సబ్ ఫీచర్

దీపికా! ఓ దీపికా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపికా పదుకొనే బాలీవుడ్ నటీమణి - ఈమె నటించిన చపక్ అనే చిత్రం 2020 జనవరి రెండవ వారంలో విడుదల అయింది. చిత్రం విడుదలకు ముందు ప్రీపబ్లిసిటీ అని చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పదుకొనే ఒక కొత్త పథకం వేసింది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జనవరి 5వ తేదీనాడు జరిగిన అల్లర్ల సందర్భంగా గాయపడిన వామపక్ష విద్యార్థులకు తన సంఘీభావం ప్రకటించి వచ్చింది. ఈ సంఘటనలో ఆమె ఫొటోలు అన్ని ఛానల్స్‌లోను పత్రికలలోను చూపించారు. అంటే ఆమె ఆశించిన ప్రీరిలీజ్ పబ్లిసిటీ వచ్చినట్లే అయింది. ఐతే ఆమె ఢిల్లీకి రావటాన్ని నిరసిస్తూ కొన్ని ప్రాంతాలల్లో ‘చపక్’ చిత్ర ప్రదర్శనకు అడ్డుకున్నారు. ఇదంతా సంచలనం సృష్టించిన అంశంగా మారింది. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి. దీపికాపదుకొనే ఇలా లోగడ ఎప్పుడైనా దేశభక్తులకు సంఘీభావం ప్రకటించిందా? ఉగ్రవాదుల దాడులలో నలభై మంది వీరజవాన్లు కాశ్మీరులో చనిపోయారు. చత్తీస్‌గఢ్‌లో వందలాది సైనికులు చైనా ప్రేరేపిత ఉగ్రవాదుల చేతిలో హతులైనారు. కేరళలోని కొచ్చిలో ప్రద్యుమ్నన్ అనే వామపక్ష విద్యార్థి నాయకుణ్ణి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు చెందిన విద్యార్థి నాయకులు హత్యచేశారు. అప్పుడు దీపిక ఎక్కడ ఉంది? పోనీ తన ముంబాయిలోనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వందలాది అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నప్పుడు ఈ బాలీవుడ్ నటీనటులు ఎందుకు సంఘీభావం ప్రదర్శించలేదు? అంటే పాకిస్తాన్‌లో తమ సినిమాలు ఆడడానికి అనుకూలమైన ప్రదర్శనలకు మాత్రమే వీరు నాయకత్వం వహిస్తుంటారని అనుభవం నిరూపించింది.
నిజానికి బాలీవుడ్ నిర్వహణకు కావలసిన భారీ ఆర్థిక సహాయం పాకిస్తాన్‌కు చెందిన అధోజగత్ సహోదరులు అందిస్తున్నారు. వీరినే అండర్‌గ్రౌండ్ డాన్‌లు అంటారు. ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీం ప్రభృతుల భారీ పెట్టుబడులతో వీరు హవాలా వ్యాపారం కింద షెల్ కంపెనీల రూపంలో చిత్రపరిశ్రమను ఉపయోగించుకుంటున్నారు. అందుకు ఆనాటి మందాకిని నుండి ఈనాటి ప్రముఖ నటీనటులవరకు ఎవరూ తీసిపోరు. వీరికి దేశభక్తితో సంబంధం లేదు. ఉగ్రవాద ముప్పును అరికట్టాలనే కోరికా లేదు. సామాన్య పౌరుల సామాజిక సమస్యలను పట్టించుకోరు. తాము-తమ విలాస జీవితం మధ్యమధ్య చిలకపలుకుల్లా ‘‘లౌకిక వాదం’’ (సెక్యులరిజం) సమసమాజం (సోషలిజం) వంటి పదాలను పలుకుతూ ఉంటారు. అక్కడి నేటి ఖాన్‌త్రయం నుండి నాటి దిలీప్‌కుమార్ వరకు అంతా పాకిస్తాన్‌కు అనుగుణంగా ప్రవర్తించిన వారే! 1965లో ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు దిలీప్‌కుమార్ బహిరంగంగా పాకిస్తాన్‌ను సమర్ధిస్తూ మాట్లాడటం బహుశా ఈతరం వారికి తెలిసి ఉండదు.
‘హింసమీద మాకు పేటెంటు హక్కు ఉంది’ అని సామ్యవాద విద్యార్థులు భావిస్తున్నారు. అంటే బెంగాల్‌లో, కేరళలో దశాబ్దాలుగా వారు ఎందరో దేశభక్తులను హత్యచేశారు. 2020 జనవరి 5వ తేదీనాడు న్యూఢిల్లీ జె.ఎన్.యు.లో జరిగిన విద్యార్థుల పోరాటంలో కొందరు వామపక్ష విద్యార్థులు కూడా గాయపడ్డారు. పదిహేను మంది ఎబివిపి అనే విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు గాయపడ్డారు. దీపికా పడ్కునే కేవలం వామపక్ష విద్యార్థులకు మాత్రమే ఎందుకు సంఘీభావం ప్రకటించి వచ్చింది?? విశ్వవిద్యాలయాలు విద్యాభ్యాస కేంద్రాలు అయినప్పుడు నేరం ఎవరుచేసినా ఖండింప వలసిందే. కాని సెలక్టివ్‌గా ఈ పడుకునేలు, కన్నయకుమార్‌లు, ఏచూరి సీతారామయ్యలు కేవలం వామపక్ష విద్యార్థులకు గాయాలు తగిలినప్పుడు మాత్రమే ఓదార్పు యాత్రలు ఎందుకు చేస్తున్నారు? ఇది ఏకపక్ష పక్ష(వా) పాతం-కాదా?? హవాలా వ్యాపారం, ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ బాలీవుడ్‌లో సర్వసాధారణం. ప్రజల అజ్ఞానాన్ని వ్యాపారపు ముడిసరుకుగా మార్చుకొని వీరు మనోరంజనం పేరుతో దోపిడీ చేస్తుంటారు. టాలీవుడ్‌లో కూడా ఈ ‘నన్ను దోచుకుందువటే’ గాంగులు ఉన్నాయి. వీరికి మనం సామాజిక గౌరవం ఎందుకు ఇవ్వాలి? ఈ కుక్షింభరులను పోషించటంకోసం రిక్షాకార్మికులు తమ జేబులకు ఎందుకు చిల్లుపొడుచుకోవాలి?? ఈ నేరప్రవృత్తిని గత డెబ్బది సంవత్సరాలుగా వెనుకటి ప్రభుత్వాలు పాముకు పాలుపోసి పోషించినట్లు పెంచి పెద్దచేశాయి. కనీసం 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ దుర్మార్గులను అరికట్ట లేకపోవటం శోచనీయం.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్