సబ్ ఫీచర్

ప్లాస్టిక్.. అద్భుతమా? అనర్థమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటిదాకా సముద్రంలో ఎంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు డంప్ అయ్యాయంటే వీటిలో 2 లక్షల 69వేల టన్నుల వ్యర్థాలు సముద్రంపై తేలియాడుతూ ఉన్నాయి. సముద్రపు అట్టడుగున ప్రతి చదరపు కిలోమీటరుకు 4వందల కోట్ల మైక్రోఫైబర్ పదార్థాలు పేరుకుని ఉన్నాయని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాపారస్థుల ద్వారా ప్రతియేటా 5 లక్షల టన్నుల క్యారీ బ్యాగులు వినియోగదారులకు చేరుతున్నాయి. ఇవన్నీ ఒకసారి వాడి పారేసేవే.. అంటే సగటున ప్రతి నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల క్యారీ బ్యాగులు వినిమయం అవుతున్నాయి. అనగా ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 150 క్యారీ బ్యాగులు వాడి పారేస్తున్నాడు. ఈ సంఖ్య ముందు ముందు ఇంకా పెరగనుంది కూడా..
1. ఇప్పటిదాకా వ్యర్థాలుగా ఎన్ని క్యారీ బ్యాగులు పారవేయబడ్డాయంటే వాటన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి పేరిస్తే అవి 4,200 పొరలుగా భూగోళం మొత్తాన్ని కమ్మేస్తాయి.
2. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రతి ఏటా లక్ష వరకు సాగర జీవాలు, 10 లక్షల సముద్ర పక్షులు మృత్యువాత పడుతున్నాయి.
3. ప్లాస్టిక్ ప్రకృతిలో గాని, మన శరీరాల్లోగానీ సహజంగా కలిసిపోదు. అందువల్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఎన్నో జంతువులు చనిపోవడానికి కారణం అవుతున్నాయి. ప్లాస్టిక్ బ్యాగులను తిని చనిపోయిన జంతువుల కళేబరాలు సహజంగా భూమిలో కలిసిపోయినా, వాటి కడుపులో పేరుకున్న ఆ బ్యాగులు మాత్రం అలాగే ఉండిపోతాయి. ఇవి మరో జంతువుకు ప్రాణహాని కలిగించవచ్చు.
4. మురికి కాలవలో ప్లాస్టిక్ బ్యాగులు పేరుకుపోవడం వల్ల 1988, 1998లలో బంగ్లాదేశ్‌లో సంభవించిన వరదలు వివిధ ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది.
5. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రతి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడకంపైన 15 సెంట్ల పన్ను విధించింది. ఫలితంగా ఏడాది తిరిగేలోపు ఆ దేశంలో క్యారీ బ్యాగుల వాడకం 90 శాతం పడిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రతి క్యారీ బ్యాగు వినియోగంపై 22 సెంట్ల పన్ను ఉంది.
6. సముద్రంలో పేరుకుపోతున్న మానవకారక వ్యర్థాలలో ప్రథమ స్థానం ప్లాస్టిక్ వ్యర్థాలదే. సాగర జలాలలో ప్రతి చదరపు మైలుకు 46వేల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని ఒక అంచనా.
7. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగా శిథిలమైనప్పటికీ చివరికి అవి మైక్రో లేదా నానో ప్లాస్టిక్ వ్యర్థాలుగా లేదా విష రసాయనాలుగా భూమిలో మిగిలిపోతాయే తప్ప ప్రకృతిలో సహజంగా కలిసిపోవు ఎన్ని సంవత్సరాలైనా.
8. ఒక టన్ను బరువున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను రీసైకిల్ చేయాలంటే 4వేల అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. కానీ అంతే బరువున్న వాడేసిన ప్లాస్టిక్ కవర్లను తూకానికి అమ్మితే 32 అమెరికన్ డాలర్లే ధర పలుకుతుంది. కాబట్టి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తిని నిలిపివేయడమే తగిన పరిష్కారం కాగలదు.
