సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతా రత్నం
నీవు రోజూ భగవద్గీతను చదవాలి. ఎన్నో కొన్ని శ్లోకాలు చదువు. వాటి అర్ధాన్ని మననం చేయి. నీ హృదయంలో మ్రోగే వౌనరాగాలలో ఆ శ్లోకం బోధించే పరమార్థం నీకవగతమవుతుంది. విస్తారంగా వ్యాఖ్యానాలు చదవవలసిన అవసరం లేదు. గీతలో ప్రతి పదం ఒక రత్నం. ఆ రత్నాలను ధరించేవారికి ముక్కుకు, చెవులకు, మెడకు వేరే రత్నాల ఆభరణాలు ఎందుకు?
గీతా శ్లోకాలనే రత్నాలను నీ హృదయంలో దాచుకో. నీ ఆలోచనలనూ, పనులనూ అవి స్ఫూర్తినిస్తాయి. నీ భావికి అవి చక్కని బాటవేస్తాయి.
అర్థం- అంతరార్థం
బ్రహ్మ జన్మించిన పద్మం బురదలో పుట్టింది కాదు. సూర్యుని చూడగానే వికసించేదీ కాదు. అది హృదయ పుష్పం. దానికి పత్రాలు అనేకం. ఒక్కొక్క పత్రం వ్యక్తి మనసును ఒక్కొక్క వేపు లాగేస్తుంటుంది.
శివుని వాహనం నంది(వృషభం). అది మామూలుగా ఆ పేరుతో మనం చూస్తున్న జంతువు(ఎద్దు)కాదు. ధర్మానికి ప్రతీక. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ-అన్న నాలుగూ దాని నాలుగు కాళ్లు.
గోపాలుడు గోవులను మేపాడా? ‘గో’అన్న పేరుతో పిలవబడే జీవులను పోషించి రక్షించాడు. ఈ విధంగా పురాణ గాథలలోని అర్థాన్నికాదు, అంతరార్థాన్ని గ్రహించాలి.
అర్థం తెలియని ఆచారం
ప్రతి పండుగకి మన ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకుంటున్నాము. ఎందుచేత? పూర్వం ఇంటి ముఖ ద్వారాలు చిన్నవిగా ఉండేవి. గాలి లోపలికి చాల తక్కువగా వచ్చేది. అందుచేత లోపలి గాలిని ఫ్రెష్‌గా ఉంచాలని, ఆక్సిజన్‌ను లోనికి పంపించాలని సూక్ష్మక్రిములను పోగొట్టాలనీ మామిడి ఆకులను అప్పటికప్పుడు కోసి తెచ్చి తోరణాలుగా కట్టేవారు. కాని, ఇదంతా చాదస్తం అనుకొని ఈనాటివాళ్ళు గుమ్మాలకి ప్లాస్టిక్ ఆకుల తోరణాలు కట్టి సంవత్సరాల తరబడి అలానే ఉంచేస్తారు. ప్రయోజన ఏమిటి?
హారతి
లోగడ గర్భగుడి చాల చిన్నగా ఉండటం చేత ప్రమిదె వెలుగులో భగవంతుని ఆకారం స్పష్టంగా కనిపించేది కాదు. అందుకని హారతి ఇచ్చేటప్పుడు ఆ దేవతామూర్తి అంగాంగాలు స్పష్టంగా కనిపించేటట్లుగా హారతిని దగ్గరగా తీసుకొని వెళ్లేవారు. కాని ఇప్పుడు విద్యుత్సౌకర్యం ఏర్పడింది. గర్భగుడిలో ఎంతో వెలుతురు ఉన్నాసరే, అర్ధాన్ని మరచి ఆచారాన్ని పట్టుకుని హారతిని భగవంతుని ప్రతిమకు సమీపంగా తీసుకువెడుతున్నారు. ఇలాగే గుడ్డిగా ఎన్నో అర్ధంలేని ఆచారాలను పట్టుకొని మనవాళ్లు వేళ్లాడుతున్నారు.
జ్ఞానాగ్ని
జలం మెరకనుండి పల్లానికి జారుతుంది. అగ్నిజ్వాల అలాకాదు. నేలనుండి నింగికెగుస్తుంది. అందుకే ‘జ్ఞానాగ్ని’ అనటం!
మనిషిపడే పాట్లకన్నిటికీ కారణం ఒకటే. ఆశ! ఆకలిమాత్రం ఆకాశమంత! కాని, మింగేందుకు గొంతుమాత్రం కేవలం సూది బెజ్జమంత!
మనిషి మనస్సును విశాలం చేసుకోవాలి! అందుకు శాంతి, సాధన అవసరం. సమదృష్టి, స్థైర్యం వుంటేనే, అచ్చమైన ఆనందం లభిస్తుంది.
జ్ఞానఫలం
శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన అందరినీ ఆకర్షిస్తాడు. ఎందుకు? అందువల్ల ఆయన కొరిగేదేమీ వుండదు. ఆ లీల భక్తులకోసమే. వారి మనసులో రేకెత్తే చెడు ఆలోచనలను ఆయన కలుపుతీసినట్లు ఏరివేస్తాడు. వారి మనసులను దుక్కిదున్నినట్లు దున్ని, ప్రేమ బీజాలను నాటుతాడు. జ్ఞాన ఫలాలను పండిస్తాడు. జ్ఞాన సాఫల్యమూ ఆయనే!
నీవు జ్ఞానివి అవుతావు
మనిషి పుడుతూనే మాయనూ, దాని పరికరం మనసునూ వెంట తెచ్చుకుంటున్నాడు. మనసేం చేస్తున్నది? రాగద్వేషాలతో సతమతవౌతున్నది. రాగం రజోగుణంవల్ల కలుగుతుంది. దానిని భగవత్పరంచేసి ముక్తికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు. నారదుడు రజోగుణాన్ని మనోనిశ్చలత సాధించటానికి వాడాడు. ద్వేషం తమోగుణ సంబంధం. దుర్వాసుడు అంబరీషునిపై కోపించటానికి తమస్సే కారణం. రాగద్వేషాలు లేకుండా మనస్సు వ్యవహరించటం కష్టం. ఈ రెంటినీ వదిలించుకోగలిగితే మాయ తొలగిపోతుంది. నీవు జ్ఞానివవుతావు.
కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు
వేదాంతసాధన మూడు విధాలని వేదవిదులు చెబుతుంటారు.
మొదటిది కర్మయోగం. ఇందులో మనిషి ఏదో ఒక వ్యాపకంలో మునిగివుంటాడు. ఈ అంశకు అధిపతి వాసుదేవుడు.
రెండవది భక్తియోగం రుద్రుడు అధిదేవత. ఈ ఘట్టంలో భక్తి, శ్రద్ధలతో దేవుని పూజించటం జరుగుతుంది. ఇందులో ప్రేమ ప్రభావం హెచ్చుగా వుంటుంది.
మూడవది జ్ఞానయోగం. ఇందులో జ్ఞానప్రకాశం ఎక్కువ ఆదిత్యుడు దీనికి అధిదేవత.

ఇంకా ఉంది