సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ బంటు
రాముని బంటు అనగానే గుర్తుకువచ్చేది ఎవరు? ఆంజనేయుడు. ద్వారక దగ్గరలోవున్న ఒక తోటలోకి ఒకసారి మారుతి వెళ్లాడు. ఒక వింత కోతి వచ్చి తోటలో అల్లరి చేస్తున్నదని యాదవులు వెళ్లి కృష్ణునికి చెప్పారు. గరుడునికి తానెంతో బలిష్ఠుడనన్న గర్వం ఉండేది. కృష్ణుడు గరుడుని వెళ్లి ఆ కోతిని అదిలించి రమ్మన్నాడు. గరుడుడు ఏమీ చేయలేకపోయాడు. మొత్తం సైన్యాన్నంతటినీ తీసుకొనిపోయినా ఫలితం లేకపోయింది. గరుడునికి గర్వభంగం జరిగింది. కృష్ణుడు ఆంజనేయుడిని తనవద్దకు రమ్మని ఆదేశం పంపాడు. ఆంజనేయుడు తాను రాముని బంటునని చెప్పి, ఇంకెవరి ఆజ్ఞకూ తల వంచనన్నాడు. అప్పుడు కృష్ణుడు ‘రాముడు రమ్మన్నాడ’ని తిరిగి కబురుపెట్టాడు. ఆంజనేయుడు కృష్ణుని వద్దకు రాగా, రామావతారం ధరించి దర్శనమిచ్చాడు కృష్ణుడు ఆంజనేయునికి. భక్తుని మంకుపట్టుకు కూడా దేవుడు తల వొగ్గుతాడు. అందుకు భక్తే కారణం.
రాముని మనసులో ప్రతిష్ఠించుకొంటే కీర్తి, సంపదా, పూర్ణత్వం తమంతతామే వచ్చి చేరతాయి. హనుమంతుడు ఒక వానరుడు. సీతను వెదికేందుకై రాముడతడిని నియోగించగానే అతని దశమారింది. రాముడే అతని హృదయపీఠంపై వచ్చి కూర్చున్నాడు. అందుకే అతడు చిరంజీవి అయ్యాడు. దీనికంతటికీ కారణం ఏమిటి? హనుమంతుడు రాముని బంటు కావటం. తననుతాను రామునికి భక్తితో సమర్పించుకోడం. రాముని తన హృదయపీఠంపై ప్రతిష్ఠించుకోడం.
భక్త హృదయం
ప్రపంచంలో గొప్పది ఏది?-అని నారదుడిని అడిగితే ‘ఈ భూమి అన్నిటికన్నా పెద్దది’అని జవాబు చెప్పాడట! కాని భూమిపై ఎక్కువగా వుంది నీరే. మిగిలిన భాగాన్ని కూడా ముంచేద్దామని చూస్తుంటుంది నీరు. కనుక నీరే గొప్పకదా అంటే, నారదుడు కూడా సరేనని వొప్పుకోక తప్పలేదు. కాని ఆ నీటి నంతటినీ అగస్త్యుడు పానంచేసేశాడు. ఆయన నీటికన్నా గొప్పే కదా! అవును. అయితే ఆయన యిప్పుడొక తారయై ఆకాశాన వెలుగుతున్నాడు. కనుక ఆకాశం అగస్త్యునికన్నా విస్తృతం కదా! నిజమే. మరి, ఆ ఆకాశం అంతా భగవంతుడైన వామనుడి వొకే ఒక్క అడుగైంది. కనుక భగవంతుడే ఆకాశంకన్నా పెద్ద. ఇక భగవంతుడో? భక్తుని హృదయంలో వుంటాడు. కనుక అన్నిటిలోనూ భక్తుల హృదయాలే గొప్పవని చివరకు నారదుడంగీకరించక తప్పలేదు.
దాస్య భక్తి
భక్తుని సంస్కారాన్నిబట్టి భక్తి అనేకవిధాలుగా వుంటుంది. భీష్మాచార్యులది శాంత భక్తి. యశోదమ్మది వాత్సల్య భక్తి. ఇక గోపికలదో మధురభక్తి!
ఎక్కువమందికి అనుకూలంగా వుండేది దాస్య భక్తి. శాంతభక్తిలోని ప్రపత్తి యిందు లో వుంది. దాస్య భక్తి సర్వస్య శరణాగతికి ప్రతీక.
ముంగిట ఆనందం
ఏ రంగంలో విజయం సాధించాలన్నా కావలసింది భక్తే. భక్తి ఇహం, పరం కూడా యిస్తుంది. భక్తి కక్షలనూ కార్పణ్యాలనూ ఎరగదు. ఏ పనిచేసినా భగవంతుని కార్యంగా భావించి చేయటంలో భక్తుని చిత్తశుద్ధీ, శ్రద్ధాసక్తులూ కనిపిస్తాయి. అందువల్ల అతడుచేసే పనులన్నీ ఎంతో సమర్థవంతంగా నెరవేర్చటం జరుగుతుంది. అశ్రద్ధ ఆ దరికే రాదు. భగవత్కృప లభించటంతో జయం కరతలామలకంగా వుంటుంది. పాడీ, పంటా, ఆరోగ్యం, ఆనందం భక్తుని యింటి ముంగిట నాట్యం చేస్తుంటాయి.
రాధ- ధరా
ధర అంటే భూమి. అదే సృష్టి. అదే ప్రకృతి. ధరకోసం పరితపించండి! ‘్ధర, ధరా’అంటూ జపించండి! జపించగా, జపించగా ‘్ధరా’కాస్త ‘రాధ’ అవుతుంది!
పాండిత్యం పని చేయదు
జనన మరణ పరంపరే సంసారం. ఈ సంసార సాగరాన్ని దాటించే నౌక ఏది? భగవచ్చింతన! నిరంతరం సాధన చేయి! సంసార సముద్రంలో పాండిత్యం పనిచేయదు. భగవద్భక్తి లేకపోతే బుడుంగున మునగటం తథ్యం.
భగవధ్యానమనే తెడ్డు వేసికొంటూ బ్రతుకు నొక నౌకగా మార్చుకొని భవసాగరాన్ని తరించు!
ఇంకా ఉంది