సబ్ ఫీచర్

మహామనీషి మహాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా ఏళ్ల క్రితం ఒక పెద్ద ఓడ ఇంగ్లాండ్ వైపు ప్రయాణిస్తుంది. అప్పట్లో ఇంగ్లాండ్ చాలా పెద్ద దేశం. ఆ దేశ పాలనలోనే భారతదేశం కూడా ఉంది. ఆ ఓడలో ఎందరో ప్రయాణీకులున్నారు. అందరూ ధనవంతులే ఉన్నారు. అదే ఓడలో ఒక బళ్ల ముందు కూర్చుని ప్రపంచం పట్టనట్లుగా ఏదో రాస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి చక్కని తేజస్సులో ఉన్నా అతని దుస్తులు మాత్రం విలక్షణంగా ఉండి సామాన్య వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఓడ ప్రయాణీకుల్లో ఒక ఐరోపా వ్యక్తి ఉన్నాడు. అతనికి ఆ సామాన్య వ్యక్తిని చూడగానే చులకన భావన కలిగింది. అతన్ని అవమానించాలనుకున్నాడు. వెంటనే కొన్ని కాగితాలు తీసుకుని మనసుకి బాధ కలిగించే అనేక తిట్లు, చివాట్లు కాగితాల మీద రాశాడు. కాగితాలను ఒక గుండుసూదికి గుచ్చి సామాన్యుడికి అందించాడు. విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన వదులుకో. కాగితాల మీద రాసినది చదువు. నీకు ఉపయోగపడతాయి’’ అని చెప్పి దూరంగా వెళ్లి నిల్చున్నాడు. సామాన్య వ్యక్తి ఆ కాగితాలను చదివేసి ఒక చెత్తబుట్టలో పడేశాడు. గుండుసూదిని మాత్రం తీసుకొచ్చి ఐరోపా యువకుడి దగ్గరకెళ్లి ‘‘నువ్వు చెప్పినట్లే చేశాను. నాకు ఉపయోగపడేది ఈ గుండుసూది మాత్రమే. దీనిని ఉపయోగించుకుంటాను’’ అన్నాడు నవ్వుతూ. ఐరోపా యువకుడు విస్తుపోయాడు. అతను సామాన్యంగా కనిపిస్తున్న అసామాన్యుడు అనుకున్నాడు. వెంటనే సామాన్య వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. అలా ఐరోపా యువకుడిలో మార్పు తెచ్చిన వ్యక్తే మన జాతిపిత ‘మహాత్మాగాంధీ’.
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమట దారిని చూపిన గాంధీజీ పిల్లలకు గాంధీ తాతగా, పెద్దలకు బాపూజీగా ప్రపంచం మొత్తం చేత మహాత్ముడిగా పిలుచుకున్న మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని రాజకోట సంస్థానానికి చెందిన పోరుబందర్‌లో 1869 అక్టోబర్ 2న కరమ్‌చంద్ ఉత్తమ్ చంద్ గాంధీ, పుతలీభాయ్ దంపతుల ఇంట భారతమాత ముద్దు బిడ్డగా జన్మించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన గాంధీ తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించాలని, పేదవారికి సహాయం చేయాలని, వాటిని అభివృద్ధి పరచాలని, అంటరానితనం తొలగించాలని అనుకునేవాడు. అందుకే గాంధీజీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే అరుదైన స్థానాన్ని సంపాదించుకొన్న మహామనిషి, యుగపురుషుడు బాపూజీగా వినుతికెక్కారు. గాంధీజీ తండ్రి పోరుబందర్ సంస్థానంలో జవాన్‌గా పనిచేసేవారు. ప్రాథమిక విద్య రాజ్‌కోటలో, ఉన్నత విద్య గజియాబాగ్‌లో కొనసాగింది. గాంధీజీకి 13వ ఏట కస్తూరిభాయితో వివాహం జరిగింది.
