సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశువుతో సమానం
పెద్దలను గౌరవించని, తల్లిదండ్రులను ప్రేమించని, గురువులను విశ్వసించని మానవ జీవితం ఒక జీవితమా? బాల్యములో బంధువులను, కౌమారములో గురువులను, వనంలో పెద్దలన, వార్థక్యంలో ఋషులను సంతోషపెట్టలేని మానవ జీవితం కేవలం ఒక పశుజీవితమనే చెప్పవచ్చును.
తారక నామం
తల్లీ, తండ్రీ అంటే మీకు ఏమాత్రం భక్తివున్నా రామనామం మిమ్మల్ని రక్షిస్తుంది.
రామనామం జపించినా, లిఖించినా రామతత్వాన్ని మననంచేస్తూనే ఆ పని చేయండి! రామ స్వరూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించండి! మీ మనసుకు ఇది పని కల్పిస్తుంది. పవిత్రంగా వుంచుతుంది.
రామనవమినాడు, రాముని పుట్టినరోజు పండుగనాడు ధర్మస్వరూపుడైన రాముని ఆత్మారామునిగా ఆరాధించండి! తరించండి!
పరస్పర ఆకర్షణ
బృందావనంలో కృష్ణుని వేణుగానం విని గోప బాలురు మైమరచేవారు. ఆ సంగతే ప్రస్తావిస్తూ నారదుడొకసారి కృష్ణుడిని యిలా అడిగాడు. ‘వాళ్లు నీ వెంట బడుతున్నారా? నీవు వాళ్ల వెంటబడుతున్నావా? దేవునివైపు భక్తుడు ఆకర్షించబడుతున్నాడా? భక్తునివైపు దేవుడు ఆకర్షించబడుతున్నాడా? దానికి కృష్ణుడు చెప్పిన జవాబు యిది: ‘నాకూ, నా భక్తులకూ మధ్య ‘నేను’, ‘వాళ్లు’అంటూ తేడా లేదు. ఒక బట్టపై ఒక చిత్రం రచించారనుకో, ఆ బట్టనుండి చిత్రాన్ని ఎలా వేరుచేస్తావు? ఆ గోప బాలుర హృదయాలపై నా రూపం అలా ముద్రితమైంది. రెంటినీ విడదీయటం అసాధ్యం.
మీ హృదయాలపై భగవాన్ అలా ముద్రితుడై వున్నాడేమో ఆలోచించుకోండి. విడదీయలేనట్లుగా ఆ పరమాత్మునితో మీ ఆత్మను పెనవేసుకొని పోనీయండి! అంతా ఆనందమే అవుతుంది. మీకు నే చెప్పేది ఇదే!
శ్రీరామనవమి ఎప్పుడు?
రామునికోసం రామదాసు అనేక కష్టాలకు గురయ్యాడు. జైలు పాలయినాడు. కొరడాదెబ్బలు తిన్నాడు. అలాటి పరిస్థితిలో కూడ ఆయన రాముని మరువలేదు. ‘రామా! నీ దయ రాదా!’అని అతి దీనంగా ప్రార్థించాడు. తన జీవతత్వాన్ని రామతత్వంగా మార్చుకోగలిగిన భక్త శిఖామణి రామదాసు. ఏనాడు నీవు సత్యమార్గంలో ప్రవర్తిస్తూ నీ జీవతత్వాన్ని రామతత్వంగా మార్చుకోకలుగుతావో ఆనాడే నీకు నిజంగా శ్రీరామనవమి.
‘బురఖా’ భక్తి
భక్తి అనుభవించవలసినదే కాని ప్రదర్శించేది కాదు. అనేకమంది యాత్రలకు వెళ్లే సమయంలో, పెద్దల దర్శనానికి వెళ్లే సమయంలో భక్తి అనే బురఖా ధరిస్తుంటారు. తిరిగి ఇంటికి చేరగానే ఆధ్యాత్మిక చింతనకు, పాపం, వారికి సమయమే చిక్కదు. ఇట్టి బ్రతుకు రామార్పితం కాదు. రాగార్పితం!
రెక్కలపై ఆధారం
పక్షి కొమ్మపై కూచొని వుంది. పెద్దగా గాలి వీస్తూ వున్నది. పక్షికి కొమ్మపై నమ్మకం లేదు. అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు. పక్షికి తన రెక్కలపైనే విశ్వాసం!
శ్రద్ధ, భక్తి అనే రెండు బలమైన రెక్కలను సంపాదించుకో, నీ రెక్కల బలంపై నువ్వూ ఆధారపడి వుండవచ్చు. నీవు ప్రస్తుతం కూర్చొని వున్న ప్రాపంచిక విషయాలనే కొమ్మ ఏ క్షణాన విరిగిపోతుందో ఏమిటో! ఎప్పటికైనా నీ సొంత రెక్కలే నీకు ఆధారం! అది గ్రహించు.
సూర్య భగవానుడు
సూర్య భగవానుడు జగత్సేవకుడు. ఉదయానే్న మీ వాకిటి ముందు నిలుచుంటాడు. తలుపులు మూసి వుంటే, చొరవ తీసుకొని తట్టడు. మీ అంతటమీరు తెరిచేదాకా వేచి వుంటాడు. తలుపు తెరవగానే వచ్చి గదిని ప్రకాశమానం చేస్తాడు.
పరమాత్ముడూ అంతే. మీ హృదయ కవాటాలు తెరవటంకోసం బయట సేవకునివలె సదా వేచి వుంటాడు. తలుపులు తెరవగానే లోనికి వచ్చి జీవితాన్ని తన దివ్యానుగ్రహంతో ప్రకాశమానం చేస్తాడు.
నీదే ఆలస్యం!
విశ్వస యోగం
నరుడే నారాయణుడు
నరుడు అంటే ఎవరు? మనిషి. ‘రః’అంటే నాశనం. ‘న’అంటే లేనిది. ‘నర’అంటే నాశనం లేనిది అని అర్ధం. దేవునివలెనే జీవుడు కూడా అచ్యుతుడే (చ్యుతి అంటే నాశనం: అచ్యుతుడు- నాశనం లేనివాడు). నరుడు అంటే నశించేవాడు అనే అపనమ్మకంలో మనిషి పడటం దయనీయం. నశ్వరమైన (నశించే) దేహమే తాననుకోవటంవల్లనే రుూ అపనమ్మకం కలుగుతున్నది. నరుడు మానవుడయితే నారాయణుడు మాధవుడు. నరుడు పంచభూతాలకు ప్రతీక. పంచభూతాలు భగవత్సంకల్పం చేతనే జనించాయి. నరుడే నారాయణుడు అన్న భావన మన శాస్తవ్రాక్యాలలో ఇమిడి వుంది.
ఇంకా ఉంది