సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోక పట్టణం
సాధనలోగాని, సంసారంలోగాని ‘ఏ పనీ బాగా ఆలోచించి గాని చేయకూడదు. అది నీ మేలుకేనన్న విశ్వాసం నీకు కలిగినప్పుడే దానిని ఆచరించాలి. లేకపోతే శోక పట్టణం గతే పడుతుంది.
ఒకసారి రాణీగారి చెలికత్తె ఒకతె ఏడుస్తూ వచ్చింది. పాపం, దానిని చూసి రాణీగారికి కంటివెంట నీళ్లు వచ్చాయి. అది చూసి జనానా అంతా ఏడవటం మొదలెట్టింది. ఏడుపు కాపలా భటులక్కూడా సోకింది. రాజుగారు కూడా భార్య విచారం చూసి తాను దుఃఖించటం మొదలుపెట్టాడు. రాజుగారు ఏడుస్తున్నారని తెలిసి పట్టణంలో అంతా ఏడవటం మొదలుపెట్టాడు. చివరకు ఎవడో ఒకడు అసలు ఈ ఏడుపుకు కారణం ఏమిటి? అని విచారణ ప్రారంభించాడు. ఒకరితర్వాత ఒకరిని అడగ్గా చివరకు రాణీగారు తన చెలికత్తె దుఃఖం చూసి తాను దుఃఖపడ్డానంది.
చివరకు ఆ చెలికత్తె చెప్పిందేమిటి? ఆమె రజక కులస్తురాలు. వాళ్ల గాడిదే చనిపోతే ఆమెకు ఏడుపొచ్చింది. అదీ సంగతి! అందుకే కారణం తెలుసుకో, మంచీచెడు వివేచన చేయి. తొందరపడి ఎవరి మాటలూ విని ఏదో చేసి తర్వాత పస్తాయించకు.
ఉనికికి సవాల్
వేదాంతం మనిషిని పిరికివాణ్ణి చేస్తుందని కొందరు చెబుతుంటారు. అది తప్పు. వేదాంతం సింహగర్జన వంటిది. దానివల్ల ధైర్యం, చొరవ కలుగుతాయి. మనిషి వేదాంతంవల్ల పిరికివాడు కాదు, యోధుడవుతాడు. వేదాంతం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దృఢమైన కవచంలాగా పనిచేస్తుంది. విషయ వాసనలనే వడగళ్ల వానల దెబ్బనుండి కాపాడే గొడుగదే! చింత అనే దోమలనుండి రక్షించే దోమతెర కూడా అదే. వేదాంత దృష్టికారణంగా నీవు వ్యామోహాలనే అలల తాకిడిని తట్టుకోగల బండవలె స్థిరంగా వుండగలుగుతావు. నీ ఉత్సాహానికీ, ఉనికికీ అది ఒక సవాల్!
పురుష ప్రయత్నం
పురుష ప్రయత్నం, భగవత్కృప రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. పురుష ప్రయత్నం లేకుండా కృప వర్షించదు. కృప లేకుండా పురుష ప్రయత్నం ఫలించదు. భగవత్కృపను పొందాలంటే, నీకు విశ్వాసం, సచ్ఛీలం ఉంటే చాలు. ఆయన కృపకోసం ఆయనను స్తుతి చేయనక్కరలేదు.
అంతరార్థం
రాముడు, కృష్ణుడు వంటి అవతారాల అంతరార్థం తెలుసుకో. అప్పుడు నీలో దైవంపట్ల విశ్వాసం బలపడుతుంది. బాహ్యమైన ఘటనలూ, ఘర్షణల గందరగోళంలో పడి నీ దారి తప్పకు. భార్యను ఎవరో ఎత్తుకొని పోతే రక్షించుకోటానికి యుద్ధంచేసిన యోధుడుగా మాత్రమే రాముణ్ణి ఎంచకు. అంతరార్ధాన్ని గ్రహించినప్పుడు మాత్రమే నీవు ఆ దివ్యానుభూతిని పొందగలుగుతావు. అంతర్దృష్టి అనేది ఆత్మదర్శనానికి మన దేశంలో మహర్షులు రూపొందించిన విధానం. ప్రపంచమంతటిలో భారతదేశానికి ఉన్నతస్థానం సంపాదించి పెట్టిన ఆధ్యాత్మిక విధానం ఇది.
