సబ్ ఫీచర్

జోరుమీదున్న మున్సిపల్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు, 13 నగర పాలక సంస్థలకి ఎన్నికల ఘంటారావం మోగిన దగ్గర నుంచి అభ్యర్థుల హడావుడికి అంతు లేకుండా పోతోంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అండదండలతో ఎన్నికల్లో పోటీచేస్తున్న నాయకులు తమ అదృష్టా లను పరీక్షించుకోవటానికి వారి శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు.
మహాత్మగాంధీగారు కలలు కన్న ఆరోగ్యకరమైన పోటీ ద్వారా నిజమైన ప్రజానాయకులను ఎన్నుకొని రామరాజ్య స్థాపనకు గ్రామీణస్థాయి నుంచి ప్రారంభించాలి అనే ఆశయానికి తిలోదకాలు ఇచ్చే పరిణామాలు సమాజంలో నేడు కనపడుతున్నాయి.
ఇదివరకు ఎలక్షన్‌లలో ప్రచారానికి తాము నిర్వహించబోయే సంక్షేమ పథకాల వివరాలు ప్రకటించటానికి చాలా తక్కువ సొమ్ము ఖర్చుచేసేవారు. అసలు కొంతమంది ప్రజాసేవకులు ఎన్నికలలో నామినేషన్ వేసి వచ్చి ఇంట్లో కూర్చుంటే అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించేవారు. ఇది అంతా నిస్వార్థ ప్రజాసేవకులు ప్రజల సంక్షేమం పట్ల నిరంతరంగా చేస్తున్న కృషే కారణం.
ఇప్పుడు రోజులు మారాయి. ఒక అభ్యర్థి మున్సిపల్ ఎన్నికలలో ఏదైనా జాతీయ పార్టీ టిక్కెట్ల కొరకు బి.్ఫరమ్ కావాలి అంటే దాదాపు 20 నుంచి 40 లక్షల వరకు ఖర్చుచెయ్యాలి అని సమాజంలో అనుకుంటున్నారు. అదే ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయితే అరకోటి దాకా దాటుతుంది అని విశే్లషకుల అంచనా. ఇతర ప్రచార ఖర్చులతో బహుమతుల రూపేణా కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. డబ్బును పంచినంత మాత్రాన ఓట్లు వారికే వేస్తారు అని గ్యారంటీ కూడా లేదు.
మున్సిపాలిటీలలోని నగర పాలక సంస్థలలో వార్డుల సంఖ్య ఎక్కువై ఒక్కొక్క అభ్యర్థి భవిష్యత్తు 2,000 నుంచి 3,000 వోటర్లు చేతుల్లో వినితమై పోటీయొక్క తీవ్రత చాలా హెచ్చుగా కనపడుతున్నది. దీనివలన అభ్యర్థులపై వత్తిడి పెరిగి, ఎలాగైనా గెలుపొందాలి అనే తెగువ, మొండిపట్టుతో తమ ఆస్తులను అమ్ముకొని ఎన్నికల జూదంలో పెడుతున్నారు. ఇంతటి ప్రచారం, ఆర్భాటం, పటాటోపం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి.. ఇది చాలా విచారించదగ్గ పరిణామం. పదిమంది అభ్యర్థులు నిలబడ్డా గెలిచేది ఒక్కరే కదా.. మిగిలిన తొమ్మిది మంది తమ విలువైన ఆస్తులను అన్యాయంగా పోగొట్టుకొని భార్యాబిడ్డలతో రోడ్డుపై నిలబడే పరిస్థితులు వస్తాయి. కొంతమంది అవమానభారంతో ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశాలూ ఉన్నాయి. అందుకని అభ్యర్థులందరూ సంయమనం పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత మా అధికార పార్టీ విధానాలే మమ్మల్ని గెలిపించాయి.. అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే ప్రజలు మాకు మద్దతు తెలిపారు అని ఎవరి లెక్కలు వారు చెప్పుకొని తృప్తిపడడమూ సహజమే. స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు అధికార పక్షంలో చేరడం అంతకన్నా సహజమే..
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రజలకు కావలసిన అభివృద్ధి పథకాలకు కావలసిన నిధులు సమకూరాలి అంటే మెజారిటీ అభ్యర్థుల వెంటే ఉండాలి. అదే ప్రజాస్వామ్యంలోని అతి ముఖ్యమైన ప్రక్రియ. అనవసరంగా ప్రలోభాలకు, అధికార కాంక్షలకులోనై ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబడి తమ సర్వస్వాలను పోగొట్టుకొంటున్నారు.
ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తమకు నిజంగా ఎవరు సేవ చేస్తారో వారికే అధికారాన్ని కట్టబెట్టి నాయకున్ని చేస్తారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. గడిచిన 70 సంవత్సరాలలో ఇదే విషయం రూఢి అయినది.
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలోని అభ్యర్థులలో దాదాపు 60% మంది యువకులు పోటీ చేస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. మాజీ రాష్టప్రతి భారతరత్న డా. అబ్దుల్‌కలామ్ కోరిన విధంగా ఉత్సాహవంతులైన యువకులు ఎక్కువమంది రాజకీయాలలో ప్రవేశించి ప్రజలకు సేవచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఆదర్శప్రాయంగా నిలపాలి.

- జనశ్రీ 8297263741