సబ్ ఫీచర్

రామరాజ్యమే శ్రేయోదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతిలో అన్నిటికన్నా ముఖ్యమైన సత్యం ఒక్కటే. అదే శ్రీరాముడిని ఇతిహాసపురుషుడిగా తలచుకొనడం. అందుకు ఆయన వ్యక్తి త్వం, ధర్మాచరణ పరాయణతే కారణం. మనిషి మరణించిన తరువాత హిందువులు ‘‘రామనామం సత్యం’’ అంటారు. అంతేకాని వేరే ఏ దేవీ దేవతలను తలుచుకోరు. రామశబ్దంలో అంతటి మహత్తు ఉంది. రాముడు సర్వస్వం పోగొట్టుకున్నాడు. భార్యను, సంతానాన్ని, తల్లిదండ్రులను, రాజ్యసింహాసనాన్ని, అన్నదమ్ములను, పరివారాన్ని రాజ్యాన్ని, సమాజాన్ని చివరకు సుఖ శాంతులతో కూడిన అమూల్య జీవితాన్ని ధర్మాచరణకోసం తృణప్రాయంగా వదులుకున్నాడు. అందువల్లనే రామకథ నేటికీ భారతీయుల నోళ్ళలో నానుతోంది. ఆయన గుడిలేని గ్రామం లేదు. ఆయన ప్రజాస్వామ్యానికి ధర్మామీటరు, సదాచారానికి బారోమీటరు. రామరాజ్యం కావాలని ఇప్పటికి దేశ ప్రజలు కాంక్షిస్తున్నారు, స్వప్నాలు కంటున్నారు. గాంధీ మహాత్ముని ఆశయమూ రామరాజ్యమే!
శ్రీరాముడు అంటే మానవ రూపంలో మూర్త్భీవించిన ధర్మమే. తల్లులందరు తమ సంతానం శ్రీరాముడిలా నడుచుకోవాలనుకుంటారు. రామరాజ్య కాంక్ష ఈ దేశ ప్రజలలోనే కాదు నాయకులలోనూ అంతే తీవ్రంగా ఉంది. రామరాజ్యం ఎలా నడిచేదో నారద మహర్షి వర్ణించి చెప్పిన మాట. ‘‘రామరాజ్యంలో లోకం హర్షోల్లాసాలతో, సంతోషంతో, సంతృప్తితో, సమృద్ధితో, చక్కని ధర్మాచరణతో, ఏ వ్యాధి పీడలు లేకుండా, ఆరోగ్యంతో, కరువుకాటకాల భయం లేకుండా ఉండేది. రాముడు తత్వజ్ఞాన యాత్రలో మైలురాయివంటివాడు. ఆయన ఆంతర్యంలో సమకాలీయుడు, అభిప్రాయ పరిశీలకుడు, ముఖ్యంగా సహనశీలి అని చెప్పవచ్చును. రాముడు ఇంజనీరా, అతడు అయోధ్యలోనే జన్మించాడా అని శుష్క ప్రశ్నలు వేసే వారిని దేశం చూసింది. కానీ ఉత్తర దక్షిణ భారత్‌లను కలిపిన నాయకుడు. ఆ తరువాత కాలంలో తూర్పు పడమరలను కలిపిన ఇరుసు శ్రీకృష్ణుడు. రాముడు భారతదేశ చిత్రపటంలో రేఖాంశం అయితే శ్రీకృష్ణుడు అక్షాం శం. అందువలన విష్ణువు 8 భాగాలలో రాముడు కృష్ణుడు 16 భాగాలతో జన్మించారు.
రాముడి ఆయుధం సత్యం. రాజ్యాధికారాన్ని త్యాగం చేసి సాధారణ మానవుడిగా జీవించే అవకాశం ఆయనకు అందుబాటులో ఉంది. సీత విషయంలో తనపై ఒక సాధారణ మానవుడు నిందలు మోపినప్పుడు, రాజ్య ధర్మాన్ని పాటించి సీతను విడిచాడే కాని, అతడిని శిక్షించలేదు. మరి నేటికాలం మాదిరిగా రాముడు ఆలోచించి ఉంటే, అన్ని అధికారాలు తనకున్నాయ కాబట్టి, అతగాడిని శిక్షించడం, పెద్ద సమస్య కాదు. కానీ రాజు ఏది పాటిస్తే దానే్న ప్రజలు అనుసరిస్తారు. అందువల్ల రాజ ధర్మాన్ని ఇక్కడ పాటించాడు. నేటి మహిళలు ఈ చర్యను విమర్శించినా, అగ్నికంటే, కత్తివేటు కంటే భయంకరమైన బాధను కలిగించే భార్యా వియోగాన్ని కేవలం రాజధర్మం కోసమే పాటించిన మహాత్ముడు. అందు కనే నేటికీ ఆయన అందరికీ ఆరాధ్యుడయ్యాడు. అట్లా కాకుండా ఆయన నేటి రాజకీయ నాయకుల మాదిరిగానే ఆలోచించి, తనపై నిందలు మోపి నవాడిని శిక్షించి తన రాచరికాన్ని కాపాడుకున్నట్లయతే అడిగేదెవరు? కాని రాముడు అలాంటి నికృష్టమైన మార్గం సరికాదనుకున్నాడు.
ఆ అసాధారణమైన ప్రేమమూర్తి సర్వసుఖాలను వదులుకొనడానికే మొగ్గుచూపాడు. స్వార్థపూరితమైన తుచ్ఛ ఆలోచనలు ఆయనలో లేవు. ఏది న్యాయసంగతమో, ఏది ధర్మబద్ధమో, ఏవి కట్టుబాట్లో వాటికి కట్టుబడి, అనుసరించి, దాంపత్య జీవితాన్ని, పుత్రేషణను, పరివారపు ఆదరణను, సుఖాలను, సర్వస్వం ధర్మం కోసం తృణప్రాయంగా తలంచాడు. ఏ పాపము ఎరుగని భార్య సీతను వదిలేశాడన్న నిందను భరించాడే కాని రాజధర్మాన్ని పరిత్యజించలేదు. మరణావస్థతోనున్న శత్రువు విధ్వానుడైతే అతనితో వినయంగా ప్రవర్తించాలని అతనినుంచి రాజనీతి పాఠాలు నేర్చుకోవాలంటాడు రాముడు. తన తమ్ముడిని రావణుని వద్దకు పంపిస్తాడు. రాముడికి రాజ్యవిస్తరణ కాంక్ష లేదు. రావణ వధ అనంతరం లంక రాముని ఆధిపత్యంలోనికి వచ్చింది. ఆ స్వర్ణ లంకను దానికి వారసుడైన విభీషణుడికే దత్తం చేస్తాడు.

- గుమ్మా ప్రసాదరావు