సబ్ ఫీచర్

సూధి కోసం సోదికెళితే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే.. రెండు రెండు విభిన్న వక్తిత్వాలు, విశ్వాసాలు గల ఇద్దరు వ్యక్తుల మధ్య పొంతన, పోలిక కుదరదు. అలాంటిది రెండు విభిన్న రాజకీయ పార్టీల మధ్య పోలిక తీసురావడం సరికాదు. అందుకే కావచ్చు కయ్యానికి అయినా వియ్యానికి అయినా సమ ఉజ్జీ ఉండాలని అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కాంగ్రెస్ సమ ఉజ్జీ కాదు.. ప్రధాని నరేంద్ర మోదీకీ, రాహుల్ గాంధీకీ పోలికే లేదు. ఆ మాటకొస్తే దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ, రాజకీయ కూటమి కూడా ‘ప్రస్తుతానికి’ బీజేపీ, ఎన్డీఏలకు సమ ఉజ్జీ కాదు. ఆరు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. నిన్న మొన్న ఇండియాటుడే పత్రిక నిర్వహించిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వే కూడా మరోమారు అదే స్పష్టం చేసింది.
సరే, ఆ విషయాన్ని అలా ఉంచి అసలు విషయంలోకి వస్తే, లోక్‌సభ ఎన్నికల అనంతరం, రెండు ప్రధాన జాతీయ పార్టీలలో సంస్థాగత మార్పులు చోటు చేసుకు న్నాయి. కారణాలు, వేరు కావచ్చు కానీ, రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సుమారు, ఐదున్నర సంవత్సరాల పాటు పార్టీని విజయపథంలో నడిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, 2019 ఎన్నికల అనంతరం కేంద్ర హోం మంత్రిగా బాధ్య తలు చేపట్టిన కారణంగా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్నికల ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
ఇద్దరు నాయకులు, రెండు పార్టీల మధ్య పోలిక అంతేనా అంటే, కాదు.. అమిత షా స్థానంలో జేపీనడ్డా ముందు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, ఆ తర్వాత పూర్తి స్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు చేపటిన నడ్డా ఆరు నెలల తిరగకుండానే మొన్న జనవరి 20న పార్టీ పూర్తి స్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. నిజం.. అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మాములు విషయం కాదు. ఎంతో పోటీ ఉంటుంది. ఎంతో రాజకీయం ఉంటుంది. కానీ నడ్డా బాధ్యతలు చేపట్టడం సాదాసీదా వ్యవహారంగా సాగిపోయింది. అలకలు లేవు, కొట్టుకోవడాలు, తిట్టుకోవ డాలు లేవు. నిందలు లేవు. సంజాయిషీలు, బుజ్జగింపులు అసలే లేవు. నిజానికి నడ్డా విషయంలోనే కాదు, 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి బీజేపీకి సారథ్యం వహించిన 11మంది అధ్యక్షులలో ఏ ఒక్కరి విషయంలో, ఏ సందర్భంలోనూ వివాదాలు, చొక్కాలు చించుకోవడాలు వంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అయన రాజీనామాను అంగీకరించేందుకే, రెండో మూడో నెలలు పట్టింది. లోక్ సభలో పార్టీ బలాన్ని, 2014 నాటి 44 నుంచి, 2019 నాటికి మెట్లు ఎక్కించి 52కు చేర్చగల సమర్థ నాయకుడు మరొకరు లేకనో ఏమో కాంగ్రెస్ నాయకులు ఆయన కాళ్ళావేళ్ళా పడ్డారు. ఆయనే లేకుంటే పార్టీకి మనుగడే ఉండదన్నంతగా ఆయనే్న పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగించేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు అమ్మ సోనియా గాంధీ, ‘తాత్కాలిక ట్యాగ్’ తో మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టారు. అదొక కథ, అందరికీ తెలిసిన కథ. అంతేకాదు, ఈ కథ అయిపోలేదు. చూడాల్సింది చాలా ఉంది.. చెప్పాల్సింది మిగిలే ఉంది, అన్నట్టుగా, ఇప్పడు కొత్తగా మళ్ళీ మరో మారు రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పుడు, ఆరు నెలల క్రితం అంతగా పట్టుపట్టి పార్టీ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేశారో ఏమో గానీ, ఇప్పుడు మాత్రం పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేందుకు ఒకవిధంగా రాహుల్ గాంధీ తహతహలాడిపోతున్నారు. అందుకే