గాంధీజీ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై తన 17వ ఏట లండన్ వెళ్లాడు బారిస్టర్ చదవడానికి. చదువును విజయవంతంగా పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. తరువాత ముంబాయి, దక్షిణ వాడలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1893లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అయితే అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొని ఎన్నో చేదు అనుభవాలని చవిచూశారు. అయినా పట్టుదలతో కష్టించి పనిచేసి సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకొని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలోనే అక్కడ ఉండే భారతీయుల ‘హక్కుల’ కోసం అలుపెరుగని పోరాటం చేశారు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకొని శే్వత జాతీయుల దురహంకారాన్ని ఎదిరించే జాతి భేదాన్ని తొలగించే దిశగా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. అక్కడే ఓ చక్కటి ఆశ్రమాన్ని కూడా స్థాపించి ఆదర్శవంతమైన విద్యాబోధనని ప్రవేశపెట్టారు. 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన ఎన్నో అనుభవాలని చవిచూశారు. 1916లో ఫిబ్రవరి 4న కాశీలో హిందూ విశ్వవిద్యాలయంలో గాంధీజీ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగానికి అబ్బురపడి రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీని ‘మహాత్మా’ అని సంబోధిస్తూ ప్రసంగించాడు. అప్పటి నుండి గాంధీజీ ‘మహాత్మాగాంధీ’గా వినుతికెక్కారు. అలాగే భారతీయులలో స్వేచ్ఛాస్వాతంత్య్రాల మీద ప్రేమ ఉన్న బాలగంగాధర్ తిలక్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వంటి వారు కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. అప్పుడే లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూని తొలిసారిగా కలుసుకున్నారు. గాంధీజీ ఆదర్శవాదం, గుణశీలమైన, నిర్ణయాత్మకమైన, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం అందర్నీ ఎంతగానో ఆకట్టుకొంది. అదే సంవత్సరంలో అహ్మదాబాద్ కార్మికులు తమ వేతనాలు పెంచమని సమ్మె చేయగా, గాంధీజీ సత్యాగ్రహం చేపట్టి కార్మికుల వేతనాలను 35 శాతం పెంచేటట్లు కృషి చేశారు. స్థానికులు చేసిన సత్యాగ్రహ ప్రయోగాల్లో విజయాలు సాధించిన తర్వాత గాంధీజీ తన దృష్టి, జాతీయ సమస్యలపై మళ్లించారు.
గాంధీజీ ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మన దేశం ఉప్పును తయారుచేయరాదని, విదేశీయులు తయారు చేసిన ఉప్పునే వాడాలని, మన దేశం ఉప్పుని తయారుచేస్తే దానిపై పన్నులు విధించింది. అలాగే భారతీయులు వాడుతున్న విదేశీ వస్త్రాల వల్ల ఏడాదికి 60 కోట్ల రూపాయల వరకు ధనం మన దేశం నుండి తరలిపోతుండేది. ఈ రెండు విషయాలపై శ్రద్ధ వహించి గాంధీజీ ఉద్యమం నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహం పిలుపును ఆలకించి లక్షల మంది ప్రజలు గాంధీజీని అనుసరించారు.
భారతీయులలో రగులుతున్న స్వాతంత్య్ర కాంక్షను అణచి వేయడానికి 1918లో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా, 1919లో జలియన్ వాలాబాగ్ ఉదంతానికి ఒడికట్టినా ప్రజల్లో ఐక్యత, దేశభక్తి పెరిగాయ. ఇదంతా గాంధీ నాయకత్వ విజయమే. చివరకు 1947 ఆగస్టు 15వ తేదీనాడు ఇంగ్లీషు వారు భారతదేశాన్ని కాంగ్రెస్ ఆధీనం చేసి వెళ్లిపోయారు. వెడుతూ వెడుతూ ముస్లింలను విడదీసి కొంత భాగం వారికి అప్పజెప్పి పాకిస్తాన్ పేరుతో ముస్లింల పాలన కింద ఉంచారు. దాంతో విభజన తర్వాత హిందూ, ముస్లింల మధ్య కలహాలు పెరిగాయి. ఈ కలహాలు మహాత్ముని బాధించాయి. ఒక్క తల్లి బిడ్డలైన రెండు జాతుల వారు కలహాలు వదిలేయమని మహాత్ముడు బోధించారు. మహాత్ముని మాటలను తప్పుగా అర్థం చేసుకొని ద్వేషం పెంచుకొన్న ‘‘నాధూరాం గాడ్సె’’ అనే యువకుడు 1948 జనవరి 30న మహాత్మా ప్రార్థనా మందిరంలో ఉండగా కాల్పులు జరిపాడు. ‘హేరామ్’ అంటూ దేవుని నామం స్మరిస్తూ మహాత్ముడు ప్రాణాలు వదిలాడు. సత్యం, అహింస అనే ఆయుధాలతో భారతీయులను స్వాతంత్య్ర సమరయోధులుగా తయారుచేసి రవి అస్తమించని బ్రిటీష్ పాలకులకి పడమర దారిని చూపిన ఈ మహామనిషి, మానవతామూర్తి, స్వేచ్ఛ భానుడి ప్రభాత నాంది అయిన మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం మనం చిత్తశుద్ధితో కృషిచేయాలి. అదే మనం మహాత్మునికి ఇచ్చే ఘన నివాళి.

-పింగళి భాగ్యలక్ష్మి, 9398163836