ప్రహ్లాద భక్తి
సంసార సాగరాన్ని తరించాలంటే నిష్ఠానియమం ఉండాలి. ప్రహ్లాదుని భక్తిచూడు! ఎన్నిరకాల చిత్రహింసలకు గురయినా అతడు కొంచెం కూడా చలించలేదు. అటువంటి దీక్షా, పట్టుదల, విశ్వాసం, భక్తి అలవరచుకోవాలి.
అంతా వేస్ట్!
ఒకానొక సమయంలో కాశీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. అతనికి ఒక నాస్తిక స్నేహితుడుండేవాడు. ఒకనాడు అతను ఆ ప్రొఫెసర్‌తో ‘ఏమిటి సార్! మీరు దినానికి పూజ పేరుతో పిచ్చిగా ఒక గంట వేస్ట్ చేస్తున్నారు. పూజలు చేయటం, హారతులివ్వటం అంతా వేస్ట్!’ అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ ‘అయ్యా! దైవప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదు’అన్నాడు. ‘నాకు దైవమున్నాడని నమ్మకం లేదు’అన్నాడు నాస్తికుడు. అప్పుడు ఆ ప్రొఫెసర్‌కు కొంచెం కష్టం కలిగింది. ‘అయ్యా! దైవమే లేకపోతే నాకు దినానికి గంటమాత్రమే వేస్ట్ అయిపోతుంది. కాని నిజంగా దైవమే ఉంటే, నీకు జీవితమే వేస్టు అయిపోతుంది. నా ఒక్క గంటకే నీవు విచారిస్తున్నావు గానీ, నీ జీవితమంతా వేస్టు అవుతుందని విచారించటం లేదు’ అన్నాడు.
మరపెవరికి?
‘అయ్యో! దేవుడా! నన్ను మరచిపోయావా!’ - అని ఒక భక్తుడు ఆక్రోశిస్తున్నాడు. మరచిపోయింది ఎవరు? దేవుడా? కాదు; తను! తాను భగవంతుని బిడ్డనన్న సంగతి తనకే గుర్తులేదు. భగవంతునికి మరపా! అసంభవం!
భగవంతుడు నీ నేస్తం. నీ సారథి. ఆయన సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. దయాసముద్రుడు. భగవంతునిలో సర్వదా విశ్వాసం వుంచాలి. ఎన్ని కష్టనష్టాలు కలిగినా చలించరాదు.
ఋజువు కావాల్నా?
అవతారం ఏ పనిమీద వచ్చిందో దానికి తగిన రూపాన్ని భగవంతుడు ధరిస్తాడు.బందిపోట్లను పట్టుకోడానికి పోలీసులు బందిపోటులా మారువేషం ధరించి వెళ్లాల్సి వుంటుంది. అందుకే భగవాన్ మనుష్యరూపంతో వచ్చాడు. ఇంట్లో పెళ్లాలకు జవాబు చెప్పలేనివారు కూడా భగవంతుడవతరించాడనటానికి ఋజువులేమిటి అనడుగుతున్నారు. నిజంగా నీకు తెలుసుకోవాలని వుంటే రా! ఏం జరుగుతున్నదో చూడు. నీవే ప్రత్యక్షంగా చూసి, తెలుసుకో. విశ్వసించు. పుట్టక తర్వాత పుటక- ఎన్ని జన్మలెత్తావు? విదూషక పాత్రలూ, బిచ్చగాళ్ల పాత్రలూ వేసివేసి విసుగువేయటం లేదా? కనీసం ఈ జన్మలోనైనా ఏదైనా మంచి పాత్ర దొరుకుతుందేమో ప్రయత్నించి చూడు!

ఇంకా ఉంది