కావచ్చు, ఇప్పుడు సీఏఏకి వ్యతిరేకంగా చిందులు వేస్తు న్నారు. ఊరు పేరు లేని, ఇంకా అడుగైనా వేయని ఎన్నార్సీకి వ్యతిరేకంగా వీరంగం వేస్తున్నారు. చివరకు పదేళ్లకు ఒకసారి చట్ట నిర్దేశం ప్రకారం జరగవలసిన జనాభా లెక్కల సేకరణ, జనగణన, పీఏపీ వ్యతిరేకంగా ఇంకేదో చేస్తున్నారు. మొత్తానికి బోడిగుండుకు మోకాలుకు ముడేసి పనిగట్టుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. అయితే, పూజారి ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలచాడు అన్నట్లుగా రాహుల్ గాంధీ, చిందులు విందులు, విన్యాసాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు సరికదా, ఈ ఆందోళనల పుణ్యాన నెహ్రూ కుటుంబం చీకటి కోణాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి ఇందుకు సంబంధించి జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఒకవిధంగా సూది కోసం సోది కెళితే, అవేవో బయటపడ్డాయి అన్నట్లుగా, నెహ్రూ కుటుంబం కులగోత్రాలు, పుట్టు పూర్వోత్తరాలు.. ఒకటనేమిటి, ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలియని చాలా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటం వారసత్వంగా ఉన్న జాతీయ నాయకులలో మహాత్మా గాంధీ తర్వాత ఈ దేశం అత్యంత గౌరవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది జవహర్‌లాల్ నెహ్రూ. ఆయనకంటే, అర్హులైన వారు లేరా అంటే లేకపోలేదు, సర్దార్ పటేల్ వంటి మెరుగైన, నిజమైన గాంధీ వారసులు ఉన్నారు. నిజానికి ఆయనేమిటో? ఆయనకు ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటో? ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.
‘‘విద్యాపరంగా నేను ఇంగ్లీష్ వాడిని, సంస్కృతీ పరంగా ముస్లింను, నా ప్రమేయం లేకుండా ప్రమాద వశాత్తు హిందువుగా జన్మించాను’’ అని జవహర్‌లాల్ నెహ్రూ తన గురించి తాను చెప్పుకున్నారు. నిజమే.. ఈ మాటలు ఆయన అన్నవి కాదని, కాదు ఆయనే అన్నారనే వివాదం ఉందనుకోండి.. ఇప్పుడు ఆ వివాదంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. అలాగే, అదే సందర్భంలో నెహ్రూ హిందూ ధర్మం గురించి కూడా తమ అభిప్రా యాన్ని దాచుకోలేదు. ‘్భరతదేశంలో హిందూ ధర్మం బలంగా వేళళూనితే వినాశనమే మిగులుతుంది’ అని అన్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు (సుందరం) పేర్కొన్నారు. ఇంకా నెహ్రూ సన్నిహిత సంబంధం ఉన్న వారు అయన గురించి లోకానికి తెలియని, ఉద్దేశపూర్వకం గా దాచిపెట్టిన అనేక రహస్యాలు వెలుగు చూస్తున్నాయి. నిజమే.. నిజంగా నెహ్రూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక ఇంకెవరైనా ఆయన పట్ల తమకున్న అభిప్రాయాన్ని ఆయన అభిప్రాయంగా ప్రచారం చేశారా? అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. అయినా, ఆయన డీఎన్‌ఏ నింపుకున్న వ్యక్తులు, సంస్థల ప్రస్తుత ప్రవర్తన గమనిస్తే, జాతీయ వాదాన్ని జీర్ణించుకోలేని తత్త్వం నెహ్రూ కుటుంబ డీఎన్‌ఏలోనే ఉందని అనుకోవచ్చును. ఇది ఆయన గురించి ఆయనే చెప్పుకున్నా, ఆయన గురించి వేరొకరు చెప్పినా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయన్నది నిజం. ఇప్పుడు ఆయన పేరున స్థాపించిన డిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, జేఎన్యూలో జరుగుతున్న పరిణామా లు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఆయన వారసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆయన హిందూ ధర్మాన్ని ప్రమాదంగా భావించారు అనే అభిప్రాయం నిజమనే అనిపిస్తుంది. నెహ్రూ వారసులు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక వాద్రా పౌరసత్వ సవరణ చట్టం సీఏఏకి వ్యతిరేకంగా వేస్తున్న చిందులు, చేస్తున్న వీరంగం చూస్తే, వీటన్నిటికీ నెహ్రూ నాటిన హిందూ వ్యతిరేక భావబీజాలే కారణం వేరే చెప్పనక్కరలేదు.
నిజానికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ వాదాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకతకు నెహ్రూ డీఎన్‌ఏ ఒక కారణం అయితే, మహాత్మా గాంధీ కూడా అందులో ఎంతో కొంత పాలు పంచుకున్నారు. మనమంతా జాతిపితగా పిలుచు కునే గాంధీ మనందరికీ ప్రాతఃస్మరణీయులు. ఆయన త్రికరణ శుద్ధిగా హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముస్లింల మెప్పు కోసం కూడా కొంత పరితపించారు. దేశవిభజన సమయంలో ఆరు లక్షలమందికి పైగా హిందువులు ఊచకోతకు బలయ్యారు. రక్త కాసారాలను గుర్తుచేసే విధంగా హిందువుల రక్తం సరిహద్దుల గుండా ప్రవహించింది. అయినా గాంధీ, దేశాన్ని చీల్చుకుని, రక్తపాతాన్ని సృష్టించిన పాకిస్తానీయు లపై ప్రేమనే కురిపించారు. పటేల్, అంబేద్కర్ వంటి నాయకులు వారించినా వినకుండా హిందువుల రక్తంతో పరిశుద్ధమైన ‘పాకిస్థాన్’కు పట్టుపట్టి, కాదంటే నిరాహార దీక్ష చేస్తానని బెదిరించి రూ. 55కోట్ల ఆర్థిక సహాయం ఇప్పించారు. ఆ విధంగా ఆయన తమ దాతృత్వాన్ని ప్రదర్శించుకున్నారు. కానీ తదనంతర కాలంలో అందుకు ప్రతిగా పాక్ మనదేశానికి ఏమిచ్చింది? ఉగ్రవాదాన్ని ఇచ్చింది, వందలు కాదు వేలసంఖ్యలో భారతీయుల ప్రాణాలను బలి తీసుకుంది. తీసుకుంటోంది.. అందుకే కొందరు, గాంధీ పట్ల ఎంత గౌరవం ఉన్నా ఇనే్నళళుగా సాగుతున్న పాక్ కాష్టానికి గాంధీ అంకురార్పణ చేశారన్న బాధను మరిచిపోలేకపోతున్నారు.
ఈ పరిణామాల పర్యవసానంగానే, సరిహద్దులు దాటి జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించిన ప్రేరేపిత ఉగ్రవాదులు, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీల నాయ కుల అండదండలతో తలెగరేసిన స్థానిక ఉగ్ర తండాలు, వేర్పాటువాద శక్తులు, జమ్మూ కశ్మీర్‌లో దశాబ్దాలుగా నిత్య హింసను సాగిస్తున్నారు. చివరకు, అది ఎంతవరకు వెళ్లిందంటే, ఆరు లక్షలమంది కశ్మీర్ పండిట్లు స్వదేశంలో శరణార్థులు అయ్యారు. దీని గురించి ఆకాలంలో ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను రక్షించేందుకు ఆ కుటుంబానికి చెందిన వారు నడుం బిగించారు. అందులో భాగంగానే దేశాన్ని ముక్కలు చేస్తాం అంటూ, దేశ ద్రోహం కేసు ఎదుర్కొం టున్న కన్హయ కుమార్ ఫేమ్ జేఎన్యూ తుకడే తుకడే గ్యాంగ్‌ను, అంతకు మించిన అస్సాంను భారతదేశం నుంచి నరికి తీసుకుపోతామని ప్రకటించిన మరో జేఎ న్యూ విద్యార్థి నాయకుడు షార్జీ ఇమాంను ముందు పెట్టి సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేక ముసుగులో దేశ వ్యతిరేక ఆందోళనలు నడిపిస్తున్నారు. అయితే ఉద్యమం సాగే కొద్ద్దీ కాంగ్రెస్, కమీ అండ్ కో కప్పుకున్న ముసుగులు తొలిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో పుట్టి భారత పౌరసత్వం పొందిన సంగీత కళాకారుడు అద్నాన్ సమీని పద్మశ్రీ పురస్కారానికి ఎంపికచేస్తే, కాంగీ అండ్ కో తప్పుపడు తోంది. ఓ వంక సీఏఏ వ్యతిరేక ఆందోళన పేరుతో రోహిం గ్యాలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఆందోళన చేస్తూ.. మరో వంక పాక్‌కు చెందిన అద్నాన్‌కి పద్మశ్రీ ఇవ్వడం ఏమిటని? ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్, కమీ అండ్ కో ద్వంద ప్రమాణాలను ప్రదర్శిస్తున్నారు. ముందే అనుకున్న ట్లుగా కాంగ్రెస్ పార్టీ వేస్తున్న చిందులు, ఈ చిందుల్లో వెలుగు చూస్తున్న హిందూ వ్యతిరేక, జాతీయ వ్యతిరేక భావజాలమే ఆ పార్టీని కనుమరుగు చేస్తుంది.
*

- రాజనాల బాలకృష్ణ, 9985229722