సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజ్ఞానయోగం
భారతదేశం ఒక పెద్ద ఆధ్యాత్మిక గని. ఇక్కడే దర్శనాలు, ఉపనిషత్తులు, గీత, వేదాలు వెలిశాయి. వీటిని చక్కగా, శుద్ధంగా ప్రచురించి, ఆసక్తిగల పాఠకులకు ప్రపంచవ్యాప్తంగా అందించాలి. మనకు అనాదియైన ఋషి పరంపర వుంది. వారి జీవితాలూ, సందేశాలూ మనకు అమూల్య వారసత్వ సంపదగా లభించాయి. విస్తారమైన ఆ ఆధ్యాత్మిక క్షేత్రంలో నీవు ఏ మూల తవ్వినా నీకు అపార అమూల్య ఆధ్యాత్మిక సంపదలు లభ్యం అవుతాయి.
స్థిత ప్రజ్ఞుడు
అంతటా ఆ పరమాత్మనే దర్శించండి! అప్పుడే నిజమైన స్నేహం వికసిస్తుంది.
భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పినది చూడండి!
‘అద్వేష్టా సర్వ భూతానాం
మైత్రః కరుణ ఏవచ
నిర్మమో నిరహంకారః
సమదుఃఖ స్సుఖక్షమీ’
సర్వభూతాల ఎడల ద్వేషంలేకుండా, అందరి ఎడలా స్నేహం, కరుణ కలిగీ, అందరినీ సమంగాభావిస్తూ, క్షమ కలిగి వుండటం అనే లక్షణాలను పెంపొందించుకోవాలి! అట్టివారే నాకు కావలసినవారు, నాకు యిష్టులు!
గాన మార్గమే జ్ఞానమార్గం
‘జీవితం ఒక గీతం. దానిని గానంచేయి’! - కృష్ణుడు ఆచరించి చూపిన ఆదర్శం ఇది.
అక్షౌహిణులకొద్దీ సైన్యం కురుక్షేత్రంలో నిలుచొని వుంది. బీభత్సంగా యుద్ధం జరగబోతోంది. లక్షలాది సైన్యం తమ కంఠాలను కత్తుల కెరజేయటానికైనా తయారుగా వున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య విషాద, వైరాగ్యమూర్తి అయిన అర్జునుడు ఒక అద్భుత గీతాన్ని విన్నాడు. అదే గీత! (గీత అంటే పాట అన్న అర్థం వుంది.)
నందకుమారుడు ఆనందరూపుడు. ఆయన గోకులంలో ఆడుతూపాడుతూనే గడిపాడు. బృందావనాన్ని వేణుగానంతో మైమరపించాడు.
ఆఖరుకు యుద్ధరంగంలో యిరుపక్షాల మధ్య నిలిచికూడా ఆయన ‘గీత’నే ఆలపించాడు.
‘గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరః’ గీతను చక్కగా గానంచేయాలి. ఇతర శాస్త్రాలెందుకు? అని మహాభారతం (్భష్మపర్వం) చెబుతోంది.
‘గేయం గీతానామసహస్రం’అని అంటూ గీతను, (విష్ణుసహస్ర) నామాలనూ పాడుకోవాలి అని ఆదిశంకరులు అన్నారు.
గీత
గీత అంటే ఏమిటి? లైను! గీత నీ జనన, మరణ పరంపరకు అడ్డు గీత గీస్తుంది. మోక్షాన్ని ప్రదానంచేస్తుంది. నిటారుగా, నిర్భయంగా, సూటిగా గీచిన గీటుప్రకారం ధర్మమార్గంలో వెళ్లేందుకు దోహదం చేస్తుంది.
గీతోపదేశం
నీ అనుభవం వృధాకాదు. నీకది పాఠాన్ని నేర్పుతుంది. నీ ఆలోచనలనూ, అలవాట్లనూ మార్చగలదు. విషయాలను విశదీకరిస్తుంది. నీ ధోరణులను మారుస్తుంది. అందుకే గీతను అందరూ చదవాలి. గీతను చదవటం ఈత నేర్చుకోవటం లాంటిది. సంసార సాగరంలో మునిగిపోకుండా నిన్నది కాపాడుతుంది. కృష్ణావతారం వచ్చినదే గీతోపదేశం కోసం.
గురువు చూపిన బాటలో...
ఎక్కడ ధర్మంవుంటే కృష్ణుడక్కడ వుంటాడు. మీలో ప్రతివ్యక్తీ ఆలోచించుకోవాలి- ‘ఆయన దయకు మనం అర్హులమేనా’- అని.
మీరు గుడికి వెళ్లినా, మన సెక్కడో వుంటే ఫలితం ఏమిటి? మిమ్మల్ని మీరే కోరికలతో కట్టివేసుకొంటున్నారు. మీరు శత్రువులు మరెవ్వరో కాదు. మీరే! మీకుమీరే మిత్రులు కూడ!
గురువు మీకు దారిమాత్రమే చూపిస్తాడు. కాని, ఆ బాటవెంట సాగిపోవాల్సింది ఆయనకాదు, మీరే! ఆ యాత్రలో మీవెంట ఎవరూ రారు. అయినా భయంలేదు. సంకోచం అక్కరలేదు.
ధర్మోరక్షతి రక్షితః
మనకెప్పుడూ ఏవో సమస్యలూ, సందేహాలూ కలుగుతూనే వుంటాయి. భగవద్గీతను చదువుతే, మన సందేహాలకు మనమే జవాబులు వెతుక్కోగలం.
భగవద్గీత చిత్తనిరోధం (మనసును అదుపులో వుంచుకోవడం) నేర్పుతుంది. నిజమైన జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. భగవంతుని అద్భుత విభూతులను దర్శింపచేస్తుంది. భగవంతునిపై మీకుండే విశ్వాసాన్ని దృఢతరం చేస్తుంది. గీతను వల్లెవేయటం కాదు, వంటబట్టించుకోవాలి.
మీ సంగతే చూడండి! మీరు కాసేపు ‘నాదేమీలేదు. అంతా బాబా చేశాడు. నేనుత్త నిమిత్తమాత్రుణ్ణి’అంటారు. ఏం లాభం? మరుక్షణం, ఆ నోటితోనే ‘నేనిది చేశా, అది చేశా! స్వామి నాకిది చేయాలా!, అది చేయాలా!’ అంటారు!
ఒక్కటి గుర్తుంచుకోండి! ధర్మోరక్షతి రక్షితః మీరు ధర్మం తప్పకండి! దైవకృప మీయందుంటుంది!
ఇంకా ఉంది