సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పితృ భక్తి
అగమ్యమైన అంతర్భూతమైన భగవంతుని ప్రార్థిస్తున్నాం. మొదట తల్లిదండ్రులను పూజించాలి, వారి ఆజ్ఞలను శిరసావహించాలి. జనక మహారాజు కొలువులోనున్న శివధనుస్సును రాముడు విరిచాడు. జనకుడు వచ్చి శివధనుస్సును విరిచిన వీరునికి తన కుమార్తె అయిన సీతను యిచ్చి వివాహము చేయుదునని ప్రతిజ్ఞచేసానని, కనుక సీతను వివాహం చేసుకోమని ప్రాధేయపడ్డాడు. విశ్వామిత్రుడు కూడా చెప్పాడు. కాని రాముడు అంగీకరించలేదు. నా తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా సీతవైపు కూడా చూడను అని చెప్పాడు రాముడు. అంతేకాదు, అరణ్యవాసం చేస్తుండగా భరతుడు వచ్చి ఎంత బ్రతిమాలినా అయోధ్యకు తిరిగి వెళ్లడానికి రాముడు అంగీకరించక- పిత్రాజ్ఞ ప్రకారం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసిందేనని ఖచ్చితంగా చెప్పాడు. అందువలననే శ్రీరామునికి పితృవాక్య పరిపాలకుడని పేరువచ్చింది. నైతిక విలువలు చాలా ప్రధానమైనటువంటివి. మన నీతి, మన జాతి, మన జ్యోతి అవే! ఆ జీవనజ్యోతి తత్త్వాన్ని మనం చక్కగా గుర్తించటానికి ప్రయత్నించాలి.
ధర్మమూలం...
‘ధనమూల మిదం జగత్’-అనుకుంటారు అంతా. కాని, ‘ధర్మమూల మిదం జగత్’ (ఈ ప్రపంచం ధర్మమూలం). ఈ సంగతిని గ్రహిస్తే నీవు సంతోషంగా వుంటావు. ధైర్యంగా వుంటావు. లేకపోతే ధైర్యం వుండదు. ఎప్పుడూ భయమే. శాంతి వుండదు.
ధర్మం చెప్పే మొదటి పాఠం- ‘తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపు’అని. ఈ ప్రపంచంలోకి నిన్ను తీసుకొని వచ్చింది వారే. ఆ కృతజ్ఞత నీకుండాలి. దురదృష్టవశాత్తు, ఈరోజుల్లో తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ తగ్గింది. తల్లిదండ్రుల యెడల, గురువుల యెడల, పెద్దల యెడల భక్తి, శ్రద్ధ కలిగి వుండాలి. కాని అలా జరగటల్లేదు. అందుకే ధర్మం క్షీణిస్తూ వుంది.
ప్రథమ సోపానం
వజ్రాలూ, రత్నాలూ దాచుకోటానికి యినప్పెట్టే కావాలి. ప్రేమ, విశ్వాసం, వివేచన వంటి సద్గుణాలు కూడా అనర్ఘరత్నాలే! అవి దాచుకొనే యినప్పెట్టే శరీరం! ఆ యినప్పెట్టెను యిచ్చినవారు తల్లిదండ్రులు, వారిని త్రికరణశుద్ధిగా గౌరవించాలి.
ఇహంలో తండ్రి మాట మన్నించని వారిని పరలోకపిత ఎలా అనుగ్రహిస్తాడు? ధర్మానికి మొదటి మెట్టు కృతజ్ఞత. చేసిన మేలు మరవకుండా వుండటం. కనుక పిల్లల విధులలో మొదటి మెట్టు తల్లిదండ్రుల పట్ల భక్తి, ప్రేమ. మొదటి మెట్టును దాటకుండా మేడెక్కటం సాధ్యంకాదు.
గృహమే దివ్యసీమ
ప్రతివ్యక్తీ ఒక దేవాలయమే. దైవస్వరూపాలనన్నిటినీ పెంచిపోషించే పెద్ద దేవాలయం యిల్లు. గృహం అన్న ఆలయంలో ప్రధాన పూజారి తల్లి. వినయం అన్న ధూపంతో ఇల్లంతా గుబాళింపజేయి. భక్తి అన్న దీపానికి ప్రేమయే చమురు. విశ్వాసమే వత్తి. ఆ దీపాన్ని వెలిగించు ఇల్లంతా జ్ఞానప్రకాశాన్ని నింపు. నీ జీవితాన్ని అటువంటి ఇంటిలో వుంటూ సేవకూ, ప్రేమకూ అంకితం చేయి.
త్యాగమూర్తి
తల్లి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తన ప్రాణాన్నయినా ఒడ్డి బిడ్డను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంది. త్యాగానికి ప్రతీక ‘స్ర్తి’. కనుకనే స్ర్తికి ‘త్యాగమూర్తి’అని పేరువచ్చింది. స్ర్తిలో ఉండినటువంటి త్యాగము పురుషులలో కనిపించదు.
వాల్మీకి స్ర్తిని ‘్భక్తిస్వరూపిణి’అన్నాడు. పురుషుణ్ణి ‘జ్ఞాన స్వరూపుడు’అని అన్నాడు. ‘జ్ఞాని’ అనేటటువంటి పురుషునికి భగవంతుని స్థానం లోపల కేవలం దర్బారు హాల్ వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అంతకంటే లోపలకు ప్రవేశించటానికి అతనికి అధికారం లేదు. కాని ఈ భక్తి అనేటటువంటి స్ర్తి అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చును. కనుక ‘్భక్తి’కి అంత స్వతంత్రముంటుందన్నమాట.
తల్లిదండ్రులు
నిన్నూ నీ తెలివితేటలను పెంచిందీ, ప్రేమగా పోషించిందీ నీ తల్లిదండ్రులే. వారికి కృతజ్ఞత చూపటం నీ విధి. నీవు నీ సృష్టికర్తలైన తల్లిదండ్రులను పూజించలేకపోతే, విశ్వసృష్టికర్త అయిన భగవంతుని ఎలా పూజించగలుగుతావు?
భగవద్విభూతిని వారిలో దర్శించు. దేవుని పూజకు వారిని అర్చామూర్తులుగా స్వీకరించు. నీకు ప్రపంచంలో మొట్టమొదట తటస్థపడినవారు వారే! ప్రేమ, వాత్సల్యం మూర్త్భీవించిన పెద్దలు వారే! వారిముందు తలవంచి, భగవంతుని ముందు మోకరిలటం నేర్చుకో!
రామతత్వం
రామతత్వం ఎవరికెరుక? అది ఒక్క రాముడే ఎరుగు.
మహాఅయితే, రాముని కటాక్షవీక్షణానికి నోచుకోవచ్చు. అదీ ఎంతో గాఢ భక్తి వుంటే! ఆయనను గురించి మనసారా ఆలోచించండి! ఆయనను నోరారా పిలవండి! ఆయన ఏ రూపంలో వచ్చినా ఆయన కాంతిమతత్వం మీకిట్టే తెలిసిపోతుంది. వేణువునూదే గోపాలబాలుడూ ఆయనే! దయ, కరుణ, ప్రేమల సంగమం ఆయన!
ఇంకా ఉంది