సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్ఫూర్తిగా మననం
ఈనాడు భగవంతుణ్ణి చింతిస్తున్నాం. స్మరిస్తున్నాం. శ్లోకాలు ఉచ్ఛరిస్తున్నాం. పాటలు పాడుతున్నాం. భజనలు చేస్తున్నాము. కాని భగవంతుని అనుగ్రహమునుమాత్రం పొందలేకపోతున్నాము. కారణమేమిటి?
ఒక పర్యాయం విక్రమాదిత్యుడు మారువేషములో తన రాజ్య పరిస్థితులను తెలుసుకోవాలని పర్యటిస్తున్నాడు. ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ గుట్టలుగుట్టలు భస్మం కనిపించింది. లోనికివెళ్ళాడు. ‘స్వామీజీ! మీరు చేస్తున్నది ఏమిటి?’అని అడిగాడు రాజు. అప్పుడు ఆ ఋషి ‘అరవై సంవత్సరాలుగా యజ్ఞం చేస్తున్నాను, సమిధలు వేస్తున్నాను, డబ్బాలకు డబ్బాలు నెయ్యి పోస్తున్నాను. బండ్లకొద్దీ గంధపు కట్టెలను కాలుస్తున్నాను. దాని ఫలితమే ఈ భస్మము. గుట్టలుగా తయారయింది అని చెప్పాడు. అప్పుడు ఈ రాజు ‘మీరు భగవంతుని అనుగ్రహమునకు పాత్రులైనారా?’అని అడిగాడు. ‘అదే నా ఆవేదన, ఒక్కనాడైనా భగవంతుడు నాకు దర్శనమివ్వలేదు. స్వప్నములోనైనా కనిపించలేదు’అని బాధతో చెప్పాడు ఆ ఋషి.
విక్రమాదిత్యుని మనస్సు కరిగింది. ఆ ఆశ్రమం లోపలనే కూర్చొని, చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాజు ‘నాకేమి అక్కరలేదు. కాని నా రాజ్యంలోనున్న ఈ ఋషి అరవై సంవత్సరముల నుండి యజ్ఞంచేస్తున్నాడు. ఇతనికి ఎందుకు మీరు దర్శనం యివ్వలేదు? అతనికి ఎందుకు మీరు అనుగ్రహమును ప్రసాదించలేదు? అనడిగాడు రాజు. ఫక్కున నవ్వాడు పరమాత్ముడు- ‘రాజా! యజ్ఞంచేయటం చూస్తున్నావు. ప్రక్కన భస్మం గుట్టలను చూస్తున్నావు. నేను భావ ప్రియుడనే కాని బాహ్యప్రియుడను కాదు. ఎంతమందికి సమారాధన చేస్తున్నావు? ఎంతమందికి భోజనం పెట్టావు? ఎంతమందికి గుడ్డలిచ్చావు? ఆ లెఖ్ఖలు నాకక్కరలేదు! ఆ చిట్టాలన్నీ ఆదాయం పన్ను వారి కిచ్చుకో. నాకు కావల్సింది భావమే. భావశుద్ధితో చేసినటువంటివాడే నాకు పరమభక్తుడు. అటువంటి పరమభక్తులకు నేను దాసానుదాసుడను.’
ఏ విధంగా పాడుతుంటాం మనం. ‘దాసాను దాసుడను కావలెనురా! దాసులకు సేవనే చేయలేనురా!’ -అని. కాని ఈ బ్రాహ్మణుడు నిరంతరమూ కేవలం మంత్రములను ఉచ్ఛరిస్తున్నాడు. మంత్రాల పైననే లక్ష్యము పెట్టుకుంటున్నాడు కాని మాధవుని పైన లక్ష్యములేదు. ఇది కేవలం గ్రామఫోన్ ప్లేటులాగే ఉంటున్నది. టేప్ రికార్డరు మాదిరి ఉంటున్నది. టేప్ రికార్డరుకు ఎంత ఫలితమో దీనికీ అంతే ఫలితం. మనసు నాపైనపెట్టి ఒక్క తూరి ‘మాధవా! అని పిలుస్తేచాలు, వెంటనే పలుకుతా’నన్నాడు భగవంతుడు.
ఆత్మ వంచన
నాముందు ఒకటి, వెనుక మరొకటి. ఇది భక్తి అనిపించుకోదు. కేవలం ఇది కపటమే అనిపించుకుంటుంది. ఇది తననుతాను ఛీట్(మోసం) చేసుకోవటమే. నన్ను ఛీట్ చేయువారు ఎవరూలేరు, నాకు ఎవరూ ద్వేషులు లేరు. నేను ఎవరికీ ద్వేషిని కాను. అయితే కొందరు నాక్కూడ ద్వేషం ఉందీ అనుకోవచ్చును అది నిజానికి మీ ద్వేషమే కాని నా ద్వేషం కాదు. దైవత్వం లోపల ఏవిధమైన మాలిన్యమూ ఉండదు. అక్కడ వున్నది పవిత్రమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన హృదయం.
సుదర్శనం
భీష్ముడు అతి భీషణంగా యుద్ధంచేస్తుంటే, అర్జునుడు తాళలేకపోతున్నాడు. అది చూసి కృష్ణుడు రథంమీద నుండి దూకి చక్రాన్ని ధరించి ‘నేడు భీష్ముని జంపుడు. నిన్నుగాతు!’ అంటూ అర్జునునికి అభయమిచ్చి భీష్మునిపైకి దూకాడు. అప్పుడర్జునుడు ఆయన కాళ్లపై బడి ‘‘నీవు ఆయుధం పట్టనన్నావు. నాకోసం నీ ప్రతిజ్ఞను వదలకు. నేను చనిపోయినా ఫరవాలేదు’, అని ప్రార్థించాడు. అదీ అర్జునుని భక్తి!
భీష్ముడు ఏమన్నా తక్కువ తిన్నాడా? తనమీదికి వస్తున్న కృష్ణుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేయనే లేదు. తననుతాను రక్షించుకోవాలని అనుకోలేదు. ‘ఇదేమి పని, కృష్ణా?’-అని ప్రశ్నించనూ లేదు. ‘సుదర్శన చక్రధారియై చనుదెంచు దేవుండు దిక్కు నాకు!’అంటూ ప్రస్తుతించాడు. తనను చంపేందుకు వచ్చేవాడు తనకు దిక్కట! ఎంత చిత్రం! సు’అంటే మంచి, ‘దర్శనం’అంటే చూడటం. మంచిని చూడటమే సుదర్శనం. శ్రీకృష్ణుని సుందర రూపం కన్న సుదర్శనం మరొకటేముంటుంది? అందుకే ‘సుదర్శనం’(చక్రం) చూసి భయపడలేదు. భీష్ముడు సుదర్శనాన్ని (కృష్ణుని దివ్యమోహన విగ్రహాన్ని) దర్శించి తన్మయత్వం చెందాడు.

ఇంకా ఉంది