ దిగుమతుల గల్ఫ్‌నుంచి సరఫరా 11,200 కోట్ల డాలర్లు పైబడినట్లు తెలుస్తోంది. పెట్రోలియంతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ, పశ్చిమాసియా దేశాలు ఎటువంటి సంక్షోభంలో చిక్కుకొన్నా మన దేశ ప్రస్తుత చమురు, సహజవాయువుల స్వదేశీ ఉత్పత్తుల స్థితిగతులలో మనం కుదేలు కావలసినదే. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, యుద్ధ వాతావరణం ప్రపంచానికే ఆందోళన కలిగించే అంశంగా పరిణమిస్తోంది.
ప్రపంచంలో అత్యంత సంపన్నవంతమై, అగ్ర అణ్వాయుధ శక్తికలిగిన అమెరికా 2001 సెప్టెంబర్ 11 ఉగవాద దాడి ప్రభావం కారణంగా మతోన్మాదాన్ని మట్టుపెట్టే యుద్ధ వ్యూహాత్మకంగా అంతర్జాతీయ రాజకీయానికి సారధ్యం వహిస్తూండటంతో, పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతోంది. గల్ఫ్ దేశాలపై యుద్ధమేఘాలు కమ్ముకొంటన్నాయి. అమెరికా కాంగ్రెస్‌ను సంప్రదించకుండా, ఇరాన్ అత్యున్నత సైనికాధికారి మేజర్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు మిలటరీ ఆ దేశ సైనికచర్య వివాదాస్పదమైంది. ఆఫ్గానిస్థాన్, ఇరాక్, జోర్డాన్, టర్కీ, సిరియా, ఖతార్ యితర పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో అమెరికాకు చెందిన వేలాది సైనిక బలగాలు స్థావరాలుగా మోహరించి వున్నాయి. కమాండర్-ఇన్-చీఫ్ ఆధిపత్య హోదాలో దేశ సార్వభౌమ అధికారాన్ని రక్షించే బాధ్యత అధ్యక్షుడు ట్రంప్‌కు వున్నప్పటికీ, యుద్ధంలోకి లేదా యుద్ధం జరిగే అవకాశాలున్న ఉద్రిక్త ప్రాంతాలకు సైనిక బలగాలను పంపే ముందు వీలున్న ప్రతి సందర్భంలోను అమెరికా రాజ్యాంగం ప్రకారం, కాంగ్రెస్‌తో సంప్రదించవలసి వుంది. ట్రంప్ సైనిక చర్య వివాదానికి తెర లేపింది.
అమెరికా-ఇరాన్
అమెరికాపై దాడి పొంచి వుంటే దేశ రక్షణ ప్రాధాన్యత దృష్ట్యా సైనిక శక్తిని వినియోగించే అధికారాలున్నా, ఇరాన్‌తో యుద్ధానికి కాలుదువ్వే దుందుడుకు సైనిక చర్యలను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. సులేమానీ అంత్యక్రియలలో 50మందికి పైగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం, మర్నాడే ఉక్రెయిన్ విమానం కుప్పకూలి 176 మంది దుర్మరణం సంచలన వార్తలయ్యాయి. ఇరాన్‌లోని అమెరికా స్థావరాలపై ప్రతీకారంగా క్షిపణుల దాడులు, తాజాగా ఇరాన్ మిలటరీ విమానం కూల్చివేత మానవ తప్పిదంగా ప్రకటించటం ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది. ప్రతీకారం పడగవిప్పింది.