9. ఒక కుటుంబం నాలుగుసార్లు షాపింగ్‌కి వెళ్తే 60 వరకు క్యారీ బ్యాగులు వెంట తెచ్చుకుంటున్నారు. ఫలితంగా ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 13-15 వేల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో డంప్ అవుతున్నాయి.
10. సముద్రంలో పెద్ద ఎత్తున డంప్ అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మూడింట రెండు వంతుల సాగర జీవాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి.
11. ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున డంప్ చేయబడుతూ ఉండటంవల్ల సాగర జలాలు అమితంగా ఆలీకరణకు గురవుతున్నాయి. ఇప్పటికే శాస్తవ్రేత్తలు సముద్రాలలో 200 ప్రాంతాలను ‘‘డెడ్ జోన్’’లుగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో ఏ ప్రాణీ మనుగడ సాగించలేదు.
ఒక్క ఆస్ట్రేలియాలో..
1. ప్రతియేటా 360 కోట్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినిమయవౌతున్నాయి.
2. ప్రతి యేటా 36వేల 7 వందల టన్నుల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వ్యర్థాలుగా బహిరంగ ప్రదేశాల్లో డంప్ అవుతున్నాయి. అంటే సగటున ప్రతి నిమిషానికి 4వేల లేదా ప్రతి గంటకు 2 లక్షల 30వేల క్యారీ బ్యాగుల వ్యర్థాలుగా డంప్ అవుతున్నాయి.
3. వ్యర్థాలుగా డంప్ అవుతున్న క్యారీ బ్యాగులలో 10శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. దానికోసం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి 40 లక్షల డాలర్లు ఖర్చవుతుంది.
4. ఆస్ట్రేలియాలో ప్రతి కుటుంబం వారానికి ఒక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడటం తగ్గిస్తే ఆ దేశంలో ఏడాదికి 25 కోట్ల 30 లక్షల క్యారీ బ్యాగుల వాడకం తగ్గుతుంది.
5. కేవలం ఒక్క శాతం క్యారీ బ్యాగులే తిరిగి వినియోగింపబడుతున్నాయి.
ప్లాస్టిక్ సీసాలలో నీళ్ళ గురించి
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు స్వచ్ఛమైన త్రాగునీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరోప్రక్క ఒక్క ఆస్ట్రేలియాలోనే బాటిల్డ్ వాటర్ కోసం ఎంత ఖర్చు అవుతోందో చూద్దాం.
1. ఆస్ట్రేలియా ప్రజలు ఏడాదికి 50కోట్ల డాలర్లు మంచినీళ్ళ సీసాలకే ఖర్చుపెడతారు.
2. ప్రతియేటా ఆస్ట్రేలియాలో 6వేల కోట్ల లీటర్ల బాటిల్డ్ వాటర్ ఉత్పత్తి అవుతుంది.
3. ఒక లీటర్ కుళాయి నీళ్ళకన్నా ఒక లీటర్ బాటిల్డ్ వాటర్ ఉత్పత్తి చేసే కర్మాగారం నుండి ఎన్నో విషవాయువులు ఉత్పత్తి అవుతాయి. అంటే ప్రతి యేటా ఆస్ట్రేలియా ప్రజల త్రాగునీటిని ఉత్పత్తి చేయడంవల్ల 60 వేల టన్నుల విషవాయువులు వెలువడుతున్నాయి. ఇది 13 వేల కార్లు ఏడాది పాటు నడపడం వల్ల వెలువడే విష వాయువుల పరిమాణానికి సమానం.
4. ఆస్ట్రేలియాలో 36 శాతం మాత్రమే ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్ అవుతాయి. మిగతావన్నీ వ్యర్థాలుగా డంప్ చేయబడతాయి.