ఇరాకీ ప్రభుత్వ ఆహ్వానంపై ఇస్లామిక్ స్టేట్‌ను అణచివేయటానికి అక్కడ మోహరించిన అమెరికా మిలటరీ దళాలు బాగ్దాద్ ప్రభుత్వ ఆమోదం లేకుండా విమానదాడులకు పాల్పడటం పైగా సులేమానిని మట్టుపెట్టడంపై ఇరాన్ ప్రభుత్వ, ప్రజల ఆగ్రహావేశాలు మిన్నుముట్టాయి. అమెరికా ఇరాన్‌ల మధ్య శత్రుత్వం మధ్య ప్రాచ్యదేశాలలో మరింత సంక్షోభం సృష్టించినట్లయితే ఇండియా వంటి దేశాలు క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్ సరఫరా, దిగుమతులు మరింత పతనస్థాయి చేరుకొనే ప్రమాదం పొండివుంది. ప్రపంచ మార్కెట్‌కు 20శాతం ముడి చమురు, 26 శాతం సహజ వాయువు ఇరాన్ సహకారంతో రవాణా అవుతున్నాయి. భారీ ముడిచమురు, సహజవాయువు సిరిసంపదలు నిక్షిప్తమైవున్న గల్ఫ్ ప్రాంతాలనుంచి, అరేబియన్ సముద్రం ద్వారా హోర్మజ్ జలసంధి ఆయిల్ టాంకర్‌ల రవాణాకు అత్యంత కీలకమైనది. ఆ జలసంధి యిరుకైనదైనా ఇరాన్, ఒమన్‌ల ద్వీపకల్పాల మధ్య వుండటంతో హోర్మజ్, పర్షియన్ జలసంధులకు అనుసంధానంగా సాగుతున్న నౌకా రవాణామార్గానికి షిప్పింగ్ రాకపోకలకు అనుకూలమై వుంది. యెమెన్, ఆఫ్రికా అగ్రభాగాల మధ్య ఎర్రసముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానం చేస్తున్న బాబ అల్ - మందబ్ జలసంధి ద్వారా కూడా సముద్రంపై ఆయిల్ రవాణా సాగుతోంది. పశ్చిమ ఆసియాలో మరింత ఉద్రిక్త యుద్ధ వాతావరణం పెరిగితే, ఇరాన్ ప్రతీకార పంజా విప్పితే సముద్ర వాణిజ్యం పెనుప్రమాదం ఎదుర్కోవలసి వుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వైఫల్యం కొట్టొచ్చినట్టు స్పష్టమవుతోంది. గల్ఫ్ ప్రాంతాలలో భద్రత లోపిస్తే ఆర్థిక, ఇంధన ప్రయోజనాలు పొందుతున్న దేశాలన్నీ కుదేలవక తప్పదు.
ముడి చమురుతో ముడిపడిన గల్ఫ్ బాంధవ్యం
గల్ఫ్ ప్రాంత దేశాలలో శాంతి, సుస్థిరత, భద్రత నెలకొల్పటం లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌లు సయోధ్యతో వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపు యిచ్చారు. చమురు, గ్యాస్ సరఫరాకు విఘాతంతోపాటు గల్ఫ్ దేశాలలో వున్న 80 లక్షల మంది భారతీయుల జీవన భద్రత సమస్య ముడిపడి వుంది. లిబియా, యెమెన్, ఖతార్ యుఏఈ, ఇరాక్, జోర్డాన్, ఇరాన్, సౌదీ ఇతర గల్ఫ్‌లో భారతీయ పౌరులు బిక్కుబిక్కుమంటూ వున్నారు. భారత ఆర్థికవ్యవస్థకు గల్ఫ్ ప్రాంతాలనుంచి అత్యధికంగా 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సంపద ప్రవాస భారతీయుల వాణిజ్య సంపన్నతగా తరలి వస్తోంది. సిరియా, యెమెన్, ఖతార్ ఏ ప్రాంతంలో అంతర్యుద్ధాలు తలఎత్తినా, మన దేశం అన్ని ప్రాంతీయ ఆధిపత్యాలతో, యింతవరకు సుహృద్భావంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. సౌదీ అరేబియా, యుఎయి, ఇజ్రాయిల్, ఇరాన్ ఏ దేశమైనా సత్సంబంధాలున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2018లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందాన్నించి అమెరికాను తప్పించటం ఇరాన్‌కు అశనిపాతమైంది. అణు ఒప్పందానికి తిలోదకాలు యిచ్చే అంశాన్ని ట్రంప్ పునరాలోచించవలసిన పరిస్థితి తాజాగా తలఎత్తింది. ఇరాన్‌పై సైనికచర్యలు తీసుకొనే అంశంలో దేశాధ్యక్షుని అధికారాలను పరిమితంచేయాలని అమెరికా చట్టసభ సభ్యులు తీర్మానం ఆమోదించబడింది. అయినా ట్రంప్, ఇరాన్‌పై సైనికచర్యకు బదులుగా, ఆ దేశాన్ని ఆర్థికంగా కృశింపచేయటానికి ఆంక్షలు విధించాలనే ఉత్తర్వులు జారీచేసే యోచన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్‌తోపాటు ఎనిమిది దేశాలకు మినహాయింపులు పొడిగించి, ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న అమెరికా, ఇరాన్ చమురు పరిశ్రమ, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపధ్యంలో మనం దిగుమతి ఆపటంతో చమురుపై వ్యయం, భారం అవుతోంది. ఏదిఏమైనా యుద్ధ సంక్షోభం మార్కెట్‌లను వెంటాడి వేటాడుతుంది.
సిరియా, ఇరాక్‌లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ఆధిపత్యంనుంచి రక్షించిన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ సులేమానీ హత్యతో, అమెరికా శే్వతసౌధం రక్తవర్ణ కళంకితమైంది.
*

- జయసూర్య