5. ఆస్ట్రేలియాలో ప్రతి యేటా మంచినీళ్ళ వ్యాపారానికి ఎన్ని ప్లాస్టిక్ సీసాలు తయారౌతున్నాయో తెలుసా? సుమారు 15వేల 2వందల టన్నుల బరువు తూగేంత. పరిశ్రమలలో ఒక టన్ను బరువున్న ప్లాస్టిక్ సీసాలు తయారుచేసినప్పుడు 3 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అంటే ఒక్క ఆస్ట్రేలియాలో మంచినీళ్ళ సీసాల ఉత్పత్తివల్ల 46 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతోంది. ఇక ఈ సీసాలను వివిధ ప్రాంతాలకు రవాణా చేసే వాహనాల నుండి, వాటిని భద్రపరచే రిఫ్రిజరేటర్ల నుండి ఇంకెంత కార్బన్ డయాక్సైడ్ వెలువడుతోందో!
6. ఇక ఈ ప్లాస్టిక్ సీసాలను ఉత్పత్తి చేయడానికి ఆస్ట్రేలియాలో ఏడాదికి 525 లక్షల లీటర్ల చమురు అవసరవౌతుంది. ఇక వీటిని రవాణా చెయ్యడానికి వినిమయమయ్యే చమురు లెక్క వేరే విషయం.
అమెరికాలో వ్యర్థాల విసర్జన
ఎన్విరానె్మంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే సంస్థ అమెరికాలో వ్యర్థపదార్థాల డంపింగ్ గురించి అధ్యయనం చేసింది. పట్టణాలలో నివసించే ప్రతి అమెరికా పౌరుడు సగటున ఏడాదికి ఎంత పరిమాణంలో వ్యర్థపదార్థాలను బయట పారేస్తున్నాడో తన అధ్యయన వివరాలలో పేర్కొంది. ఆ వివరాలు పట్టికలో ఇవ్వబడ్డాయి.
తెలిపిన వివరాలు అమెరికాలో సగటున ఒక వ్యక్తి కారణంగా ఏడాదిలో వెలువడుతున్న వ్యర్థాల గురించి తెలుపుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయో ఆలోచించాలంటేనే భయం వేస్తుంది. ఏ ప్రభుత్వాలో, సంస్థలో మాత్రమే కాదు; మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నప్పుడే కాలుష్య నివారణ దిశగా కొంత ప్రయత్నమైనా జరుగుతుంది.
*
కేటగిరీ వ్యర్థ పదార్థాలు బరువు (కిలోలలో)
ప్రింట్ మెటీరియల్ న్యూస్ పేపర్స్, వాణిజ్య ప్రకటనలు, పుస్తకాలు, 62.31
పత్రికలూ, ఆఫీస్ పేపర్స్, ఉత్తరాలు మొదలైనవి
పేపర్ మెటీరియల్ టిష్యూ పేపర్స్, ప్లేట్లు, కప్పులు మొదలైనవి 25.25
ప్యాకేజి మెటీరియల్ అట్టపెట్టెలు, సేఫ్టీ ప్యాకేజి, పేపర్ బోర్డులు, 108.87
సంచులు, బుట్టలు మొదలైనవి.
గాజు వస్తువులు గ్లాసులు, సాఫ్ట్‌డ్రింక్ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్, 33.16
జగ్గులు మొదలైనవి.
అల్యూమినియం అల్యూమినియం డబ్బాలు మొదలైనవి 8.97
వస్తువులు
లోహ వస్తువులు ఇనుప వస్తువులు, తగరపు వస్తువులు, స్టీలు 53.88
వస్తువులు మొదలైనవి.
ప్లాస్టిక్ వస్తువులు ప్లేట్లు, కప్పులు, సంచులు, సీసాలు, మగ్గులు, 88.77
బాల్చీలు, కంటైనర్స్, ప్యాకింగ్ సామగ్రి మొదలైనవి.
రబ్బరు వస్తువులు టైర్లు మొదలైనవి 18.69
వస్తమ్రులు, తోలు బట్టలు, ఇతర వస్తమ్రులు, పాదరక్షలు, ఇతర తోలు 02.90
పదార్థాలు
ఆహారం ఆహార పదార్థాలు 99.43
కలప కలప సామగ్రి 384.39
ఇతరములు --- 42.31
మొత్తం 928.93
*

- ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్, 8008264690